Ravi Chavali
-
హత్యకు స్కెచ్
‘సామాన్యుడు, శ్రీమన్నారాయణ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి చావలి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘సూపర్ స్కెచ్’. హత్య నేపథ్యంలో నడిచే ఈ థ్రిల్లర్ స్టోరీలో నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్త, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, సోఫియా (లండన్) కీలక పాత్రలు చేశారు. ఎరోస్ సినిమాస్ సమర్పణలో బలరామ్ మక్కల నిర్మించిన ఈ చిత్రం ఎడిటింగ్ జరుపుకుంటోంది. రవి చావలి మాట్లాడుతూ– ‘‘ఒక పోలీసాఫీసర్, ఓ ఫారిన్ అమ్మాయి, నలుగురు క్రిమినల్స్ మధ్య జరిగే కథ ఇది. పోలీసును ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన క్రిమినల్స్ పాత్రల నేపథ్యంలో తెరకెక్కించాం. పోలీస్ అధికారిగా నర్సింగ్ నటన ఈ సినిమాకి హైలైట్. శ్రీహరిగారికి ప్రత్యామ్నాయం అన్నట్టు చేశాడు. ఉత్కంఠభరితంగా సాగేలా టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, బాపట్ల సూర్యలంక బీచ్, వికారాబాద్ ఫారెస్ట్‌లో 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాణం: యూ అండ్ ఐ క్రియేషన్స్, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ, కెమెరా: సురేంద్ర రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల. -
'ప్యార్ మే పడిపోయానే' మూవీ న్యూ స్టిల్స్
-
ప్యార్ మే పడిపోయానే మూవీ స్టిల్స్
-
ప్రేమలో పడిపోయారు..
‘‘దర్శకుడు రవి చావలి ‘సామాన్యుడు’ సినిమాలో మా నాన్న సాయికుమార్ పాత్రను చాలా విభిన్నంగా చూపించారు. ఇందులో నా పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుంది. రెగ్యులర్ ప్రేమ కథల్లా కాకుండా సరికొత్త ప్యార్‌ని ఇందులో ఆవిష్కరించారు’’ అని ఆది చెప్పారు. ఆది, శాన్వి జంటగా రవి చావలి దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ‘ప్యార్ మే పడిపోయానే’ చిత్రం టీజర్ ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘మా సంస్థలో ఇది నాలుగో సినిమా. కులుమనాలిలో త్వరలో చిత్రీకరించబోయే రెండు పాటలతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది’’ అని తెలిపారు. ఇది మ్యూజికల్ లవ్‌స్టోరీ అని దర్శకుడు పేర్కొన్నారు. తన కెరీర్లో ఇది బెస్ట్ మూవీ అని ఛాయాగ్రాహకుడు సురేందర్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ కృష్ణారెడ్డి, కళా దర్శకుడు రమణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎమ్మెస్ కుమార్ మాట్లాడారు. -
'ప్యార్ మే పడిపోయానే' మూవీ స్టిల్స్
-
ప్యార్ మే పడిపోయానే...
‘లవ్లీ’ పెయిర్ ఆది, శాన్వీ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్యార్ మే పడిపోయానే’. రవి చావలి దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ సినిమా 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పాటలు, పాటలకు సంబంధించిన సన్నివేశాలు మాత్రమే మిగిలివున్నాయని, ఈ నెల చివరి వారంలో మొదలయ్యే మూడో షెడ్యూల్లో వాటిని పూర్తి చేస్తామని నిర్మాత చెప్పారు. భిన్నమైన ఈ ప్రేమకథను రవి చావలి అద్భుతంగా డీల్ చేస్తున్నారని, అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని ఆది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి, కళ: కె.వి.రమణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్.