
ఆది సాయికుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘క్రేజీ ఫెలో’. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహించారు. దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ హీరోయిన్లు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసి, ఈ నెల 14న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
‘మావాడు చాలా మారిపోయాడు.. ఇంతకుముందులా లేడు’ అంటూ అనీష్ కురువిల్లా చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమై, ‘పుణ్యానికి పోతే పాపం ఎదురయిందంటే ఇదే అనుకుంటా’ అంటూ ఆది చెప్పే డైలాగ్‌తో ముగిసింది. ‘‘ఫ్యామిలీ, ఫన్, రొమాన్స్, యాక్షన్ ఉన్న చిత్రమిది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీకి సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, సంగీతం: ఆర్‌ఆర్ ధృవన్, కెమెరా: సతీష్ ముత్యాల
Comments
Please login to add a commentAdd a comment