సంతోషంలో ఓ స్పెషాల్టీ ఉంటుంది
– సురేశ్ కొండేటి
‘సంతోషం’ సౌత్ ఇండియన్ ఫిల్మ్ 16వ వార్షికోత్సవ అవార్డుల వేడుక ఈ నెల 12న హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ అవార్డులకు సంబంధించిన లోగోను ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, హీరోయిన్ రెజీనా లాంచ్ చేశారు. తొలి ఆహ్వాన పత్రికను శివాజీరాజా రెజీనాకు అందించారు.
శివాజీరాజా మాట్లాడుతూ –‘‘సంతోషం అవార్డ్స్ వేడుక 16వ వసంతంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. ‘మా’ అసోసియేషన్‌లోని పేద కళాకారులందరికీ ఆర్థికంగా ఆయన సహాయం చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఎప్పటిలానే సంతోషం వేడుకల్లో ఓ స్పెషాలిటీ ఫ్లాన్ చేశాం’’ అన్నారు ‘సంతోషం’ అధినేత సురేశ్ కొండేటి. ‘‘సంతోషం అవార్డు తీసుకోవాలన్న నా కల ‘ప్రేమకావాలి’తో తీరింది’’ అన్నారు హీరో ఆది. సురేశ్ కొండేటికి రెజీనా, హెబ్బా పటేల్ శుభాకాంక్షలు తెలియజేశారు.