santosham awards
-
గోవాలో ఘనంగా సంతోషం అవార్డ్స్ వేడుక (ఫొటోలు)
-
అతడు ఫెయిలయ్యాడు, మాకు పీఆర్వో కాదు.. అల్లు అరవింద్ సీరియస్
ఈ మధ్య సినిమా ప్రమోషన్స్‌లో విలేఖరి సురేశ్ కొండేటి పేరు మారుమోగుతోంది. సెలబ్రిటీలను చిత్రవిచిత్ర ప్రశ్నలడుగుతూ సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయాడు. ఈయన చాలాకాలం నుంచి సంతోషం అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాడు. అయితే ఈసారి ఏకంగా గోవాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దక్షిణాది నుంచి పలువురు సెలబ్రిటీలను ఈవెంట్‌కు తీసుకెళ్లాడు. కానీ ఈ ఫంక్షన్ రసాభాసగా జరగడంతో టాలీవుడ్ పరువుపోయే పరిస్థితికి వచ్చింది. కన్నడ సెలబ్రిటీలకు ఇబ్బందులు ఈవెంట్ నిర్వహణలో కన్నడ సెలబ్రిటీలకు చేదు అనుభవం ఎదురైందట. స్టేజీపై కన్నడ నటులకు అవార్డులు ఇస్తున్న సమయంలో సడన్‌గా లైట్స్ ఆర్పేసి వారిని అవమానించారని, హోటల్ సిబ్బందితోనూ ఇబ్బందులు ఎదురయ్యాయంటూ.. కన్నడ ప్రతినిధులు సంతోషం అవార్డు వేడుకల మీద విమర్శలు చేస్తూ టాలీవుడ్‌ను తప్పుపడుతున్నారు. వేడుక మధ్యలో నుంచే యాంకర్ వెళ్లిపోయిందని, తమకు సరైన ఏర్పాట్లు చేయకుండా దారుణంగా అవమానించారంటూ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించాడు. ఒక వ్యక్తి చేసిన పొరపాటు 'ఒక జర్నలిస్టు అనేక సంవత్సరాలుగా అవార్డు ఫంక్షన్స్ నిర్వహిస్తున్నాడు. ఈసారి గోవాలో చేద్దామనుకున్నాడు, కానీ ఏదో కొన్ని కారణాల వల్ల ఫెయిలయ్యాడు, చేయలేకపోయాడు. ఆ ఫంక్షన్‌కు వెళ్లినవారు ఇబ్బందులు పడ్డారు. అందులో ఇతర భాషల వారు కూడా ఉన్నారు. వాళ్లు తెలుగు సినీ ఇండస్ట్రీని నిందిస్తున్నారు. అది సరైనది కాదు. ఒక వ్యక్తి చేసిన పొరపాటును ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. అలాగే మీడియా.. అతడిని మా కుటుంబానికి చెందిన వ్యక్తికి పీఆర్వో అని రాస్తున్నారు. ఆయన ఎవరికీ పీఆర్వో కాదు. మా ఫ్యామిలీకి చెందిన పీఆర్వో అసలే కాదు. తను సొంతంగా ఏదో కార్యక్రమం చేయాలనుకుని ఫెయిలయ్యాడు.. అంతే!' అని పేర్కొన్నాడు. .#Kannada celebrities face humilation at #SanthoshamSouthIndian Film awards #Goa It is with deep concern and disappointment that we need to address the distressing events that transpired at the #Santhosham #South #Indian Film Awards 2023 The award function that is organised by… pic.twitter.com/s0kXAKPmh1 — A Sharadhaa (@sharadasrinidhi) December 3, 2023 చదవండి: జపాన్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. అప్పుడే స్ట్రీమింగ్ -
25 ఏళ్లుగా ‘సంతోషం’.. మరో మూడేళ్లు గ్యారెంటీ: సురేశ్ కొండేటి
‘చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి అగ్ర హీరోల ప్రోత్సాహంతో గత 25 ఏళ్లుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డులను అందిస్తున్నాను. మరో మూడేళ్లు కూడా కచ్చితంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి’అని ‘సంతోషం’ పత్రికాధినేత సురేష్ కొండేటి అన్నారు. డిసెంబర్ 2న గోవాలో ‘సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డులు– 2023’ వేడుక జరుగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా సురేశ్ కొండేటి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 18న హైదరాబాదులో సంతోషం ఓటీటి అవార్డ్స్‌ని, డిసెంబర్ 2న గోవాలో సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు ఆయన వెల్లడించారు. ఫంక్షన్ నిర్వహణకు గోవా ప్రభుత్వ అధికారులు చేసిన సహాయం మర్చిపోలేనిదన్నారు. -
సంతోషం అవార్డ్స్ మొట్టమొదటి OTT అవార్డులు (ఫొటోలు)
-
‘సంతోషం’ ఫిల్మ్ అవార్డుల వేడుక
-
సంతోషంలో ఓ స్పెషాల్టీ ఉంటుంది
– సురేశ్ కొండేటి ‘సంతోషం’ సౌత్ ఇండియన్ ఫిల్మ్ 16వ వార్షికోత్సవ అవార్డుల వేడుక ఈ నెల 12న హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ అవార్డులకు సంబంధించిన లోగోను ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, హీరోయిన్ రెజీనా లాంచ్ చేశారు. తొలి ఆహ్వాన పత్రికను శివాజీరాజా రెజీనాకు అందించారు. శివాజీరాజా మాట్లాడుతూ –‘‘సంతోషం అవార్డ్స్ వేడుక 16వ వసంతంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. ‘మా’ అసోసియేషన్‌లోని పేద కళాకారులందరికీ ఆర్థికంగా ఆయన సహాయం చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఎప్పటిలానే సంతోషం వేడుకల్లో ఓ స్పెషాలిటీ ఫ్లాన్ చేశాం’’ అన్నారు ‘సంతోషం’ అధినేత సురేశ్ కొండేటి. ‘‘సంతోషం అవార్డు తీసుకోవాలన్న నా కల ‘ప్రేమకావాలి’తో తీరింది’’ అన్నారు హీరో ఆది. సురేశ్ కొండేటికి రెజీనా, హెబ్బా పటేల్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
నటి వ్యభిచారం కేసులో కొత్త మలుపు
హైదరాబాద్: వ్యభిచారం కేసులో అరెస్టయిన టాలీవుడ్ నటి కేసు కొత్త మలుపు తిరిగింది. మరో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్ లో ప్రముఖ సినిమా నటి పట్టుబడి సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో సదరు నటి పోలీసులకు చిక్కింది. అయితే ఈ హోటల్ గదిని సంతోషం అవార్డ్స్ నిర్వాహకులు బుక్ చేసినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని రిమాంగ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు కోర్టు ఎదుట కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. డిఫెన్స్ న్యాయవాది ప్రదీప్ కుమార్ తన వాదనల్లో ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిజనిర్ధారణ కోసం సంతోషం అవార్డ్స్ నిర్వాహకులను పోలీసులు ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది. కాగా, తనను పోలీసులు అన్యాయంగా ఇరికించారని బాధితురాలు వాపోయింది. సంతోషం అవార్డ్స్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు హోటల్ గదికి వెళ్లానని పేర్కొంది. తాను విద్యార్థిని అని, గ్రాడ్యుయేషన్ చేస్తున్నానని కూడా కోర్టుకు తెలిపింది. వీడియో ద్వారా ఆమె వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. వ్యభిచారం కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆమె చెప్పినదాంట్లో వాస్తవం లేదని పోలీసులు అంటున్నారు. -
సంతోషం ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ పార్టు - 2
-
సంతోషం ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ పార్టు - 1
-
అప్పట్లో నా సామిరంగా.. జయమాలిని డాన్సు చేస్తే!!
నీ ఇల్లు బంగారం కానూ... నా ఒళ్లు సింగారం కానూ.. అంటూ అలనాటి ప్రేక్షకులను తన మేని విరుపులతో ఉర్రూతలూగించిన మేటి డాన్సర్ జయమాలిని. ఆ రోజుల్లో ఆమె ఒక్క డాన్సు చేశారంటే తామంతా కళ్లు తెరకు అప్పగించి మరీ చూసేవాళ్లమని అంటున్నారు.. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'సంతోషం' సినీ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి జయమాలిని వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆంధ్రులకు ఆమె తన దర్శన భాగ్యం కల్పించారు. గులాబిరంగు చుడీదార్ ధరించి.. ఇప్పటికీ ఏమాత్రం మార్పు లేకుండా కనిపించిన జయమాలిని అందరినీ అలరించారు. ఇదే కార్యక్రమానికి హాజరైన బ్రహ్మానందం.. ఆమె డాన్సుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ రోజుల్లో ఆమె డాన్సు చేశారంటే కుర్రాళ్లను పట్టుకోవడం అసాధ్యమని చెప్పారు. 'గు.. గు... గుడెసుంది' అంటూ డ్రైవర్ రాముడు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆమె ఒక్క డాన్సు చేశారంటే అప్పట్లో నా సామిరంగా.. అంటూ ప్రేక్షకులందరితో పాటు జయమాలినిని కూడా నవ్వుల్లో ముంచెత్తారు. 1975 నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు యువప్రేక్షకులకు తన డాన్సులతో ఓ రేంజ్లో కిక్ ఎక్కించారు జయమాలిని. 'నీ ఇల్లు బంగారం కానూ.. నా ఒళ్లు సింగారం కానూ...', 'గుడివాడ వెళ్లాను.. గుంటూరు వెళ్లాను..', 'పుట్టింటోళ్లు తరిమేశారు...' అంటూ పలు హాట్ సాంగ్స్‌లో చాలా హాట్ హాట్‌గా నర్తించిన ఈ హాట్ లేడీని మర్చిపోవడం అంత సులువు కాదు. అయితే, జయమాలిని వెండితెరకు దూరమైన తర్వాత పబ్లిక్‌లో కనిపించడమే మానేశారు. సూళ్లూరుపేటలో పుట్టిన ఆమె చెన్నైలో ఉంటున్నారు. అందుకే, ఇక్కడి ప్రేక్షకులకు కనిపించడం మానేశారు. ఎట్టకేలకు 22 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించి అందరినీ అలరించారు.