నటి వ్యభిచారం కేసులో కొత్త మలుపు | tollywood Actress sex racket: Magazine booked hotel room | Sakshi
Sakshi News home page

నటి వ్యభిచారం కేసులో కొత్త మలుపు

Published Thu, Oct 2 2014 9:26 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

నటి వ్యభిచారం కేసులో కొత్త మలుపు - Sakshi

నటి వ్యభిచారం కేసులో కొత్త మలుపు

హైదరాబాద్: వ్యభిచారం కేసులో అరెస్టయిన టాలీవుడ్ నటి కేసు కొత్త మలుపు తిరిగింది. మరో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్ లో ప్రముఖ సినిమా నటి పట్టుబడి సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో సదరు నటి పోలీసులకు చిక్కింది.

అయితే ఈ హోటల్ గదిని సంతోషం అవార్డ్స్ నిర్వాహకులు బుక్ చేసినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని రిమాంగ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు కోర్టు ఎదుట కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. డిఫెన్స్ న్యాయవాది ప్రదీప్ కుమార్ తన వాదనల్లో ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిజనిర్ధారణ కోసం సంతోషం అవార్డ్స్ నిర్వాహకులను పోలీసులు ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది.

కాగా, తనను పోలీసులు అన్యాయంగా ఇరికించారని బాధితురాలు వాపోయింది. సంతోషం అవార్డ్స్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు హోటల్ గదికి వెళ్లానని పేర్కొంది. తాను విద్యార్థిని అని, గ్రాడ్యుయేషన్ చేస్తున్నానని కూడా కోర్టుకు తెలిపింది. వీడియో ద్వారా ఆమె వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. వ్యభిచారం కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆమె చెప్పినదాంట్లో వాస్తవం లేదని పోలీసులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement