
వెండితెరపై హీరోయిన్‌గా అలరించిన నటి యమున ఆ తర్వాత సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. తన అందం, అభినయంతో చక్కటి గుర్తింపు సొంతం చేసుకుంది. కెరీర్ పీక్స్ స్టేజ్‌లో ఉండగానే ఓ చేదు సంఘటన ఆమెకు ఎదురైంది. 2011లో బెంగుళూరులోని ఓ హోటల్‌లో వ్యభిచారం కేసులో యమున పట్టుబడిందనే వార్త అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. దీంతో యమున కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది.
ఆ తర్వాత ఈ విషయంలో తన తప్పేమీ లేదని, కావాలనే తనని ఇరికించారని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో యమున చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ తనను వేధిస్తున్నారని, ఆ సంఘటనకు సంబంధించి అసభ్యకరమైన థంబ్‌నైల్స్‌తో మానసికంగా హింసిస్తున్నారంటూ ఓ వీడియో ద్వారా ఆవేదనను వెల్లడించింది. ''ఆ సంఘటన తాలూకూ బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది.
ఆరోజు అసలేం ఏం జరిగిందన్నది ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పేశాను. ఆ విషయంలో న్యాయస్థానం కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చి నన్ను గెలిపించింది.కానీ సోషల్‌మీడియాను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇప్పటికీ నా గురించి, నా సంఘటన గురించి చెత్త థంబ్‌ననైల్స్‌తో వీడియోలు పెడుతున్నారు. అవి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎంత మోటివేట్ చేసుకున్నా, నేను కూడా మనిషినే కదా.. ఒకవేళ నేను చనిపోయినా వీళ్లు నన్ను వదలరు అనిపిస్తుంది'' అంటూ తన బాధను వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment