'పక్కింటి అబ్బాయి'గా చుట్టాలబ్బాయి.. | Aadi next film named as 'Pakkinti abbayi' | Sakshi
Sakshi News home page

'పక్కింటి అబ్బాయి'గా చుట్టాలబ్బాయి..

Published Tue, Aug 30 2016 8:00 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

Aadi next film named as 'Pakkinti abbayi'

ఇటీవల 'చుట్టాలబ్బాయి'గా ప్రేక్షకులను పలకరించిన ఆది త్వరలో 'పక్కింటి అబ్బాయి'గా అలరించనున్నాడు. సోమవారం హైదరాబాద్లో జరిగిన 'చుట్టాలబ్బాయి' సినిమా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా తెరకెక్కిన చుట్టాలబ్బాయి సినిమా ఆదికి చెప్పుకోదగ్గ హిట్ ఇచ్చింది.

అదే ఉత్సాహంతో ఇప్పుడు 'పక్కింటి అబ్బాయి'ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.  'పక్కింటి అబ్బాయి'ని స్వయంగా తానే నిర్మిస్తానని ఆది తండ్రి, ప్రముఖ నటుడు సాయికుమార్ తెలిపారు. ఇదివరకు ఆది హీరోగా వచ్చిన 'గరం' సినిమాకు సాయి కుమారే నిర్మాతగా వ్యవహరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement