యంగ్ హీరోస్ నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్, సుదీర్ బాబులు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ శమంతకమణి. గతంలో ఎన్నడూ లేని విధంగా నలుగురు యంగ్ హీరోస్ ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అందుకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ పోస్టర్ లో మరింత హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్ తాజాగా టీజర్ తో మరోసారి ఆకట్టుకుంది. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మెకానిక్ మహేష్ బాబుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాపై మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.