లైక్‌ డాడ్స్‌ – లైక్‌ సన్స్‌ | 'Aadhi' review: Pranav Mohanlal makes a fine debut, impresses in action sequences | Sakshi
Sakshi News home page

లైక్‌ డాడ్స్‌ – లైక్‌ సన్స్‌

Published Sun, Jan 28 2018 12:48 AM | Last Updated on Sun, Jan 28 2018 12:48 AM

'Aadhi' review: Pranav Mohanlal makes a fine debut, impresses in action sequences - Sakshi

దుల్కర్‌ సల్మాన్‌, ప్రణవ్‌ మోహన్‌ లాల్‌

మమ్ముటి, మోహన్‌లాల్‌ మలయాళ సూపర్‌ స్టార్స్‌. ఇద్దరూ సూపర్‌ స్టార్స్‌ అంటే పోటీ సహజమే. కానీ అది కేవలం సినిమాల వరకు మాత్రమే. బయట వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. వాళ్లనే వాళ్ల వారసులు కూడా ఫాలో అవుతున్నారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ ఆల్రెడీ హీరోగా హిట్‌. ఇప్పుడు మెహన్‌ లాల్‌ తనయుడు ప్రణవ్‌ మోహన్‌ లాల్‌ ‘ఆది’ సినిమా ద్వారా మలయాళ ఇండస్ట్రీకు పరిచయం అయ్యాడు. ‘ఆది’ సినిమా ఈ నెల 26న విడుదలైంది.  ఈ సందర్భంగా ప్రణవ్‌ డెబ్యూ సినిమాకు దుల్కర్‌ సల్మాన్‌ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లెటర్‌ రాసి, ఫేస్‌బుక్‌ ద్వారా పంచుకున్నారు.

‘‘డియరెస్ట్‌ అప్పు, ‘ఆది’ సినిమాకు ఆల్‌ ది వెరీ బెస్ట్‌. మనిద్దరం ఎప్పుడూ మంచి ఫ్రెండ్లీ బాండ్‌ను షేర్‌ చేసుకున్నాం. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్‌ చిన్నపిల్లాడివి. మనం ఫ్రెండ్స్‌ అయినప్పడు నీకు  ఏడేళ్లు. నేను హై స్కూల్‌లో చదువుతున్నాను. నువ్వు నాకు ఎప్పటికీ ‘లిటిల్‌ బ్రదర్‌’వే. నీ ప్రతీ స్టెప్‌ను అప్రిషియేట్‌ చేస్తూ, నీ సక్సెస్‌ కోరుకుంటున్నాను. నీ పెరెంట్స్, సిస్టర్‌ నీ ఎంట్రీకు ఎంత ఎగై్జటెడ్‌గా ఉన్నారో నాకు తెలుసు అండ్‌ వాళ్లు అస్సలు వర్రీ అవ్వాల్సిన పని కూడా లేదు.

ఎందుకంటే నువ్వు పుట్టిందే సూపర్‌ స్టార్‌ అవ్వడం కోసం’’ అంటూ ప్రణవ్‌కు హృదయపూర్వక విషెస్‌ తెలిపారు దుల్కర్‌ సల్మాన్‌. చాలా బాగుంది కదూ. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఏ నటుడైనా తన తొలి సినిమాను స్క్రీన్‌ పై చూసుకొని మురిసిపోవాలనుకుంటాడు. కానీ ప్రణవ్‌ మోహన్‌ లాల్‌ మాత్రం అందుకు భిన్నం. ప్రణవ్‌కు ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టమట. తన తొలి సినిమా ‘ఆది’ షూటింగ్‌ కంప్లీట్‌ అవ్వగానే తన ఫేవరేట్‌ ప్లేస్‌ హిమాలయాలకు వెళ్లిపోయాడట. ప్రణవ్‌ తనను తాను ఇంకా  స్క్రీన్‌ మీద చూసుకోలేదు అని దర్శకుడు జీతూ జోసెఫ్‌ పేర్కొన్నారు. ‘ఆది’ మూవీకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రణవ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ బాగా చేశాడని, మిగతా సీన్స్‌ కూడా ఓకే అని టాక్‌. సో.. మోహన్‌ లాల్‌ ఫుల్‌ హ్యాపీ అన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement