మరో హిట్ సినిమా ఓటీటీ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. గత నెలల థియేటర్లలోకి వచ్చిన 'వర్షంగల్కు శేషం' అనే మలయాళ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ మలయాళంలో మాత్రం మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది.
(ఇదీ చదవండి: 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)
'హృదయం' మూవీతో హిట్ కొట్టిన ప్రణవ్ మోహన్ లాల్- వినీత్ శ్రీనివాసన్ కాంబో మరోసారి 'వర్షంగల్కు శేషం' అనే పీరియాడిక్ డ్రామా సినిమా కోసం కలిసి పనిచేశారు. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన దీన్ని 80ల్లో సినిమా బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మూవీస్‌కి రిలేట్ అయ్యే కథలంటే ఇష్టపడే వాళ్లకు ఇది కచ్చితంగా నచ్చేస్తుంది!
'వర్షంగల్కు శేషం' కథ విషయానికొస్తే.. 80-90ల్లో కేరళ. వేణు(ధ్యాన్ శ్రీనివాసన్)కి చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి. వీటి ద్వారానే సంగీత విద్వాంసుడు మురళి (ప్రణవ్ మోహన్ లాల్)తో పరిచయమవుతాడు. ఇతడి టాలెంట్ చూసి మద్రాస్ వెళ్తే బాగుంటుంగదని వేణు సలహా ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్లిద్దరూ కలిసి చెన్నై (ఒకప్పటి మద్రాసు) వెళ్తారు. మురళి ప్రయత్నంతో వేణు దర్శకుడు అవుతాడు. కొన్ని కారణాల వల్ల స్నేహితుల మధ్య దూరం పెరుగుతుంది. అలాంటి వీళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా ఎలా చేశారు? చివరకు ఏమైంది? అనేదే మెయిన్ స్టోరీ.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
Comments
Please login to add a commentAdd a comment