
మలయాళ సినిమాలు అనగానే సింపుల్ స్టోరీలే గుర్తొస్తాయి. కానీ ఈ మధ్య వీళ్లు కూడా రూట్ మార్చి యాక్షన్ మూవీస్ తీస్తున్నారు. గతేడాది చివర్లో మార్కో, రీసెంట్ టైంలో ఎల్ 2 ఎంపురాన్ చిత్రాలు ఈ కోవకే చెందినవే. ఈ తరహా కథతో తీసిన మరో మలయాళ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.
ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'దావీద్'(Daveed Movie). ఓ ఫెయిల్యర్ బాక్సర్ నేపథ్యంగా తీసిన ఈ మూవీకి మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కాగా.. దాదాపు రెండు నెలల తర్వాత అంటే ఏప్రిల్ 11 నుంచి ఓటీటీలోకి (Ott Movie) వచ్చేస‍్తోంది. ఈమేరకు జీ5 సంస్థ అధికారికంగా ప్రకటించింది.
(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా)
దావీద్ విషయానికొస్తే.. భార్య సంపాదనపై బతికే అబు (ఆంటోనీ వర్గీస్).. కూతురితో రోజూ కాలక్షేపం చేస్తూ బతికేస్తుంటాడు. అప్పుడప్పుడు బౌన్సర్ గా పనిచేస్తుంటాడు. ఓరోజు అలానే బాక్సింగ్ ఈవెంట్ కి వెళ్తే.. అబుని ఓ బాక్సర్ ఒక్క పంచ్ గుద్దుతాడు. పోటీకి రమ్మని సవాలు విసురుతాడు. దీంతో అబు.. బాక్సర్ ట్రైనింగ్ తీసుకుంటాడు. తర్వాత ఏమైందనేదే స్టోరీ.
ప్రస్తుతానికి మలయాళంలో మాత్రం స్ట్రీమింగ్ ఉండొచ్చని ప్రకటించారు. కానీ రీసెంట్ టైంలో రిలీజైన పలు చిత్రాల తెలుగు వెర్షన్ కూడా హడావుడి లేకుండా తీసుకొచ్చేస్తున్నారు. దావీద్ కూడా తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఆంథాలజీ సినిమా)