ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓటీటీ సంస్థల లెక్కలు మారిపోయాయి. అప్పట్లో ఎగబడిపోవట్లేదు. కోట్లు పెట్టి సినిమాలు కొనేసి చేతులు కాల్చుకోవట్లేదు. ఇప్పుడు దీని వల్ల కొన్ని హిట్ చిత్రాలకు కూడా తలనొప్పులు ఎదురవుతున్నాయి. కొన్నిరోజుల ముందు థియేటర్లలోకి వచ్చిన మలయాళ చిత్రం 'మంజుమ్మల్ బాయ్స్' సూపర్ హిట్ అయింది. ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కానీ దీని ఓటీటీ లెక్క మాత్రం ఇంకా తెగట్లేదట.
ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర 'హనుమాన్' రచ్చ లేపింది. ఫిబ్రవరిలో మాత్రం టాలీవుడ్ సౌండ్ పూర్తిగా తగ్గిపోయింది. మరోవైపు ఇదే ఫిబ్రవరిలో మలయాళంలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నాయి. వీటిలో ఒకటే 'మంజుమ్మల్ బాయ్స్'. కేరళలోని మంజమ్మల్ అనే ఊరిలోని కొందరు కుర్రాళ్లు.. కొడైకెనల్ ట్రిప్‌కి వెళ్తారు. ఇందులో ఒకడు అనుకోకుండా ఓ గుహలో పడిపోతాడు. మిగతా వాళ్లందరూ కలిసి ఈ ఒక్కడిని ఎలా కాపాడారు ఏంటనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
స్టోరీ సింపుల్‌గా అనిపిస్తున్నప్పటికీ.. సర్వైవల్ డ్రామా సినిమాగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంంటోంది. కేరళ, తమిళనాడులో దీనికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ వసూళ్లు, ఓవరాల్‌గా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఓటీటీ డీల్ మాత్రం ఇంకా తెగలేదట. మూవీ టీమ్ ఏమో రూ.20 కోట్ల వరకు అడుగుతుంటే.. పలు ఓటీటీ సంస్థలు మాత్రం రూ.10 కోట్లు మాత్రమే ఇస్తామని అంటున్నారు.
ఇప్పటికే థియేటర్లలో 'మంజుమ్మల్ బాయ్స్'ని చాలామంది చూసేశారు. కాబట్టి ఓటీటీలో ఓ మాదిరి రీచ్ ఉంటుందని ఆయా సంస్థలు కారణాన్ని చెబుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాని తెలుగులో మార్చి 15న రిలీజ్ చేస్తారనే టాక్ వినిపించింది. కానీ సౌండ్ పెద్దగా లేదు. తెలుగు డబ్బింగ్ విడుదలపై, అలానే ఓటీటీ స్ట్రీమింగ్‌పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment