
ఓటీటీలో ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన సినిమా 'రేఖాచిత్రం'. పేరుకే మలయాళ సినిమా గానీ తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చేసింది. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మరో దానిలోనూ కేవలం తెలుగు వెర్షన్ అందుబాటులోకి రానుంది.
మలయాళ దర్శకులు థ్రిల్లర్ సినిమాలు తీయడంలో స్పెషలిస్టులు. అలా ఈ ఏడాది జనవరి తొలి వారంలో 'రేఖాచిత్రం' మూవీని విడుదల చేశారు. రూ.10 కోట్లతో నిర్మిస్తే రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు రెండు నెలల తర్వాత గత శుక్రవారం ఓటీటీలోకి వచ్చింది.
(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))
మన దగ్గర సోనీ లివ్ ఓటీటీలో చూసేవాళ్లు తక్కువని చెప్పొచ్చు. బహుశా ఇది గమనించారో ఏమో గానీ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి 'రేఖాచిత్రం' తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. మార్చి 14 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
'రేఖాచిత్రం' విషయానికొస్తే.. 40 ఏళ్ల క్రితం తాము ఓ అమ్మాయిని హత్య చేశామని చెప్పి ఓ పెద్దాయన ఆత్మహత్య చేసుకుంటాడు. అదేరోజు ఆ ఊరిలో ఎస్ఐగా జాయిన్ అయిన వివేక్ దర్యాప్తు మొదలుపెడతాడు. ఒక్కో ఆధారం వెతుకుతూ వెళ్లేకొద్ది దొంగ దొరుకుతాడు. ఇంతకీ హత్యకు గురైన అమ్మాయి ఎవరు? ఎందుకు చంపారనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

Comments
Please login to add a commentAdd a comment