
మలయాళ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొత్త మూవీ ఓటీటీలో రిలీజ్ కావడం లేటు. మనోళ్లు చూసేస్తుంటారు. వాళ్ల కోసమా అన్నట్లు ఇప్పుడు క్రేజీ డార్క్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. అధికారికంగా తేదీ కూడా ప్రకటించారు.
రీసెంట్ టైంలో మలయాళ ఓటీటీల సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు బాసిల్ జోసెఫ్. స్వతహాగా ఇతడు దర్శకుడే కానీ ఈ మధ్య హీరో తరహా పాత్రలు పోషిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. అలా రీసెంట్ గా 'పొన్ మ్యాన్' అనే మూవీతో వచ్చాడు.
(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))
జనవరి 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. డార్క్ కామెడీ కథ కావడం, బాసిల్ నటన దీనికి ప్లస్ అని చెప్పొచ్చు. ఇప్పుడీ చిత్రాన్ని హాట్ స్టార్ లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలుగులోనూ రిలీజయ్యే అవకాశముంది.
'పొన్ మ్యాన్' విషయానికొస్తే హీరో పేరు అజేష్ (బాసిల్ జోసెఫ్). పెళ్లిళ్ల కోసం బంగారాన్ని అద్దెకిస్తుంటాడు. తద్వారా చదివింపులుగా వచ్చిన డబ్బుల్ని తీసుకుంటూ ఉంటాడు. అలా ఓసారి ఓ అమ్మాయి కుటుంబానికి 25 సవర్ల బంగారం ఇస్తాడు. కానీ వాళ్లేమో తిరిగి 13 సవర్లు మాత్రమే ఇస్తారు. దీంతో గొడవ జరుగుతుంది. మరి చివరకు ఇది ఎక్కడ ముగిసిందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)
