Anaswara Rajan
-
మరో ఓటీటీలోకి క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. కేవలం తెలుగులో
ఓటీటీలో ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన సినిమా 'రేఖాచిత్రం'. పేరుకే మలయాళ సినిమా గానీ తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చేసింది. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మరో దానిలోనూ కేవలం తెలుగు వెర్షన్ అందుబాటులోకి రానుంది.మలయాళ దర్శకులు థ్రిల్లర్ సినిమాలు తీయడంలో స్పెషలిస్టులు. అలా ఈ ఏడాది జనవరి తొలి వారంలో 'రేఖాచిత్రం' మూవీని విడుదల చేశారు. రూ.10 కోట్లతో నిర్మిస్తే రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు రెండు నెలల తర్వాత గత శుక్రవారం ఓటీటీలోకి వచ్చింది.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))మన దగ్గర సోనీ లివ్ ఓటీటీలో చూసేవాళ్లు తక్కువని చెప్పొచ్చు. బహుశా ఇది గమనించారో ఏమో గానీ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి 'రేఖాచిత్రం' తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. మార్చి 14 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.'రేఖాచిత్రం' విషయానికొస్తే.. 40 ఏళ్ల క్రితం తాము ఓ అమ్మాయిని హత్య చేశామని చెప్పి ఓ పెద్దాయన ఆత్మహత్య చేసుకుంటాడు. అదేరోజు ఆ ఊరిలో ఎస్ఐగా జాయిన్ అయిన వివేక్ దర్యాప్తు మొదలుపెడతాడు. ఒక్కో ఆధారం వెతుకుతూ వెళ్లేకొద్ది దొంగ దొరుకుతాడు. ఇంతకీ హత్యకు గురైన అమ్మాయి ఎవరు? ఎందుకు చంపారనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ)
మలయాళ సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చేవి థ్రిల్లర్స్. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో థ్రిల్లర్ మూవీస్ తీస్తూనే ఉంటారు. అలా ఈ ఏడాది జనవరిలో థియేటర్లలో రిలీజై హిట్ కొట్టినంది 'రేఖాచిత్రం'. ఇప్పుడు దీని తెలుగు వెర్షన్ సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)కథేంటి?రాజేంద్రన్ (సిద్ధిఖ్) అనే ఓ పెద్దాయన.. మలకపార ప్రాంతంలోని అడవిలో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. చనిపోవడానికి ముందు ఓ వీడియో రికార్డ్ చేస్తాడు. 40 ఏళ్ల క్రితం ఓ అమ్మాయిని హత్య చేశామని, మరో ముగ్గురితో కలిసి ఇప్పుడు కూర్చున్న చోటే ఆమెని పాతిపెట్టాం అని సదరు వీడియోని ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తాడు. అదేరోజు ఆ ఊరి ఎస్ఐగా వివేక్ (అసిఫ్ అలీ) జాయిన్ అవుతాడు. రాజేంద్రన్ చెప్పినట్లు అక్కడ తవ్వితే నిజంగానే ఓ అమ్మాయి ఎముకలు దొరుకుతాయి. అలా ఈ కేసు దర్యాప్తు మొదలవుతుంది. ఇంతకీ హత్యకు గురైన అమ్మాయి ఎవరు? ఆమెను ఎందుకు చంపారు? హత్య చేసిన వాళ్లు పట్టుబడ్డారా లేదా అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు తీయడం మలయాళీ దర్శకులకు వెన్నతో పెట్టిన విద్య. అలా అని 'రేఖాచిత్రం' ఏదో డిఫరెంట్ అని కాదు. ఎప్పటిలానే ఇదో మర్డర్ మిస్టరీ. కాకపోతే దీన్ని డీల్ చేసిన విధానం. సస్పెన్స్ ఎలిమెంట్స్ ని ఒక్కొక్కటిగా రివీల్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.వివేక్ ఓ పోలీస్. కానీ డ్యూటీ టైంలో బెట్టింగ్స్ ఆడుతున్నాడని సస్పెండ్ చేస్తారు. కొన్నాళ్లకు ఓ మారుమూల పల్లెటూరికి ట్రాన్స్ ఫర్ చేస్తారు. సరిగ్గా జాయిన్ అయిన రోజే ఓ అమ్మాయి మర్డర్ కేసు. అది కూడా 40 ఏళ్ల క్రితం ఈమెని చంపి పాతిపెట్టి ఉంటారు. రాజేంద్రన్ అనే వ్యక్తి ఈ విషయాల్ని బయటపెట్టి చనిపోతాడు. దీంతో అసలు రాజేంద్రన్ ఎవరు? చనిపోయిన అమ్మాయి ఎవరు? ఆమెకు 1985లో రిలీజైన మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి 'కాతోడు కాతరం' సినిమాకు సంబంధం ఏంటనేది వివేక్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ క్రమంలోనే పలు అడ్డంకులు కూడా ఎదురవుతాయి.సినిమా మొదలైన ఐదు నిమిషాలకే మర్డర్ గురించి తెలుస్తుంది. అలా మనల్ని దర్శకుడు కథలోకి నేరుగా తీసుకెళ్లిపోతాడు. స్టోరీ ఎక్కడా పరుగెట్టదు కానీ అనవసర సీన్ ఒక్కటీ ఉండదు. యువతి కాలిపట్టితో మొదలుపెట్టి.. ఒక్కో పాత్ర ఒక్కో లింక్ ని పట్టుకుని స్టోరీ తెలిసేకొద్ది యమ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.(ఇదీ చదవండి: Chhaava Review: ‘ఛావా’(తెలుగు వెర్షన్) మూవీ రివ్యూ)చనిపోయిన రాజేంద్రన్.. తనతో పాటు విన్సెంట్ కూడా హత్యలో భాగమని చెబుతాడు. నిజంగానే విన్సెంట్ హత్య చేశాడా? దీన్ని వివేక్ ఎలా నిరూపించడనేది చివరివరకు మనల్ని ఎంగేజ్ చేసే విషయం. చూస్తున్నంతసేపు ఎక్కడా మనం ఓ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ రాదు. మన చుట్టుపక్కలా జరుగుతున్నట్లే చాలా నేచురల్ గా ఉంటుంది. చివరకొచ్చేసరికి ఓ మంచి థ్రిల్లర్ సినిమా చూశామనే అనుభూతి మాత్రం కలుగుతుంది.ఓ యువతి హత్యకు మమ్ముట్టి సినిమా, షూటింగ్ తో లింక్ చేసి చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో మమ్ముట్టి అప్పటి లుక్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ టెక్నాలజీ ఉపయోగించి యువకుడిలా చూపించడం కూడా బాగుంది. ప్రతి పాత్రని పరిచయం చేసిన తీరు, ముగించిన తీరు చాలా ఆకట్టుకుంటుంది.ఎవరెలా చేశారు?ఓటీటీ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కాస్తోకూస్తో తెలిసిన అసిఫ్ అలీ, అనస్వర రాజన్.. వివేక్, రేఖ పాత్రల్లో ఇమిడిపోయారు. ఎక్కడ ఓవరాక్షన్ లేకుండా సింపుల్ గా చేసుకుంటూ వెళ్లిపోయారు. మిగిలిన ప్రతి పాత్రధారి తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో పాటలు పెద్దగా లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిపోయింది. మిగతా టెక్నీషియన్స్ తమకిచ్చిన పనికి న్యాయం చేశారు. తెలుగు డబ్బింగ్ బాగుంది. కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేసే థ్రిల్లర్ మూవీ ఈ 'రేఖాచిత్రం'.-చందు డొంకాన(ఇదీ చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన) -
దర్శకుడి అసత్య ఆరోపణలు.. ఇచ్చిపడేసిన హీరోయిన్
ఇప్పుడంతా ఓటీటీల (OTT Movies) జమానా. భాషతో సంబంధం లేకుండా నటీనటులు అభిమానుల్ని సంపాదించుకుంటున్నారు. అలా ఓటీటీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమున్న మలయాళ నటి అనస్వర రాజన్ (Anaswara Rajan). ఈమె నటించిన 'మిస్టర్ & మిసెస్ బ్యాచిలర్' అనే మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు ఈమెపై ఆరోపణలు చేశాడు. తానేం తప్పు చేయలేదని ఇచ్చిపడేసిన అనస్వర రాజన్.. దర్శకుడికి అదే రేంజులో ఇచ్చిపడేసింది.(ఇదీ చదవండి: సింగర్ కల్పనకు ఏమైంది? పోలీసుల అదుపులో భర్త)అసలేం జరిగింది?ఇంద్రజిత్ సుకుమారన్, అనస్వర రాజన్ జంటగా నటించిన 'మిస్టర్ & మిసెస్ బ్యాచిలర్' మూవీ లెక్క ప్రకారం గతేడాది ఆగస్టులోనే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ అనుకోని కారణాల వల్ల అది జరగలేదు. కొన్నిరోజుల క్రితం పలు మీడియా ఛానెళ్లకి ఇంటర్వ్యూలు ఇచ్చిన దర్శకుడు దీపు కరుణాకరన్(Deepu Karunakaran).. హీరోయిన్ అనస్వర రాజన్ అస్సలు ప్రమోషన్ కోసం సహకరించట్లేదని చెప్పాడు. ఆమెపై లేనిపోని ఆరోపణలు చేశాడు.తాజాగా దర్శకుడి కామెంట్స్ పై స్పందించిన అనస్వర రాజన్.. ఆయన అన్ని అబద్ధాలే చెబుతున్నాడని క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా కోసం ఇచ్చిన ఒకేఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ తనదేనని, సినిమా పోస్టర్స్ కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశానని చెప్పుకొచ్చింది. రిలీజ్ డేట్ మార్పు గురించి తనకు అస్సలు సమాచారం ఇవ్వలేదని వాపోయింది.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్)ఇలానే తనపై ఆరోపణలు చేస్తూ పరువు తీసేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఎంతవరకైనా వెళ్తానని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సదరు దర్శకుడిపై అనస్వర ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వివాదం మలయాళ చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది.అనస్వర నటించిన చిత్రాల విషయానికొస్తే.. సూపర్ శరణ్య, ప్రణయ విలాసం, గురువాయూర్ అంబలనడయిల్, నెరు తదితర చిత్రాలు ఉన్నాయి. ఈమె నటించిన లేటెస్ట్ హిట్ మూవీ 'రేఖాచిత్రం' ఈ శుక్రవారం నుంచి సోనీ లివ్ ఓటీటీలోకి రానుంది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) View this post on Instagram A post shared by S H E ♾️ (@anaswara.rajan)