మలయాళంలో ఆయనో ఓ పెద్ద స్టార్ హీరో. మాలీవుడ్‌లో రికార్డులు సృష్టించాలన్నా.. ఉన్న రికార్డులను బద్దలు కొట్టాలన్నా ఆయన తర్వాతే అందరు. వందల సినిమాలు తీసి వేల కోట్ల ఆస్తిని కూడా కూడబెట్టాడు. కొడుకుని హీరోగా ఇండస్ట్రీగా పరిచయం చేసి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందించాడు. కట్ చేస్తే..ఆ వారసుడు ఇప్పుడు కూలీగా మారాడు. తండ్రి సంపాదించిన వేల కోట్ల ఆస్తిని వదిలేసి.. గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ తనయుడి పేరే ప్రణవ్ మోహన్ లాన్. తండ్రి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. మోహన్ లాల్ కొడుకు కూలీ పని చేయడం ఏంటని షాకవుతున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
ఆల్ రౌండర్ ప్రణవ్
మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్క్రీన్‌ప్లే రైటర్‌గా మారాడు. కొన్నాళ్లకు మళ్లీ హీరోగా వెండితెరపై మెరిశాడు. ఆయన తీసిన ‘హృదయం’ మూవీ అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన తర్వాత ఆయన నటించిన ‘వర్షంగళ్కు శేషం’ మూవీ కూడా ప్రణవ్‌కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. హీరో కంటే ముందు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు. ఇలా ఒకవైపు నటనతో పాటు మిగిలిన విభాలన్నింటిలోనూ ప్రణవ్ మంచి పట్టు సాధించి ‘ఆల్ రౌండర్’గా గుర్తింపు పొందాడు. ఇలా కెరీర్‌లో దూసుకెళ్తున్న ప్రణవ్..సడెన్‌గా గ్యాప్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైపోయాడు.
స్పెయిన్‌లో కూలీగా..
‘వర్షంగళకు శేషం’ తర్వాత ప్రణవ్ కాస్త గ్యాప్ తీసుకొని స్పెయిన్ వెళ్లాడు. స్టార్ హీరో కాబట్టి ఏ వివాహారానికో, ఎంజాయ్ చేయడానికి ప్రణవ్ విదేశాలకు వెళ్లలేదు. స్పెయిన్ వెళ్లి కూలీ పని చేస్తున్నాడు. అక్కడ ఓ ఫామ్ హౌస్‌లో ఉంటూ గొర్రెలు, గుర్రాల కాపరిగా చేరాడట. ఇందుకుగాను జీతం ఏమి లేదట. కేవలం భోజనం పెట్టి, షెల్టర్ ఇస్తారట.
కష్టమైన పని చేయడం ఇష్టం
ప్రణవ్ కూలీ పనిచేయాల్సిన అవసరం లేదు. ఏ పని చేయకున్నా.. తండ్రి మోహన్ లాన్ సంపాదించిన ఆస్తితో జీవితాంతం కూర్చొని తినొచ్చు. అలా ఉండడం ఇష్టం లేకపోయినా.. తనలో మంచి టాలెంట్ ఉంది. హీరోగానూ రాణించాడు. ఆయన నటిస్తే చాలు కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. ఇలాంటి లగ్జరీ లైఫ్‌ని వదిలేసి.. కూలీ పని చేయాల్సిన అవసరం ఏంటి? అంటే.. ప్రణవ్‌కి అలాంటి పని చేయడం ఇష్టం అట. గొర్రెలు, గుర్రాలను చూసుకునే పనిని ఆస్వాదిస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రణవ్ తల్లి, మోహన్ లాల్ సతీమణి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘కష్టమైన పని చేయడం ప్రణవ్‌కి ఇష్టం. కానీ నాకు మాత్రం ప్రణవ్ హీరోగా మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’ అని ప్రణవ్ తల్లి అన్నారు. రంగుల ప్రపంచం(చిత్ర పరిశ్రమ) నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇలా సాధారణ జీవితం గడపడడం నిజంగా గొప్ప విషయమే.
Comments
Please login to add a commentAdd a comment