spin
-
కూలీ పనికి వెళ్తున్న స్టార్ హీరో తనయుడు!
మలయాళంలో ఆయనో ఓ పెద్ద స్టార్ హీరో. మాలీవుడ్‌లో రికార్డులు సృష్టించాలన్నా.. ఉన్న రికార్డులను బద్దలు కొట్టాలన్నా ఆయన తర్వాతే అందరు. వందల సినిమాలు తీసి వేల కోట్ల ఆస్తిని కూడా కూడబెట్టాడు. కొడుకుని హీరోగా ఇండస్ట్రీగా పరిచయం చేసి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందించాడు. కట్ చేస్తే..ఆ వారసుడు ఇప్పుడు కూలీగా మారాడు. తండ్రి సంపాదించిన వేల కోట్ల ఆస్తిని వదిలేసి.. గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ తనయుడి పేరే ప్రణవ్ మోహన్ లాన్. తండ్రి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. మోహన్ లాల్ కొడుకు కూలీ పని చేయడం ఏంటని షాకవుతున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.ఆల్ రౌండర్ ప్రణవ్మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్క్రీన్‌ప్లే రైటర్‌గా మారాడు. కొన్నాళ్లకు మళ్లీ హీరోగా వెండితెరపై మెరిశాడు. ఆయన తీసిన ‘హృదయం’ మూవీ అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన తర్వాత ఆయన నటించిన ‘వర్షంగళ్కు శేషం’ మూవీ కూడా ప్రణవ్‌కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. హీరో కంటే ముందు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు. ఇలా ఒకవైపు నటనతో పాటు మిగిలిన విభాలన్నింటిలోనూ ప్రణవ్ మంచి పట్టు సాధించి ‘ఆల్ రౌండర్’గా గుర్తింపు పొందాడు. ఇలా కెరీర్లో దూసుకెళ్తున్న ప్రణవ్..సడెన్‌గా గ్యాప్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైపోయాడు.స్పెయిన్‌లో కూలీగా..‘వర్షంగళకు శేషం’ తర్వాత ప్రణవ్ కాస్త గ్యాప్ తీసుకొని స్పెయిన్ వెళ్లాడు. స్టార్ హీరో కాబట్టి ఏ వివాహారానికో, ఎంజాయ్ చేయడానికి ప్రణవ్ విదేశాలకు వెళ్లలేదు. స్పెయిన్ వెళ్లి కూలీ పని చేస్తున్నాడు. అక్కడ ఓ ఫామ్ హౌస్‌లో ఉంటూ గొర్రెలు, గుర్రాల కాపరిగా చేరాడట. ఇందుకుగాను జీతం ఏమి లేదట. కేవలం భోజనం పెట్టి, షెల్టర్ ఇస్తారట.కష్టమైన పని చేయడం ఇష్టంప్రణవ్ కూలీ పనిచేయాల్సిన అవసరం లేదు. ఏ పని చేయకున్నా.. తండ్రి మోహన్ లాన్ సంపాదించిన ఆస్తితో జీవితాంతం కూర్చొని తినొచ్చు. అలా ఉండడం ఇష్టం లేకపోయినా.. తనలో మంచి టాలెంట్ ఉంది. హీరోగానూ రాణించాడు. ఆయన నటిస్తే చాలు కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. ఇలాంటి లగ్జరీ లైఫ్‌ని వదిలేసి.. కూలీ పని చేయాల్సిన అవసరం ఏంటి? అంటే.. ప్రణవ్‌కి అలాంటి పని చేయడం ఇష్టం అట. గొర్రెలు, గుర్రాలను చూసుకునే పనిని ఆస్వాదిస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రణవ్ తల్లి, మోహన్ లాల్ సతీమణి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘కష్టమైన పని చేయడం ప్రణవ్‌కి ఇష్టం. కానీ నాకు మాత్రం ప్రణవ్ హీరోగా మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’ అని ప్రణవ్ తల్లి అన్నారు. రంగుల ప్రపంచం(చిత్ర పరిశ్రమ) నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇలా సాధారణ జీవితం గడపడడం నిజంగా గొప్ప విషయమే. View this post on Instagram A post shared by Pranav Mohanlal (@pranavmohanlal) -
ఇలా అయితే కష్టమే!
‘ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు’... అన్న చందంగా ఏరి కోరి సిద్ధం చేసుకున్న స్పిన్ పిచ్‌పై టీమిండియా బోల్తా కొట్టింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో పిచ్ పేస్‌కు అనుకూలించడం వల్లే టీమిండియా తడబడింది అని సర్దిచెప్పుకున్న వాళ్లు సైతం... పుణే ప్రదర్శనతో బేజారవుతున్నారు. ప్రత్యర్థిని స్పిన్ వలలో వేసి ఉక్కిరి బిక్కిరి చేయాలనుకున్న రోహిత్ సేన చివరకు ఆ ఉచ్చులోనే చిక్కి విలవిల లాడింది. టెస్టు కెరీర్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాలుగు కంటే ఎక్కువ వికెట్లు తీసిన అనుభవం లేని సాంట్నర్‌కు ఏకంగా మనవాళ్లు ఏడు వికెట్లు సమర్పించుకున్నారు. భారత ఆటగాళ్లు తడబడ్డ చోటే రెండో ఇన్నింగ్స్‌లోనూ న్యూజిలాండ్ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టడం పుండు మీద కారం చల్లినట్లయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నా... కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ మాత్రం చక్కటి ఇన్నింగ్స్‌తో అలరించాడు. స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో క్రీజు వదలి ఒక అడుగు ముందుకు వేసి బంతిని అందుకోవడంతో పాటు... కాళ్ల కదలికలో చురుకుదనం చూపిస్తూ ఖాళీల్లోకి బంతిని పోనిచ్చి పరుగులు పిండుకున్నాడు. మరో ఎండ్‌లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్నా... ఏమాత్రం తడబడకుండా క్రీజులో నిలిచి కెపె్టన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. 1955–56 నుంచి భారత్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్... ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇక్కడ టెస్టు సిరీస్ గెలవలేకపోయింది. 36 ఏళ్ల తర్వాత తొలిసారి భారత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు మ్యాచ్ ఓడిన టీమిండియా... ఇప్పుడు టెస్టు క్రికెట్ చరిత్రలో మొదటిసారి సిరీస్ ఓటమి అంచున నిలిచింది. వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలనుకుంటున్న టీమిండియా... ఇదే ప్రదర్శన కొనసాగిస్తే మున్ముందు మరిన్ని కష్టాలు ఎదుర్కోక తప్పదు. 2023–25 ఎడిషన్‌లో భాగంగా భారత్ ఇంకా కేవలం ఆరు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. అందులో ఒకటి న్యూజిలాండ్‌తో కాగా... మిగిలిన ఐదు ఆ్రస్టేలియాలో ఆ్రస్టేలియాతో. ఇలాంటి దశలో స్వదేశంలో ఆడుతున్న సిరీస్‌లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితితో ఆసీస్ గడ్డపై అడుగు పెడుతుంది అనుకుంటే... ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వస్తున్నాయి. తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం తర్వాత భారత మాజీ కెప్టెన్ , హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ... ‘జట్టులో పుజారా వంటి ప్లేయర్ ఎంతో అవసరం. ఎలాంటి పిచ్‌పైనైనా ఓపికగా నిలవడంతో పాటు సహచరులకు భరోసా ఇవ్వగల సామర్థ్యం అతడి సొంతం’ అని అన్నాడు. ఇప్పుడు వరుసగా రెండో టెస్టులోనూ మన బ్యాటర్ల ఆటతీరు చూస్తుంటే కుంబ్లే చెప్పింది నిజమే అనిపిస్తోంది. స్వదేశంలోనే పరిస్థితి ఇలా ఉంటే... ఆ్రస్టేలియా టూర్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందనే అనుమానాలు రేకెత్తక మానవు! గత రెండు ఆసీస్ పర్యటనల్లోనూ పుజారా క్రీజులో పాతుకుపోయి జట్టుకు మూలస్తంభంలా నిలిచి మరపురాని విజయాలు అందించాడు. మరి బెంగళూరు, పుణే పిచ్‌పైనే పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడుతున్న మనవాళ్లు కంగారూ గడ్డపై ఏం చేస్తారో వేచి చూడాలి! –సాక్షి క్రీడావిభాగం -
మహిళ చెవిలోనే గూడు కట్టేసిన సాలీడు! వేడినూనె పోయడంతో..
ఒక్కొసారి చీమలు, మిడతలు, సాలీడు వంటివి చెవిలోకి ఎలా వెళ్తాయో తెలియదు గానీ వెళ్లిపోతాయి. ఆ తర్వాత ఫేస్చేసే నరకం అంతా ఇంత కాదు. అచ్చం అలానే ఇక్కడో మహిళ కూడా అదే సమస్యే ఎదుర్కొంది. అయితే ఏ కీటకం అయిన మనిషి శరీరంలోకి వెళ్లితే చనిపోవడం ఖాయం. కానీ ఈ సాలీడు మహిళ చెవిలోనే ఏకంగా గూడు కట్టుకుని జీవిస్తోంది. అయితే ఆమె ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటి వైద్యం తీసుకోవడంతో నరకయాతన చవిచూసింది. చివరికీ పరిస్థితి క్రిటికల్ అయ్యి ఆస్పత్రి పాలయ్యింది. ఈ విషాదకర ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బ్రిటన్‌కి చెందిన లూసీ వైల్డ్ అనే మహిళకి ఒక రోజు ఉన్నటుండి చెవిలో వింత శబ్దాలు రావడం ఒకటే నొప్పిగా అనిపించింది. ఇంక లాభం లేదనుకుని తన భర్త సాయంతో మైక్రోస్కోపిక్ కెమెరాతో ఏం ఉందో తెలుసుకుంటారు. లోపల సాలీడు ఉన్నట్లు అర్థమై భయంతో కేకలు పెట్టింది. అయితే ఆమె భాగస్వామి వేడి నూనె వంటివి వేసి తీయాలనుకుంటాడు. అయితే అవేమీ తన బాధను తగ్గించకపోగా చెవి నుంచి రక్తస్రావం అవ్వడం మొదలైంది. ఇక దీంతో ఈఎన్టీ ఆస్పత్రికి హుటాహుటినా ఆ మహిళలను తరలిస్తారు. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేసి ఆ సాలీడు, దాని గూడుని తొలగించి యాంటి బయోటిక్ మందులతో ఇన్ఫెక్షన్లు తగ్గిస్తారు. ఇప్పుడు లూసీ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ అలా సొంత వైద్యం తీసుకోవడంతో ఇంకా చెవిలో ఏదో అసౌకర్యంగా ఉన్నట్లే అనిపిస్తోంది లూసీకి. ఇలాంటప్పుడూ ఏం చెయ్యాలంటే.. ఇలా చెవిలో ఏదైన కీటకం దూరినట్లయితే వెంటనే చెవిని ఒకవైపుకి వంచి ఉంచండి. అయినప్పటికీ అది కొరుకుతూ ఇబ్బంది పెడుతున్నట్లయితే వెంటనే వైద్యుడు వద్దకు వెళ్లిపోండి. ఆలస్యం చేశారో ఇన్ఫెక్షన్కు దారితీసి చీము వంటి ద్రవాలు వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. మీ సొంత వైద్యంతో చెత్త పరికరాలతో తీసేందుకు యత్నిస్తే ఈయర్ డ్రమ్‌కి సమస్య ఏర్పడవచ్చు ఒక్కోసారి వైద్యుడి వద్దకు వెళ్లి కీటకాన్ని తీయించుకున్నా కూడా వినికిడి శక్తి కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. అలాగే క్రిమి పూర్తిగా తొలగించబడలేనట్లు అసౌకర్యంగా ఉన్న మళ్లీ వైద్యుడిని సంప్రదించండి. ఇలాంటప్పుడూ సొంత ప్రయోగాల కంటే వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమం (చదవండి: తన పెదవులే అందరికంటే పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!) -
టీమిండియా స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీకి కుటుంబ సభ్యుల నివాళులు
-
ఆనందం ఆస్ట్రేలియాదే...
ఆ్రస్టేలియా ముందు అతిస్వల్ప విజయలక్ష్యం... అయినా సరే గత టెస్టులో 18 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు, ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు తీసిన తీరును బట్టి భారత శిబిరంలో ఏదో ఒక మూల కాస్త ఆశ, నమ్మకం... అందుకు తగినట్లుగానే ఇన్నింగ్స్ రెండో బంతికే వికెట్ కూడా దక్కింది. అయితే ఆపై ఆసీస్ ఎక్కడాతడబడలేదు. హెడ్, లబుషేన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ పోయారు. డిఫెన్స్ ఆడి ఉత్కంఠ పెంచకుండా ఓవర్‌కు 4.14 రన్‌రేట్‌తో పరుగులు చేస్తూ మ్యాచ్‌ను వేగంగా ముగించేశారు. ప్రత్యర్థిని స్పిన్ గోతిలో పడేయబోయిన భారత్ చివరకు అదే వ్యూహానికి చిక్కి మ్యాచ్‌ను చేజార్చుకుంది. రెండు టెస్టులు ఓడి నిస్సహాయంగా కనిపించిన ఆస్ట్రేలియా ఒక్కసారిగా పుంజుకొని చెప్పుకోదగ్గ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అధికారికంగా ఆస్ట్రేలియా అర్హత సాధించింది. భారత్ కూడా ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే చివరిదైన నాలుగో టెస్ట్‌లో ఆసీస్‌పై గెలవాలి. ఒకవేళ మ్యాచ్ ‘డ్రా’ అయినా, భారత్ ఓడిపోయినా టీమిండియా ఫైనల్ అవకాశాలు న్యూజిలాండ్–శ్రీలంక టెస్ట్ సిరీస్ తుది ఫలితంపై ఆధారపడి ఉంటాయి. ఇండోర్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఆ్రస్టేలియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. శుక్రవారం ముగిసిన మూడో టెస్ట్‌లో ఆ్రస్టేలియా 9 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. సిరీస్‌లో భారత్ టీమిండియా ఆధిక్యాన్ని 2–1కి తగ్గించింది. 76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు బరిలోకి దిగిన ఆసీస్ 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (53 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), లబుషేన్ (58 బంతుల్లో 28 నాటౌట్; 6 ఫోర్లు) జట్టును గెలిపించారు. నాథన్ లయన్ (11/99) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. సిరీస్‌లో చివరి టెస్టు ఈనెల 9 నుంచి అహ్మదాబాద్‌లో జరుగుతుంది. ప్రత్యర్థిని కుప్పకూల్చేందుకు స్పిన్ తప్ప మరో మార్గం లేదని భావించిన భారత్ మరో ఆలోచన లేకుండా అశ్విన్‌తోనే బౌలింగ్ మొదలు పెట్టింది. దానికి తగిన ఫలితం కూడా అందుకుంది. రెండో బంతికే తడబడిన ఉస్మాన్ ఖాజా (0) కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో టీమిండియా ఆశలు మరింత పెరిగాయి. అయితే హెడ్, లబుõÙన్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలి 10 ఓవర్లలో ఆసీస్ స్కోరు 13 పరుగులే. ఈ దశలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంతి సీమ్ దెబ్బ తినడంతో అంపైర్లు బంతిని మార్చాల్సి వచ్చింది. భారత బృందం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసినా అదే బంతితో బౌలింగ్ చేయక తప్పలేదు. అశ్విన్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టి హెడ్ జోరు పెంచగా, జడేజా తర్వాతి ఓవర్లో లబుõÙన్ రెండు ఫోర్లు కొట్టాడు. అశ్విన్ మరో ఓవర్లో మళ్లీ రెండు ఫోర్లు రాబట్టి వీరిద్దరు 15 ఓవర్లలో స్కోరును 56/1కు చేర్చారు. డ్రింక్స్ తర్వాత 23 బంతుల్లో 22 పరుగులు రాబట్టి కంగారూలు విజయాన్ని అందుకున్నారు. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: 109; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 197; భారత్ రెండో ఇన్నింగ్స్: 163; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: ఖాజా (సి) భరత్ (బి) అశ్విన్ 0; హెడ్ (నాటౌట్) 49; లబుషేన్ (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 78. వికెట్ల పతనం: 1–0. బౌలింగ్: అశ్విన్ 9.5–3–44–1, జడేజా 7–1–23–0, ఉమేశ్ 2–0–10–0. పిచ్ ‘నాసిరకం’ మూడో టెస్టుకు ఆతిథ్యమిచ్ఛిన ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిని ‘నాసిరకం పిచ్’గా గుర్తిస్తూ మూడు డీమెరిట్ పాయింట్లు శిక్షగా విధించింది. మూడో రోజు తొలి సెషన్‌లోపే ఈ టెస్టు ముగిసింది. ‘పొడిగా ఉన్న ఈ పిచ్‌పై బంతికి, బ్యాట్‌కు మధ్య సమతుల్యత లోపించింది. మ్యాచ్ ఐదో బంతికే దుమ్ము రేగగా, ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారుతూ వచ్చింది’ అని మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ నివేదిక ఇచ్చారు. -
తాము తీసిన గోతిలోనే...
-
తాము తీసిన గోతిలోనే...
పేకమేడలా కూలిన భారత ఇన్నింగ్స్ ► ఆరు వికెట్లతో ఓకీఫ్ మాయాజాలం ► కోహ్లి సేన 105 పరుగులకే ఆలౌట్ ► చివరి 7 వికెట్లు 11 పరుగులకే ► ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 143/4 ► ప్రస్తుత ఆధిక్యం 298 టెస్టు ఫార్మాట్లో ప్రపంచంలోనే నంబర్‌వన్ జట్టుకేవైుంది? స్పిన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడడంలో తమను మించిన వారు లేరని పేరు తెచ్చుకున్న విరాట్ సేనకేవైుంది? సొంతగడ్డపై ప్రత్యర్థి ఎవరైనా వారికి సింహస్వప్నంలా నిలిచే బ్యాట్స్‌మెన్ తెగువ ఎటు పోయింది? టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న మన స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా తోక ముడుస్తుందనుకుంటే ఒకే ఒక్కడి చేతిలో దెబ్బతిందేమిటి? ఇదీ రెండో రోజు ఆటలో సగటు భారత క్రికెట్ అభిమాని మదిలో మెదిలిన ప్రశ్నలు. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న ఆనందంలో బరిలోకి దిగిన భారత్‌ను కెరీర్లో కేవలం ఐదో టెస్టు ఆడుతున్న ఆసీస్ ఎడంచేతి వాటం స్పిన్నర్ స్టీవ్ ఓ కీఫ్ బావురుమనిపించాడు. అలా ఇలా కాదు... తమ టెస్టు చరిత్రలోనే భారత్‌కు అత్యంత అవమానకర పరిస్థితిని కల్పించాడు. అతడి బంతులకు ఎలా ఆడాలో తెలీక పెవిలియన్ లో అర్జంటు పని ఉన్నట్టుగా హడావిడిగా వెళ్లిపోవడం భారత బ్యాట్స్‌మెన్ వంతైంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ మినహా ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజులో కుదురుకోలేదు. ఫలితంగా 11 పరుగులకే తమ చివరి 7 వికెట్లను కోల్పోయిన భారత్ 105 పరుగులకు కుప్పకూలింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 298 పరుగుల ఆధిక్యంతో శాసించే స్థితిలో నిలిచింది. ఈ పరిస్థితిలో ఆసీస్‌ను అడ్డుకోవడం భారత్‌కు అసాధ్యమే అనుకోవాలి. ఇదే జరిగితే ఇక్కడ చాన్నాళ్లుగా ఊరిస్తున్న విజయం స్మిత్ సేన ఖాతాలో పడినట్టే. ప్రత్యర్థికి ఇబ్బంది సృష్టించాలనే లక్ష్యంతో తొలి రోజు నుంచే టర్న్ అయ్యే విధంగా రూపొందించిన పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో విరాట్ సేన పరిస్థితి తాము తీసిన గోతిలో తామే పడ్డట్టు తయారైంది. పుణే: అత్యంత పటిష్టవైున భారత స్పిన్ బౌలింగ్‌ను ఆస్ట్రేలియా ఎలా ఎదుర్కొంటుందో? ఇదీ టెస్టు ఆరంభానికి ముందు విశ్లేషకుల అభిప్రాయం. అయితే మ్యాచ్ ఆరంభమయ్యాక మాత్రం పంచ్ మనకే పడింది. ఉపఖండ పిచ్‌లపై స్పిన్ బౌలింగ్‌ను ఆడటంలో భారత బ్యాట్స్‌మెన్ ను మించిన వారు లేరు. అయితే ఏమరుపాటో.. అజాగ్రత్తో మరి.. విచిత్రంగా అదే స్పిన్ వలలో చిక్కుకుని టీమిండియా బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. ఆసీస్ ఎడంచేతి వాటం స్పిన్నర్ స్టీవ్ ఓ కీఫ్ (6/35) సుడులు తిరిగే బంతులతో కోహ్లి బృందం కోలుకోలేని విధంగా నడ్డి విరిచాడు. 24 బంతుల వ్యవధిలోనే 6 వికెట్లు తీశాడు. ఫలితంగా రెండో రోజు శుక్రవారం తమ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 40.1 ఓవర్లలో కేవలం 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (97 బంతుల్లో 64; 10 ఫోర్లు, 1 సిక్స్) ఎదురొడ్డి నిలవగా... రహానే (55 బంతుల్లో 13; 1 ఫోర్), విజయ్ (19 బంతుల్లో 10; 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరును దాటారు. మిగతా ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా వెళ్లారు. వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలతో అత్యద్బుత ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కోహ్లి కేవలం రెండు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. స్టార్క్‌కు రెండు... హాజెల్‌వుడ్, లియోన్ లకు ఒక్కో వికెట్ దక్కింది. ఆ తర్వాత 155 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో 4 వికెట్లకు 143 పరుగులు చేసింది. కెప్టెన్ స్మిత్ (117 బంతుల్లో 59 బ్యాటింగ్; 7 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీ చేయగా... మిషెల్ మార్ష్ (48 బంతుల్లో 21 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) అతడికి అండగా ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 298 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. మూడో రోజు ఆటలో వీలైనంత వేగంగా ఆడి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే ఆలోచనలో ఆసీస్ ఉంది. అశ్విన్ కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 94.5 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఉమేశ్‌కు నాలుగు, అశ్విన్ కు మూడు వికెట్లు దక్కాయి. తొలి సెషన్ : రాహుల్ నిలకడ 256/9 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ మరో ఐదు బంతుల్లో నాలుగు పరుగులు చేసి ఆలౌట్ అయి్యంది. జోరు మీదున్న స్టార్క్ వికెట్‌ను అశ్విన్ తీయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. ఓపెనర్ రాహుల్ తొలి ఓవర్ నాలుగో బంతినే బౌండరీగా మలచగా... ఏడో ఓవర్లో విజయ్ అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో ఓకీఫ్ బౌలింగ్‌లో రాహుల్ సిక్సర్‌తో దూకుడు కనబరిచాడు. అయితే 15వ ఓవర్లో స్టార్క్ భారత్‌కు షాక్ ఇచ్చాడు. మూడు బంతుల వ్యవధిలో పుజారా (6), కోహ్లిని అవుట్ చేయడంతో ఆసీస్ ఆనందంలో ముని గింది. అటు రాహుల్ మాత్రం ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుం డా అడపాదడపా బౌండరీలు బాదుతూ రహానే సహాయంతో మరో వికెట్ పడకుండా లంచ్ విరామానికి వెళ్లారు. ఓవర్లు:0.5, పరుగులు: 4, వికెట్: 1 (ఆసీస్) ఓవర్లు:25, పరుగులు: 70, వికెట్లు: 3 (భారత్) రెండో సెషన్ : ఓకీఫ్ మ్యాజిక్ లంచ్ తర్వాత భారత్ 38 నిమిషాలో్లనే మిగిలిన 7 వికెట్లను కోల్పోయింది. రాహుల్ 84 బంతుల్లో అర్ధ సెంచరీ చేయడంతో పాటు స్టార్క్ బౌలింగ్‌లో ఫోర్లు బాదుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. అయితే ఓకీఫ్ తన పదో ఓవర్ నుంచి మాయాజాలం ప్రారంభించాడు. ఆ ఓవర్ రెండో బంతికి ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను అవుట్ చేయడంతో రహానేతో నాలుగో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మూడు బంతుల వ్యవధిలో రహానే, సాహా వికెట్లను పడగొట్టాడు. మరుసటి ఓవర్లో అశ్విన్ వికెట్‌ను లియోన్ తీయడంతో ఒక్క పరుగు వ్యవధిలో భారత్ నాలుగు వికెట్లను కోల్పోయింది. అటు ఓ కీఫ్ తన జోరును కొనసాగిస్తూ వరుస ఓవర్లలో జయంత్ (2), జడేజా (2), ఉమేశ్ (4) వికెట్లను తీయడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఓ దశలో 101 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయిన భారత్ తమ సొంతగడ్డపై ఆసీస్ చేతిలో అత్యల్ప స్కోరు (104)కే వెనుదిరుగుతుందేమో అనిపించినా ఉమేశ్ ఫోర్ సహాయంతో ఆ అవమానం తప్పింది. ఇక పూర్తి ఆధిపత్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. రెండు ఫోర్లతో జోష్ చూపిన వార్నర్‌ను అశ్విన్ ఎల్బీగా పంపాడు. ఏడో ఓవర్లో షాన్ మార్ష్ ను కూడా డకౌట్ చేయడంతో ఆసీస్ 23 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్మిత్ ఎదురుదాడికి దిగి ఒత్తిడి పెంచాడు. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తను ఇచ్చిన క్యాచ్‌ను విజయ్ వదిలేశాడు. ఓవర్లు: 15.1, పరుగులు: 35, వికెట్లు: 7 (భారత్) ఓవర్లు:16, పరుగులు: 46, వికెట్లు: 2 (ఆసీస్) చివరి సెషన్ : స్మిత్ దూకుడు టీ బ్రేక్ అనంతరం కూడా స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను సబ్‌స్టిట్యూట్ అభినవ్ ముకుంద్ నేలపాలు చేశాడు. 21వ ఓవర్లో అశ్విన్ .. హ్యాండ్స్కోంబ్ (19) వికెట్‌ను తీశాడు. స్మిత్‌కు జతగా రెన్ షా (50 బంతుల్లో 31; 5 ఫోర్లు) తోడవ్వడంతో నాలుగో వికెట్‌కు 52 పరుగులు జత చేరాయి. అటు 93 బంతుల్లో స్మిత్ అర్ధ సెంచరీ చేయడంతో పాటు భారత్‌పై ఏడు టెస్టుల్లో వెయ్యి పరుగులను పూర్తి చేసుకున్నాడు. అనంతరం స్మిత్,మార్ష్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. ఓవర్లు: 30, పరుగులు: 97, వికెట్లు: 2 1 టెస్టుల్లో తమ చివరి ఏడు వికెట్లను అతి తక్కువ పరుగుల (11)కే కోల్పోవడం భారత్‌కు ఇదే తొలిసారి. గతంలో న్యూజిలాండ్‌పై (1990లో క్రైస్ట్‌చర్చ్‌లో) 18 పరుగులకు కోల్పోయింది. 1 ఒక సీజన్ లో సొంత గడ్డపై అత్యధిక వికెట్లు (67) తీసిన బౌలర్‌గా కపిల్ దేవ్ రికార్డు (63)ను అధిగమించిన అశ్విన్ . 3 టెస్టుల్లో మూడేళ్ల తర్వాత డకౌట్ అయిన కోహ్లి. అన్ని ఫార్మాట్లలో కలుపుకుంటే 104 ఇన్నింగ్స్ అనంతరం అతను ఈసారే సున్నాకు వెనుదిరిగాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 260 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) వేడ్ (బి) హాజెల్‌వుడ్ 10; రాహుల్ (సి) వార్నర్ (బి) ఓకీఫ్ 64; పుజారా (సి) వేడ్ (బి) స్టార్క్ 6; కోహ్లి (సి) హ్యాండ్స్కోంబ్ (బి) స్టార్క్ 0; రహానే (సి) హ్యాండ్స్కోంబ్ (బి) ఓకీఫ్ 13; అశ్విన్ (సి) హ్యాండ్స్కోంబ్ (బి) లియోన్ 1; సాహా (సి) స్మిత్ (బి) ఓకీఫ్ 0; జడేజా (సి) స్టార్క్ (బి) ఓకీఫ్ 2; జయంత్ యాదవ్ (స్టంప్డ్) వేడ్ (బి) ఓకీఫ్ 2; ఉమేశ్ యాదవ్ (సి) స్మిత్ (బి) ఓకీఫ్ 4; ఇషాంత్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (40.1 ఓవర్లలో ఆలౌట్)105 వికెట్ల పతనం: 1–26, 2–44, 3–44, 4–94, 5–95, 6–95, 7–95, 8–98, 9–101, 10–105. బౌలింగ్: స్టార్క్ 9–2–38–2; ఓకీఫ్ 13.1–2–35–6; హాజెల్‌వుడ్ 7–3–11–1; లియోన్ 11–2–21–1. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వార్నర్ ఎల్బిడబ్ల్యు (బి) అశ్విన్ 10; షాన్ మార్ష్ ఎల్బిడబ్ల్యు (బి) అశ్విన్ 0; స్మిత్ బ్యాటింగ్ 59; హ్యాండ్స్కోంబ్ (సి) విజయ్ (బి) అశ్విన్ 19; రెన్ షా (సి) ఇషాంత్ (బి) జయంత్ 31; మిషెల్ మార్ష్ బ్యాటింగ్ 21; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (46 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 143 వికెట్ల పతనం: 1–10, 2–23, 3–61, 4–113. బౌలింగ్: అశ్విన్ 16–3–68–3; జడేజా 17–6–26–0; ఉమేశ్ 5–0–13–0; జయంత్ 5–0–27–1; ఇషాంత్ 3–0–6–0. -
మూడో రోజు నుంచి ‘స్పిన్’
ముంబై వాంఖడే మైదానం సిద్ధం ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యం సాధించిన భారత జట్టు నాలుగో టెస్టుతోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో గత రెండు టెస్టులలాగే ముంబైలోని వాంఖడే స్టేడియంలో పిచ్ కూడా స్పిన్‌కు అనుకూలంగా సిద్ధమవుతోంది. ఈ పిచ్‌పై మూడో రోజు ఉదయం నుంచి బంతి తిరగవచ్చని భావిస్తున్నారు. గురువారం నుంచి టెస్టు ప్రారంభం కానుండగా, ఇప్పటికే పిచ్‌పై ఉన్న పచ్చికను కత్తిరించి, నీళ్లు చిలకరించడం కూడా తగ్గించేశారు. ఈ విషయాన్ని పిచ్ క్యురేటర్ మమున్కర్ ధ్రువీకరించారు. ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్‌లో ఈ వేదిక బౌలింగ్‌కు అనుకూలించలేదు. అరుుతే కొత్తగా మార్పులు చేర్పులు చేసిన తర్వాత వాంఖడే వికెట్ లెఫ్టార్మ్ స్పిన్నర్లకు కలిసొచ్చింది. గతంలో మురళీ కార్తీక్, ఓజా, పనేసర్ ఇక్కడ అద్భుత గణాంకాలు నమోదు చేశారు. -
‘స్పిన్’గుండంలో తిప్పేద్దాం!
భారత్ బలం... ఇంగ్లండ్ బలహీనతా ఇదే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి కోహ్లి సేన మిగిలిన అన్ని జట్లతో పోలిస్తే భారత్ ఏ జట్టుకై నా టెస్టుల్లో జవాబు బాకీ ఉందంటే అది ఇంగ్లండ్‌కే. భారత్‌కు స్వదేశంలో ఓటమిని రుచి చూపించిన ఇంగ్లండ్ ఎనిమిదేళ్లుగా పైచేరుు సాధిస్తూనే ఉంది. అందుకే ఈసారి దీనిని ప్రతీకార సిరీస్‌గా భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రెండో ఆలోచన లేకుండా... ఐదు టెస్టులు జరగబోయే వేదికలన్నింటిలోనూ స్పిన్ పిచ్‌లు సిద్ధం చేయబోతున్నారు. మన బలం, ఇంగ్లండ్ బలహీనతా స్పిన్. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఒకే సెషన్లో స్పిన్నర్లకు పది వికెట్లు ఇచ్చేసిన ఇంగ్లండ్ ఈ స్పిన్ గుండంలో చిక్కుకోకుండా గట్టెక్కాలంటే తమ స్థారుుకి మించి ఆడాల్సి ఉంటుంది. ఇటు మన స్పిన్ త్రయం కుక్ సేనను చుట్టేసేందుకు సిద్ధమవుతుంటే... అటు ఇంగ్లండ్ నాణ్యమైన స్పిన్నర్ లేక తలపట్టుకుంది. క్రీడావిభాగం : యుద్ధమైనా, ఆటైనా... మన బలం ఏంటో తెలుసుకుని బరిలోకి దిగిన వాడు గట్టిగా నిలబడతాడు. ప్రత్యర్థి బలహీత కూడా తెలిసిన వాడు విజయం సాధిస్తాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు భారత బృందం కూడా ఇలాగే ఆలోచించింది. వారి బలహీతను దృష్టిలో ఉంచుకుని పిచ్‌లు తయారు చేరుుస్తోంది. జట్టు ఎంపికలో కూడా స్పిన్నర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. ముగ్గురు స్పిన్నర్లతో ప్రతిసారీ జట్టును ఎంపిక చేసే సెలక్టర్లు ఈసారి నలుగురితో జట్టును ప్రకటించారు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు వీలుగా, ఆ సమీకరణానికి తగ్గట్లుగా వనరులను అందుబాటులోకి తెచ్చారు. ఈ సిరీస్ అంతటా దాదాపుగా ప్రతి మ్యాచ్‌లోనూ భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది. రెండో పేసర్‌గా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఉంటాడు కాబట్టి ముగ్గురు స్పిన్నర్లతో ఆడినా జట్టు సమీకరణం సరిగ్గా కుదరొచ్చు. అప్పట్లో అజహర్... ఇంగ్లండ్‌పై గెలవాలంటే ముగ్గురు స్పిన్నర్లతో ఆడటమే ఉత్తమం అని 1992-93 సీజన్లోనే అజహరుద్దీన్ చూపించాడు. కుంబ్లే (లెగ్ స్పిన్), రాజేశ్ చౌహాన్ (ఆఫ్ స్పిన్), వెంకటపతి రాజు (లెఫ్టార్మ్ స్పిన్)లతో ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించి, గూచ్ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేశారు. ఈసారి కూడా భారత్‌కు సరిగ్గా అలాంటి కూర్పు దొరికింది. ఆ ముగ్గురు స్పిన్నర్ల తర్వాత మళ్లీ అలాంటి కూర్పే దొరకడం కూడా ఇప్పుడే. ఈసారి అశ్విన్ (ఆఫ్ స్పిన్), జడేజా (లెఫ్టార్మ్ స్పిన్), అమిత్ మిశ్రా (లెగ్ స్పిన్) రూపంలో మూడు రకాల బౌలర్లు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మరోసారి అజహర్ తరహా వ్యూహంతో ఇంగ్లండ్‌ను చుట్టేయాలనేది భారత జట్టు ఆలోచన. హోమ్‌వర్క్ చేశారు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత భారత బృందం అశ్విన్, జడేజాలకు విశ్రాంతి ఇచ్చింది. కివీస్‌తో వన్డే సిరీస్ ముఖ్యమే అరుునా ఈ ఇద్దరూ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు తాజాగా బరిలోకి దిగాలనేది జట్టు ఆలోచన. ఈ సిరీస్‌కు భారత్ ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందనే దానికి ఇదే నిదర్శనం. ఈ ఇద్దరు స్పిన్నర్లు కూడా విశ్రాంతి సమయంలో ఖాళీగా కూర్చోలేదు. అశ్విన్ ఓ కొత్త తరహా బంతి కోసం ప్రయత్నం చేశాడు. అలాగే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వీడియోలు చూశాడు. ముఖ్యంగా కుక్, రూట్ ఇద్దరే ఇంగ్లండ్‌కు కీలకం కాబట్టి, ఈ ఇద్దరిపై అశ్విన్ ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాడని సమాచారం. ఇక జడేజా కూడా పూర్తి స్థారుులో ఈ సిరీస్ కోసం హోమ్‌వర్క్ చేశాడు. ఈ ఇద్దరితో పాటు అమిత్ మిశ్రా కూడా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ప్రదర్శన, ముఖ్యంగా వైజాగ్ వన్డేలో తీసిన ఐదు వికెట్లు అమిత్ మిశ్రా ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉంటాయనడంలో సందేహం లేదు. కాబట్టి భారత్ తమ ‘స్పిన్’ అస్త్రంతో పూర్తి స్థారుులో సిద్ధంగా ఉంది. ఒకవేళ ఈ ముగ్గురిలో గాయం లేదా మరేదైనా కారణంతో ఎవరైనా అందుబాటులో లేకపోతే నాలుగో స్పిన్నర్‌గా జయంత్ యాదవ్ అందుబాటులో ఉన్నాడు. నాలుగేళ్లలో మారిపోరుుంది ఇంగ్లండ్ జట్టు 2012లో భారత్‌లో పర్యటించే సమయంలోనూ స్పిన్ గురించి ఇలాంటి చర్చే జరిగింది. అరుుతే ఆ సిరీస్‌ను అనూహ్యంగా గెలుచుకుంది. అప్పటి లైనప్‌తో పోలిస్తే ఇప్పుడు రెండు జట్లలోనూ మార్పులు వచ్చారుు. నాలుగేళ్ల క్రితం అశ్విన్ జట్టులో ఉన్నాడు. నాలుగు టెస్టుల్లో కలిసి 14 వికెట్లు తీశాడు. నాడు భారత్‌కు మరో స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా. తను ఆ సిరీస్‌లో 20 వికెట్లు తీశాడు. అరుుతే ఈ ఇద్దరూ ఆశించిన స్థారుులో వేగంగా వికెట్లు తీయలేకపోయారు. ఇదే సమయంలో అటు ఇంగ్లండ్ స్పిన్నర్లు మనవాళ్లకంటే మెరుగైన ప్రదర్శన కనబరిచారు. స్వాన్ 20, పనేసర్ 17 వికెట్లు తీశారు. నిజానికి భారత్ స్పిన్నర్లు, ఇంగ్లండ్ స్పిన్నర్లు సమానంగా వికెట్లు తీసినా... కీలక సమయంలో, విజయానికి అవసరమైన వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ స్పిన్నర్లు సక్సెస్ సాధించారు. అరుుతే ఈ నాలుగేళ్లలో పరిస్థితి మారింది. అశ్విన్ ఇప్పుడు ఓ డైనమైట్లా తయారయ్యాడు. మిగిలిన ఇద్దరూ ఫామ్‌లో ఉన్నారు. అటు ఇంగ్లండ్ మాత్రం గ్రేమ్ స్వాన్ రిటైరైన తర్వాత మరో నాణ్యమైన స్పిన్నర్‌ను వెతకడంలో విఫలమైంది. పనేసర్ కూడా కనుమరుగయ్యాడు. ప్రస్తుతం తుది జట్టులో ఉంటారని భావిస్తున్న స్పిన్నర్లకు పెద్దగా అనుభవం లేకపోవడం కూడా ఇంగ్లండ్‌కు కొంత మేరకు ప్రతికూలం. ఇంగ్లండ్ పరిస్థితి ఏమిటంటే... ఇంగ్లండ్ కూడా పిచ్ స్వభావాన్ని బట్టి అవసరమైతే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడానికి సిద్ధమై వచ్చింది. ఆ జట్టుకు ప్రధాన స్పిన్నర్ మొరుున్ అలీ. తను తొలుత బ్యాట్స్‌మన్‌గానే కెరీర్ ప్రారంభించాడు. కాబట్టి వారికి ఆల్‌రౌండర్‌గా తన సేవలు అందుబాటులో ఉంటారుు. దీంతో జట్టు కూర్పు విషయంలో వారు పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. అరుుతే ప్రస్తుతం మొరుున్ అలీ ఫామ్ అంతగా బాగోలేదు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో తను 11 వికెట్లు తీశాడు. ఒక ఇన్నింగ్సలో ఐదు వికెట్లు సాధించాడు. అరుుతే ఢాకాలో పూర్తి స్థారుులో స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై తను విఫలమయ్యాడు. అలాగే లెగ్ స్పినర్ ఆదిల్ రషీద్ కూడా ఇంగ్లండ్ ప్రణాళికల్లో కీలకం. తను కూడా బంగ్లాదేశ్‌లో విఫలమయ్యాడు. తను రెండు టెస్టుల్లో ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక బంగ్లాదేశ్‌లో అరంగేట్రం చేసిన జఫర్ అన్సారీ లెఫ్టార్మ్ స్పిన్నర్. తన తొలి మ్యాచ్‌లో స్పిన్ వికెట్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అరుుతే తను కూడా ఆల్‌రౌండర్ కావడం కొంత మేరకు ఇంగ్లండ్‌కు అదనపు బలం. ఓవరాల్‌గా ఇంగ్లండ్ కూడా భారత్ తరహాలో మూడు రకాల స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. అరుుతే ఈ ముగ్గురూ పూర్తి స్థారుులో ఫామ్‌లో లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. వీరితో పాటు హసీబ్ అహ్మద్ రూపంలో మరో లెగ్‌స్పిన్నర్ అందుబాటులో ఉన్నాడు. డకెట్, బ్యాటీ కూడా స్పిన్‌లో సహకరించలగులుతారు. భారత బ్యాట్స్‌మెన్‌ను తమకు ఉన్న స్పిన్ వనరులతో నియంత్రించడం కష్టం అని ఇంగ్లండ్‌కు తెలుసు. అందుకే ఈ సిరీస్ కోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ మాజీ దిగ్గజం సక్లైన్ ముస్తాక్‌ను సలహాదారుగా పిలిపించుకున్నారు. తనకు కేవలం 15 రోజుల వీసా లభించడంతో తొలి మూడు టెస్టుల వరకూ అందుబాటులో ఉంటాడు. గతంలో కూడా అడపాదడపా ఉపఖండంలో సిరీస్‌లకు ఇలా పాత తరం స్పిన్నర్లను సలహాదారుగా వాడుకున్నారు. ఇటీవల పాకిస్తాన్‌తో యూఏఈలో జరిగిన సిరీస్‌లోనూ సకై ్లన్ ఇంగ్లండ్ జట్టుతో పాటు పని చేశారు. ఆ సిరీస్‌లో కొంత వరకు ఫలితం సాధించగలిగారు. మరి భారత గడ్డపై ఇంగ్లండ్ స్పిన్నర్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. వాళ్ల రాణింపుపైనే ఈ సిరీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది. -
బ్యాటింగ్ కనిపించట్లేదు
స్పిన్‌కు దాసోహం అంటున్న భారత బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికాతో సిరీస్ నెగ్గిన భారత్ జట్టుకు ప్రశంసలు మాత్రమే కాదు విమర్శలు కూడా దక్కాయి. ముఖ్యంగా పిచ్‌ను తమకు అనుకూలంగా తయారు చేయించుకోవడంపై మాజీలు మండిపడ్డారు. అయితే సిరీస్ విజయం, పిచ్‌పై చర్చతో మరో కీలక అంశంపై పెద్దగా ఎవరి దృష్టి పడలేదు. అదే భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యం. పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా లేవు కాబట్టి బ్యాటింగ్ పెద్దగా కనిపించే అవకాశం ఉండదు అని అనుకోవచ్చు. అయితే ఈ సిరీస్‌ను పక్కన పెట్టి కాస్త లోతుగా పరిశీలిస్తే మన బ్యాట్స్‌మెన్ గత రెండేళ్లుగా స్పిన్‌ను ఎదుర్కొవడానికి కష్టాలు పడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. సిరీస్ నెగ్గాలనే ఒకే లక్ష్యంతో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు తయారు చేసిన పిచ్‌లు ప్రస్తుతం బాగా చర్చనీయాంశం అయ్యాయి. నిజానికి భారత్‌లో సిరీస్ అంటే ఏ జట్టైనా స్పిన్ పిచ్‌లు తప్పవని ముందుగానే నిశ్చయించుకుంటుంది. అయితే ఈ స్థాయిలో పిచ్‌లు ఉంటాయని ఎవరూ అనుకోలేదు. కేవలం మూడురోజుల్లోనే మ్యాచ్ ముగిసే స్థాయిలో పిచ్‌లు ఉండడంతో కొంతమంది మాజీలు మండిపడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది మరో విషయం కూడా ఉంది. అదే మన బ్యాట్స్‌మెన్ వైఫల్యం. వాళ్లే ఉంటే.. ఆ పిచ్‌లపై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు కదా మనవాళ్లు ఎలా రాణిస్తారని సందేహం రావచ్చు. అయితే సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ ఉంటే ఈ స్థాయిలో కుప్పకూలేవారా అనేది సునీల్ గవాస్కర్ ప్రశ్న. ప్రొటీస్ జట్టులో కూడా స్మిత్, కలిస్ ఉంటే వందలోపు ఆలౌట్ అయ్యేవారా అనేది కూడా ఆలోచించాల్సిందే. నిజానికి కాస్త సహనం ప్రదర్శిస్తే క్రీజ్‌లో నిలదొక్కుకోవచ్చు అని మూడో టెస్టులో ఆమ్లా, డుప్లెసిస్ నిరూపించారు. వారిద్దరే 50 ఓవర్లకు పైగా బంతులు ఆడడమే దానికి నిదర్శనం. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ధావన్, కోహ్లి, రహానే అవుటవడానికి బౌలర్ల కృషి కంటే వారి తొందరపాటు షాట్లే కారణమని స్పష్టంగా అర్థమవుతుంది. కాస్త మెరుగైన వాళ్లు ఉండుంటే.. సిరీస్‌లో భారత జట్టు నాలుగు సార్లు ఆలౌటైతే వాటిలో 28 వికెట్లు దక్షిణాఫ్రికా స్పిన్నర్లకే దక్కాయి. పైగా వారి స్పిన్నర్లు ఇద్దరూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు కూడా కారు. సైమన్ హార్మర్ భారత పర్యటనకు ముందు 2 టెస్టులు మాత్రమే ఆడగా, ఇమ్రాన్ తాహిర్ జట్టులో చోటు కోల్పోయి ఏకంగా 9 నెలల తర్వాత పునరాగమనం చేశాడు. వారి స్పిన్నర్ల బౌలింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్ సగటు 18.39 మాత్రమే. (అంటే సగటున 18 పరుగులకు ఒక వికెట్ సమర్పించుకున్నారు). తాహిర్ 13.25 సగటుతో 12 వికెట్లు తీయగా, హర్మర్ 25.40 సగటుతో 10 వికెట్లు తీశాడు. వారిద్దరు పెద్దగా లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేయలేదు. ఒకవేళ యాసిర్ షా, హెరాత్ వంటి ప్రపంచస్థాయి బౌలర్లు ప్రత్యర్థి జట్టులో ఉండి ఉంటే సిరీస్‌ను మనం నెగ్గేవాళ్లమా అని ప్రశ్నిస్తే.. దానికి సమాధానం కష్టమే. 2014 నుంచి ఇదే వరుస.. గత రెండేళ్లుగా మన బ్యాట్స్‌మెన్ స్పిన్ బౌలింగ్‌కు దాసోహం అయిన తీరును గమనిస్తే కాస్త విస్తుపోవాల్సిందే. స్పినర్ల బౌలింగ్‌లో అతి తక్కువ సగటు ఉన్న టాప్-8 జట్ల జాబితాలో మనం చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నాం. 31.61 సగటుతో మనం ఉండగా, వెస్టిండీస్ (30.20), దక్షిణాఫ్రికా (27.01) మన కింది స్థానాల్లో ఉన్నాయి. (మన సిరీస్ లేకపోయింటే దక్షిణాఫ్రికా సగటు కూడా భారత్ కంటే మెరుగ్గానే ఉండేది) ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ కాలంలో భారత్ విదేశాల్లోనే ఎక్కువగా మ్యాచ్‌లు ఆడింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో స్పిన్‌కు అనుకూలించని పిచ్‌లపై కూడా మన బ్యాట్స్‌మెన్ స్పిన్నర్లకే వికెట్లు సమర్పించుకున్నారు. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీకి దాసోహమైన మన బ్యాట్స్‌మెన్ అతని బౌలింగ్‌లో సగటున 23 పరుగులకు ఒక వికెట్ ఇచ్చేశారు. అదే సిరీస్‌లో భారత స్పిన్నర్ల సగటు ఏకంగా 44.07. (అప్పటికి అశ్విన్ ఈ స్థాయి ఫామ్‌లో లేడు). మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్‌లో సైతం ఎక్కువ వికెట్లు తీసింది వారి స్పిన్నర్ నాథన్ లియోనే. ఆసియా దేశాల బ్యాట్స్‌మెన్ స్పిన్ ఆడడంలో సిద్ధహస్తులు. ఇక్కడి పిచ్‌లు స్పిన్‌కే అనుకూలిస్తాయి కాబట్టి బంతి టర్న్ అయినా సరే ఆడడంలో పెద్దగా ఇబ్బంది పడరు. అయితే గత రెండేళ్లలో స్పిన్ బౌలింగ్‌లో మన బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడినంతగా ఆసియా టాప్-4 జట్లలో ఏది పడలేదు. స్పిన్ బౌలింగ్‌లో పాకిస్తాన్ సగటు 47.10, బంగ్లాదేశ్ సగటు 37.92, శ్రీలంక సగటు 33.58గా ఉంది. విదేశాల్లో సమస్యలు.. మన దేశంలో సిరీస్ కాబట్టి స్పిన్‌ను నమ్ముకున్నారు. అందుకు తగ్గట్లుగానే అశ్విన్ 24 వికెట్లతో, జడేజా 16 వికెట్లతో, మిశ్రా 7 వికెట్లతో దుమ్ములేపారు. సిరీస్‌లో దక్షిణాఫ్రికావి మొత్తం 50 వికెట్లు పడితే 47 స్పిన్నర్లకే దక్కాయి. పిచ్‌పై చర్చ రాగానే స్పందించిన కోహ్లి మాట్లాడుతూ.. విదేశాల్లో వారికి అనుకూలమైన పిచ్లే ఉంటాయి కదా అని వ్యాఖ్యానించాడు. అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల్లో పేస్ ట్రాక్‌లు ఉంటాయని దానర్థం. మరీ అక్కడి వెళితే మన స్పిన్ ప్రభావం నామమాత్రమే. టెస్టుల్లో వికెట్లు తీస్తేనే గెలుస్తామని చెప్పే కోహ్లి ఆ పని చేసే పేస్ ఎవరనేది ప్రశ్నించుకోవాలి. ప్రస్తుతం జట్టులో ఉన్న ఇషాంత్, ఉమేశ్ యాదవ్, వరుణ్ అరోన్, భువనేశ్వర్ కుమార్లో ఎవరిపైనా నమ్మకం పెట్టుకునే పరిస్థితుల్లో జట్టు మేనేజ్మెంట్ లేదు. అలాంటి సమయాల్లో బ్యాట్స్‌మెన్‌నే నమ్ముకోవాలి. పుంజుకోవాల్సిన సమయమిదే... ఈ సిరీస్‌లో భారత జట్టు చేసిన అత్యధిక స్కోరు 215 పరుగులు. కోహ్లి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చేసినవి 68 పరుగులు మాత్రమే. కోహ్లి తర్వాత అంతటి స్టార్ రహానే, రోహిత్ శర్మ, సాహా, ధానవ్ ఘోరంగా విఫలమయ్యారు. వీళ్లలో కోహ్లి, రహానే, రోహిత్ సాంకేతికత గురించి అందరికి తెలిసిందే. లోపమంతా సహనంగా ఆడకపోవడమే. 1990-2011 మధ్య దిగ్గజాలు సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, గంగూలీ ఆడే సమయంలో స్పిన్ బౌలింగ్‌లో మన సగటు 44.97 (ఆ సమయంలో మనదే అత్యధికం). వీళ్ల రిటైర్మెంట్ తర్వాతే అసలు సమస్య వచ్చింది. కనీసం నాలుగో టెస్టులోనైనా వారి దాన్ని అధిగమిస్తారని ఆశిద్దాం. దక్షిణాఫ్రికాతో సిరీస్ తర్వాత భారత్ మళ్లీ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల్లోనే పర్యటిస్తుంది. ఇంతకుముందులా కాకుండా అక్కడి పిచ్‌లపై వారి స్పిన్నర్లను మన బ్యాట్స్‌మెన్ ఎదుర్కొవాలంటే నాలుగో టెస్టు మ్యాచే వారికి సరైన ప్రయోగశాల లాంటిది. అక్కడి ఫాస్ట్ట్రాక్లపై మన బౌలర్ల వైఫల్యాన్ని అధిగమించాలంటే ఉన్న ఏకైక మార్గం మన బలమైన బ్యాటింగ్‌లో రాణించడమేనని జట్టు గుర్తిస్తే మంచిది. -
ప్లాన్ AB
స్పిన్ ఉచ్చులో పడ్డ డివిలియర్స్ ఏ జట్టుకైనా, ఏ విషయంలో అయినా రెండు ప్రణాళికలు ఉంటాయి. ప్లాన్ ఎ విఫలమైతే వెంటనే ప్లాన్ బి అమల్లోకి తెస్తారు. అయితే దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ముందు ఇలాంటి ప్లాన్లు పనికిరావు. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి షాట్ ఆడతాడో తెలియకుండా బౌలర్లపై విరుచుకుపడతాడు. వన్డే సిరీస్‌లో డివిలియర్స్ ప్రతాపం చూసిన తర్వాత... టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై గెలవాలంటే డివిలియర్స్‌ను పూర్తిగా కట్టడి చేయాలని భారత్‌కు అర్థమైంది. ఎలాగూ స్పిన్ పిచ్లే సిద్ధంగా ఉన్నాయి. అయినా డివిలియర్స్‌ను ఆపాలంటే స్పిన్నర్లకూ ఓ వ్యూహం ఉండాలి. లేకపోతే కష్టం. అందుకే భారత స్పిన్ త్రయం డివిలియర్స్‌కు ‘ప్లాన్ ఏబీ’ సిద్ధం చేసింది. దానిని విజయవంతంగా అమలు చేసి సఫారీల వెన్నెముకను కట్టడిచేసింది. సాక్షి క్రీడా విభాగం: నాగ్‌పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు డకౌట్ అయిన తర్వాత ‘చాలా కఠినమైన రోజు ఇది. అయితే ఇక్కడ ఎలా ఆడాలనే దానికి పరిష్కారం దొరికింది’ అని ఏబీ డివిలియర్స్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశాడు. దాంతో రెండో ఇన్నింగ్స్‌లో అతను భిన్నంగా ఆడబోతున్నాడనేది మాత్రం అర్థమైంది. నిజంగానే స్టాన్స్ మార్చి ఏబీ భిన్నంగా ఆడేందుకు ప్రయత్నించాడు. అశ్విన్ బౌలింగ్‌లో 13 బంతులు ఎదుర్కొన్న అతను... ఎక్కువ భాగం ముందుకు దూసుకొచ్చి షాట్లు ఆడాడు. ఎల్బీడబ్ల్యూల నుంచి తప్పించుకునేందుకు... స్వీప్ ఆడినా వికెట్లు వదిలేశాడు. ఒకసారి చాలా ముందుకొచ్చి భారీ షాట్‌కు కూడా ప్రయత్నించినా విఫలమయ్యాడు. సాధ్యమైనంత వరకు దూకుడుగా ఆడి అశ్విన్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తే తర్వాత చెలరేగవచ్చని భావించినట్లున్నాడు. అయితే ఈ జోరులో అతను అశ్విన్ చేతి నుంచి సిరీస్‌లో తొలిసారి వచ్చిన ‘క్యారమ్ బాల్’ విషయంలో అంచనా తప్పాడు. ఫలితంగా అంతసేపూ క్రీజ్‌లో వెనక్కి వెళ్లకుండా ఎంతో జాగ్రత్త పడిన ఏబీ ‘ఇంజినీర్’ తెలివితేటలకు వికెట్ల ముందు దొరికిపోయాడు. ‘ఈ పర్యటన మొత్తంలో నేను అతనికి ఒక్క క్యారమ్ బాల్ కూడా వేయలేదు. ఇలాంటి పిచ్‌పై క్రీజ్ నుంచి దూరంగా విసురుతూ లోపలికి వచ్చేలా ప్రయత్నించాను. అదో అద్భుతమైన బంతి. నిజాయితీగా చెప్పాలంటే మేం పన్నిన ఉచ్చులో అతను చిక్కాడు’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. టి20ల నుంచే... దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో ఆమ్లా, డు ప్లెసిస్, డుమినిలాంటి ఇతర ప్రధాన బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే ఈ సిరీస్‌లో డివిలియర్స్ కీలకం అవుతాడని అందరూ అంచనా వేశారు. స్పిన్‌ను బాగా ఆడటంతో పాటు ఇక్కడ అందరికంటే ఎక్కువ క్రికెట్ అనుభవం కూడా అతని ఖాతాలో ఉంది. పైగా భారత్‌లో సిరీస్‌కు అడుగు పెట్టక ముందు అతను అటు టెస్టులు, ఇటు వన్డేల్లో కూడా చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. దాంతో టీమిండియా ప్రధాన లక్ష్యం అతనే అయ్యాడు. రెండు టి20 మ్యాచ్‌లలోనూ అశ్విన్ బౌలింగ్‌లోనే డివిలియర్స్ బౌల్డ్ అయ్యాడు. రెండు సార్లూ ఫ్రంట్ ఫుట్‌పై ఆడే ప్రయత్నంలోనే వెనుదిరిగాడు. అప్పటి వరకు అతని కదలికలను గుర్తిస్తూ కెప్టెన్ ధోని చేసిన సూచనలను అశ్విన్ సమర్థంగా అమలు చేయగలిగాడు. అనంతరం కాన్పూర్‌లో జరిగిన తొలి వన్డేలో అశ్విన్ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడిన డివిలియర్స్ 14 బంతుల్లో 7 పరుగులే చేశాడు. ఆ తర్వాత అశ్విన్ గాయంతో వెనుదిరగడంతో తర్వాతి నాలుగు వన్డేల్లో అతనికి భారత ఆఫ్ స్పిన్నర్ నుంచి ఇబ్బంది ఎదురుకాలేదు. ముగ్గురూ కలిసి... టెస్టు సిరీస్‌లో అశ్విన్‌కు అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా తోడయ్యారు. మొహాలీ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ అతను మిశ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో మిశ్రా సాధారణంగా వేసే బంతికంటే నెమ్మదిగా వేయడంతో అంచనా తప్పిన అతను... రెండో ఇన్నింగ్స్‌లో బంతి టర్న్ కాకపోవడంతో భంగ పడ్డాడు. బెంగళూరు టెస్టులోనైతే ఏబీ పూర్తిగా దూకుడు మంత్రం పాటించాడు. తొలి టెస్టు అనుభవంతో అతి జాగ్రత్తకు పోకుండా ఎదురుదాడికి ప్రయత్నించాడు. జడేజా బౌలింగ్‌లోనే నాలుగు ఫోర్లు బాదిన అతను అదే జోరులో వికెట్ ఇచ్చాడు. ఈసారి భిన్నంగా ప్రయత్నించిన జడేజా, మరోసారి షాట్‌కు ప్రయత్నించేలా కవ్వించాడు. ముందుకొచ్చి ఆడబోయిన అతను అక్కడే లెగ్‌సైడ్ బంతి గాల్లోకి లేపాడు. మూడో టెస్టులోనూ జడేజా దాదాపు అదే మంత్రం ప్రయోగించాడు. దాంతో ఆఫ్‌సైడ్ బంతిని లెగ్ మీదుగా ఆడి నేరుగా బౌలర్‌కే క్యాచ్ ఇచ్చాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనైతే అశ్విన్ అద్భుతం అతడిని పెవిలియన్ చేర్చింది. టి20ల అనంతరం ‘రెండు మ్యాచ్‌లలోనూ అశ్విన్ నన్ను అవుట్ చేయడంకంటే నేను అవుట్ అయ్యానని చెప్పడమే సరైంది. నాలో సాంకేతిక లోపాలు లేవు. అతడిపై ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నంలోనే వెనుదిరిగాను’ అని గట్టిగా చెప్పిన ఏబీ... టెస్టుల్లో మాత్రం ఆ పని చేయలేకపోయాడు. ఇక సిరీస్‌లో మరో టెస్టు మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందైనా డివిలియర్స్ ప్రత్యేక సన్నాహకంతో సిద్ధమై వస్తాడా లేక మరోసారి అలాగే అవుటవుతాడా చూడాలి. -
వద్దనుకున్నవాడే...
జడేజా అద్భుత పునరాగమనం తొలి టెస్టులో సత్తా చాటిన ఆల్‌రౌండర్ సిరీస్‌లో సఫారీలకు సవాల్ 3 మ్యాచ్‌లలో 37 వికెట్లు... సొంతగడ్డ రాజ్‌కోట్‌లో జడేజా ప్రదర్శన ఇది. త్రిపుర, జార్ఖండ్, హైదరాబాద్... మూడు బలహీన గ్రూప్ ‘సి’ జట్లే కాబట్టి అతని ప్రదర్శనకు గుర్తింపు దక్కదని అనిపించింది. కానీ స్పిన్‌కు భీకరంగా అనుకూలించిన ఆ వికెట్‌పై అతని తిప్పుడు సెలక్టర్ల దృష్టిని దాటిపోలేదు. అందుకే టెస్టు సిరీస్‌లో ఈ రేసుగుర్రం అవసరాన్ని వారు గుర్తించారు. భారత్‌లో ఆడిన ఆరు టెస్టులలో కేవలం 17.28 సగటుతో జడేజా తీసిన వికెట్లు 35... అతని లెఫ్టార్మ్ స్పిన్ పదును ఏమిటో చూపించే అసాధారణ ప్రదర్శన ఇది. ఇప్పుడు జడేజా విలువ మళ్లీ కనిపించింది. ఇక కొన్నాళ్ల పాటు ‘సర్’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలూ కనిపించవు. ఎందుకంటే జట్టు కెప్టెన్ మారినా సత్తా ఉంటే సిఫార్సులతో పని లేదని అతను నిరూపించాడు. ‘మీకు ఇష్టం ఉన్నా లేకున్నా భారత్‌లో ప్రస్తుతం ఉన్న ఆల్‌రౌండర్లు ముగ్గురే. జడేజా, బిన్నీ, అక్షర్’ ఇటీవల దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ పరాజయం అనంతరం కెప్టెన్ ధోని వ్యాఖ్య ఇది. ఫార్మాట్ గురించి స్పష్టంగా చెప్పకపోయినా, తన అనుంగు అనుచరుడు జడేజాను వెనకేసుకొస్తున్న తీరు ఇందులో కనిపిస్తుంది కానీ అతనిపై కెప్టెన్ నమ్మకం ఏమిటో కూడా చూపిస్తుంది. అక్షర్ ఇంత వరకు టెస్టులు ఆడలేదు. తన శైలికి సరిగ్గా సరిపోయే ఇంగ్లండ్‌లాంటి చోట కూడా మూడు టెస్టుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన బిన్నీ ప్రదర్శనను ఏ మాత్రం గొప్పగా పరిగణించలేం. అదే జడేజా కెరీర్ రికార్డు చాలా మెరుగ్గా ఉంది. తాను ఆడిన 13 టెస్టుల్లో ఒక్క నాటింగ్‌హామ్‌లో మినహా అతను అన్ని మ్యాచ్‌లలో వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో అర్ధ సెంచరీ సాధించి భారత్ గెలిచేందుకు తన బ్యాటిం గ్తోనూ కారణంగా నిలిచిన జడేజా, బౌలింగ్ సగటు (27.22) దాదాపు అశ్విన్ (27.54) తో సమానంగా ఉంది. అయినా సరే అతను మొహాలీకి ముందు భారత్ ఆడి న గత 9 టెస్టులకు దూరమయ్యాడు. కచ్చితత్వమే బలం... జట్టు ప్రధాన స్పిన్నర్ అశ్విన్‌తో పోలిస్తే జడేజా బౌలింగ్‌లో ఎక్కువగా వైవిధ్యం కనిపించదు. అతనూ ఎలాంటి ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడడు. నేరుగా వికెట్‌పైకి బంతిని విసరడమే అతని బలం. ముఖ్యంగా సొంతగడ్డపై అతని బంతులు ఒక్కసారిగా బ్యాట్స్‌మెన్ దృష్టిలో అసాధారణంగా మారిపోతాయి. మొహాలి పిచ్‌లో చాలా టర్న్ కనిపించింది. కానీ అలాంటి సమయంలో కూడా అతని బంతులు సరిగ్గా ఆఫ్స్టంప్పైనే పడ్డాయి. దాంతో అతడిని ఎదుర్కొవడం బ్యాట్స్‌మెన్‌కు చాలా కష్టంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో డు ప్లెసిస్ బౌల్డ్ అయిన బంతి, రెండో ఇన్నింగ్స్‌లో ఆమ్లా, విలాస్ బౌల్డ్ అయిన బంతులు బ్యాట్స్‌మెన్ టర్నింగ్ గురించి చేసిన తప్పుడు అంచనాల ఫలితమే! బంతి బంతికీ మధ్య విరామం ఎక్కువగా ఇవ్వకుండా వేగంగా బౌలింగ్ చేసే అతని శైలి క్రీజ్‌లో ఉన్న ఆటగాడికి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఇవ్వదు. పైగా పరుగుల రాక ఒత్తిడి పెరిగిపోతుంది. రెండున్నరేళ్ల క్రితం భారత్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డ తరహాలోనే ఇప్పుడు దక్షిణాఫ్రికా కూడా సిరీస్‌లో మున్ముందు జడేజా బారిన పడేటట్లే కనిపిస్తోంది. నాటి సిరీస్‌లో జడేజా కేవలం 17.49 సగటుతో 24 వికెట్లు పడగొట్టాడు. స్పిన్‌ను ఆడటంలో సిద్ధహస్తుడైన క్లార్క్ఐదు సార్లు జడేజాకే అవుటయ్యాడు. జోరు కొనసాగించాలి... ఒకట్రెండు వైఫల్యాలతో పాటు భుజం గాయం కూడా జడేజా అంతర్జాతీయ కెరీర్‌పై కొంత సందేహాలు రేకెత్తించింది. అయితే ఇప్పుడు అత్యుత్తమ ఫిట్నెస్తో తిరిగొచ్చాడు. సాధారణంగా టెస్టుల్లో కనిపించని గ్రౌండ్ ఫీల్డింగ్‌లో అద్భుతమైన చురుకుదనం, బౌలింగ్‌లో కచ్చితత్వానికి తోడు అవసరమైనప్పుడు ఉపయోగపడే బ్యాటింగ్‌తో ఇప్పుడు జడేజా కొత్తగా కనిపిస్తున్నాడు. తొలి టెస్టులో జడేజా బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడటానికి ప్రయత్నించిన బ్యాట్స్‌మెన్ డిఫెన్స్ ఆడిన ప్రతీసారి మళ్లీ వెనక్కి అంతే వేగంగా క్రీజ్‌లోకి వెళ్లిపోయాడు. ఎందుకంటే అటునుంచి జడేజా స్పందించే వేగానికి రనౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి. ఒక్కసారి స్థానం కోల్పోయాక తిరిగి రావడం ఏ ఆటగాడికైనా చాలా కష్టమైన విషయం. కానీ పట్టుదలగా శ్రమించిన జడేజా తనకు దక్కిన అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నాడు. భవిష్యత్తులోనూ భారత బలం అంటూ టెస్టు కెప్టెన్ కోహ్లి అభిమానాన్ని కూడా చూరగొన్న జడేజా...మరి కొన్నాళ్లు టెస్టుల్లో భారత్ తరఫున కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయి.