‘స్పిన్’గుండంలో తిప్పేద్దాం! | Kohli host in the ring with three spinners | Sakshi
Sakshi News home page

‘స్పిన్’గుండంలో తిప్పేద్దాం!

Published Tue, Nov 8 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

‘స్పిన్’గుండంలో తిప్పేద్దాం!

‘స్పిన్’గుండంలో తిప్పేద్దాం!

భారత్ బలం... ఇంగ్లండ్ బలహీనతా ఇదే
ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి కోహ్లి సేన  
 

మిగిలిన అన్ని జట్లతో పోలిస్తే భారత్ ఏ జట్టుకై నా టెస్టుల్లో జవాబు బాకీ ఉందంటే అది ఇంగ్లండ్‌కే. భారత్‌కు స్వదేశంలో ఓటమిని రుచి చూపించిన ఇంగ్లండ్ ఎనిమిదేళ్లుగా పైచేరుు సాధిస్తూనే ఉంది. అందుకే ఈసారి దీనిని ప్రతీకార సిరీస్‌గా భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రెండో ఆలోచన లేకుండా... ఐదు టెస్టులు జరగబోయే వేదికలన్నింటిలోనూ స్పిన్ పిచ్‌లు సిద్ధం చేయబోతున్నారు. మన బలం, ఇంగ్లండ్ బలహీనతా స్పిన్. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఒకే సెషన్‌లో స్పిన్నర్లకు పది వికెట్లు ఇచ్చేసిన ఇంగ్లండ్ ఈ స్పిన్ గుండంలో చిక్కుకోకుండా గట్టెక్కాలంటే తమ స్థారుుకి మించి ఆడాల్సి ఉంటుంది. ఇటు మన స్పిన్ త్రయం కుక్ సేనను చుట్టేసేందుకు సిద్ధమవుతుంటే... అటు ఇంగ్లండ్ నాణ్యమైన స్పిన్నర్ లేక తలపట్టుకుంది.  
 
క్రీడావిభాగం : యుద్ధమైనా, ఆటైనా... మన బలం ఏంటో తెలుసుకుని బరిలోకి దిగిన వాడు గట్టిగా నిలబడతాడు. ప్రత్యర్థి బలహీత కూడా తెలిసిన వాడు విజయం సాధిస్తాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు భారత బృందం కూడా ఇలాగే ఆలోచించింది. వారి బలహీతను దృష్టిలో ఉంచుకుని పిచ్‌లు తయారు చేరుుస్తోంది. జట్టు ఎంపికలో కూడా స్పిన్నర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. ముగ్గురు స్పిన్నర్లతో ప్రతిసారీ జట్టును ఎంపిక చేసే సెలక్టర్లు ఈసారి నలుగురితో జట్టును ప్రకటించారు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు వీలుగా, ఆ సమీకరణానికి తగ్గట్లుగా వనరులను అందుబాటులోకి తెచ్చారు. ఈ సిరీస్ అంతటా దాదాపుగా ప్రతి మ్యాచ్‌లోనూ భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది. రెండో పేసర్‌గా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఉంటాడు కాబట్టి ముగ్గురు స్పిన్నర్లతో ఆడినా జట్టు సమీకరణం సరిగ్గా కుదరొచ్చు.

అప్పట్లో అజహర్...
ఇంగ్లండ్‌పై గెలవాలంటే ముగ్గురు స్పిన్నర్లతో ఆడటమే ఉత్తమం అని 1992-93 సీజన్‌లోనే అజహరుద్దీన్ చూపించాడు. కుంబ్లే (లెగ్ స్పిన్), రాజేశ్ చౌహాన్ (ఆఫ్ స్పిన్), వెంకటపతి రాజు (లెఫ్టార్మ్ స్పిన్)లతో ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించి, గూచ్ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేశారు. ఈసారి కూడా భారత్‌కు సరిగ్గా అలాంటి కూర్పు దొరికింది. ఆ ముగ్గురు స్పిన్నర్ల తర్వాత మళ్లీ అలాంటి కూర్పే దొరకడం కూడా ఇప్పుడే. ఈసారి అశ్విన్ (ఆఫ్ స్పిన్), జడేజా (లెఫ్టార్మ్ స్పిన్), అమిత్ మిశ్రా (లెగ్ స్పిన్) రూపంలో మూడు రకాల బౌలర్లు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మరోసారి అజహర్ తరహా వ్యూహంతో ఇంగ్లండ్‌ను చుట్టేయాలనేది భారత జట్టు ఆలోచన.

హోమ్‌వర్క్ చేశారు
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత భారత బృందం అశ్విన్, జడేజాలకు విశ్రాంతి ఇచ్చింది. కివీస్‌తో వన్డే సిరీస్ ముఖ్యమే అరుునా ఈ ఇద్దరూ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు తాజాగా బరిలోకి దిగాలనేది జట్టు ఆలోచన. ఈ సిరీస్‌కు భారత్ ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందనే దానికి ఇదే నిదర్శనం. ఈ ఇద్దరు స్పిన్నర్లు కూడా విశ్రాంతి సమయంలో ఖాళీగా కూర్చోలేదు. అశ్విన్ ఓ కొత్త తరహా బంతి కోసం ప్రయత్నం చేశాడు. అలాగే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వీడియోలు చూశాడు. ముఖ్యంగా కుక్, రూట్ ఇద్దరే ఇంగ్లండ్‌కు కీలకం కాబట్టి, ఈ ఇద్దరిపై అశ్విన్ ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాడని సమాచారం. ఇక జడేజా కూడా పూర్తి స్థారుులో ఈ సిరీస్ కోసం హోమ్‌వర్క్ చేశాడు. ఈ ఇద్దరితో పాటు అమిత్ మిశ్రా కూడా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ప్రదర్శన, ముఖ్యంగా వైజాగ్ వన్డేలో తీసిన ఐదు వికెట్లు అమిత్ మిశ్రా ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉంటాయనడంలో సందేహం లేదు. కాబట్టి భారత్ తమ ‘స్పిన్’ అస్త్రంతో  పూర్తి స్థారుులో సిద్ధంగా ఉంది. ఒకవేళ ఈ ముగ్గురిలో గాయం లేదా మరేదైనా కారణంతో ఎవరైనా అందుబాటులో లేకపోతే నాలుగో స్పిన్నర్‌గా జయంత్ యాదవ్ అందుబాటులో ఉన్నాడు.
 
నాలుగేళ్లలో మారిపోరుుంది
ఇంగ్లండ్ జట్టు 2012లో భారత్‌లో పర్యటించే సమయంలోనూ స్పిన్ గురించి ఇలాంటి చర్చే జరిగింది. అరుుతే ఆ సిరీస్‌ను అనూహ్యంగా గెలుచుకుంది. అప్పటి లైనప్‌తో పోలిస్తే ఇప్పుడు రెండు జట్లలోనూ మార్పులు వచ్చారుు. నాలుగేళ్ల క్రితం అశ్విన్ జట్టులో ఉన్నాడు. నాలుగు టెస్టుల్లో కలిసి 14 వికెట్లు తీశాడు. నాడు భారత్‌కు మరో స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా. తను ఆ సిరీస్‌లో 20 వికెట్లు తీశాడు. అరుుతే ఈ ఇద్దరూ ఆశించిన స్థారుులో వేగంగా వికెట్లు తీయలేకపోయారు. ఇదే సమయంలో అటు ఇంగ్లండ్ స్పిన్నర్లు మనవాళ్లకంటే మెరుగైన ప్రదర్శన కనబరిచారు. స్వాన్ 20, పనేసర్ 17 వికెట్లు తీశారు. నిజానికి భారత్ స్పిన్నర్లు, ఇంగ్లండ్ స్పిన్నర్లు సమానంగా వికెట్లు తీసినా... కీలక సమయంలో, విజయానికి అవసరమైన వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ స్పిన్నర్లు సక్సెస్ సాధించారు. అరుుతే ఈ నాలుగేళ్లలో పరిస్థితి మారింది. అశ్విన్ ఇప్పుడు ఓ డైనమైట్‌లా తయారయ్యాడు. మిగిలిన ఇద్దరూ ఫామ్‌లో ఉన్నారు. అటు ఇంగ్లండ్ మాత్రం గ్రేమ్ స్వాన్ రిటైరైన తర్వాత మరో నాణ్యమైన స్పిన్నర్‌ను వెతకడంలో విఫలమైంది. పనేసర్ కూడా కనుమరుగయ్యాడు. ప్రస్తుతం తుది జట్టులో ఉంటారని భావిస్తున్న స్పిన్నర్లకు పెద్దగా అనుభవం లేకపోవడం కూడా ఇంగ్లండ్‌కు కొంత మేరకు ప్రతికూలం.

ఇంగ్లండ్ పరిస్థితి ఏమిటంటే...
ఇంగ్లండ్ కూడా పిచ్ స్వభావాన్ని బట్టి అవసరమైతే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడానికి సిద్ధమై వచ్చింది. ఆ జట్టుకు ప్రధాన స్పిన్నర్ మొరుున్ అలీ. తను తొలుత బ్యాట్స్‌మన్‌గానే కెరీర్ ప్రారంభించాడు. కాబట్టి వారికి ఆల్‌రౌండర్‌గా తన సేవలు అందుబాటులో ఉంటారుు. దీంతో జట్టు కూర్పు విషయంలో వారు పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. అరుుతే ప్రస్తుతం మొరుున్ అలీ ఫామ్ అంతగా బాగోలేదు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో తను 11 వికెట్లు తీశాడు. ఒక ఇన్నింగ్‌‌సలో ఐదు వికెట్లు సాధించాడు. అరుుతే ఢాకాలో పూర్తి స్థారుులో స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై తను విఫలమయ్యాడు. అలాగే లెగ్ స్పినర్ ఆదిల్ రషీద్ కూడా ఇంగ్లండ్ ప్రణాళికల్లో కీలకం. తను కూడా బంగ్లాదేశ్‌లో విఫలమయ్యాడు. తను రెండు టెస్టుల్లో ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక బంగ్లాదేశ్‌లో అరంగేట్రం చేసిన జఫర్ అన్సారీ లెఫ్టార్మ్ స్పిన్నర్. తన తొలి మ్యాచ్‌లో స్పిన్ వికెట్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అరుుతే తను కూడా ఆల్‌రౌండర్ కావడం కొంత మేరకు ఇంగ్లండ్‌కు అదనపు బలం. ఓవరాల్‌గా ఇంగ్లండ్ కూడా భారత్ తరహాలో మూడు రకాల స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది.  అరుుతే ఈ ముగ్గురూ పూర్తి స్థారుులో ఫామ్‌లో లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. వీరితో పాటు హసీబ్ అహ్మద్ రూపంలో మరో లెగ్‌స్పిన్నర్ అందుబాటులో ఉన్నాడు. డకెట్, బ్యాటీ కూడా స్పిన్‌లో సహకరించలగులుతారు.

భారత బ్యాట్స్‌మెన్‌ను తమకు ఉన్న స్పిన్ వనరులతో నియంత్రించడం కష్టం అని ఇంగ్లండ్‌కు తెలుసు. అందుకే ఈ సిరీస్ కోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ మాజీ దిగ్గజం సక్లైన్ ముస్తాక్‌ను సలహాదారుగా పిలిపించుకున్నారు. తనకు కేవలం 15 రోజుల వీసా లభించడంతో తొలి మూడు టెస్టుల వరకూ అందుబాటులో ఉంటాడు. గతంలో కూడా అడపాదడపా ఉపఖండంలో సిరీస్‌లకు ఇలా పాత తరం స్పిన్నర్లను సలహాదారుగా వాడుకున్నారు. ఇటీవల పాకిస్తాన్‌తో యూఏఈలో జరిగిన సిరీస్‌లోనూ సకై ్లన్ ఇంగ్లండ్ జట్టుతో పాటు పని చేశారు. ఆ సిరీస్‌లో కొంత వరకు ఫలితం సాధించగలిగారు. మరి భారత గడ్డపై ఇంగ్లండ్ స్పిన్నర్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. వాళ్ల రాణింపుపైనే ఈ సిరీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement