చుట్టాలబ్బాయి కథ | Aadi's next to release in Jan 201 | Sakshi
Sakshi News home page

చుట్టాలబ్బాయి కథ

Published Sun, Oct 25 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

చుట్టాలబ్బాయి కథ

చుట్టాలబ్బాయి కథ

 ‘ప్రేమ కావాలి’, ‘లవ్‌లీ’ చిత్రాలతో లవర్ బోయ్ ఇమేజ్‌ను సంపాదించుకున్న ఆది నటిస్తున్న తాజా చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ‘పూలరంగడు’, ‘అహ నా పెళ్లంట’ చిత్రాల ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వంలో  రాము తాళ్లూరి, వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నమితా ప్రమోద్ కథానాయిక. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఆది కెరీర్‌లో ఇది ఓ డిఫరెంట్ మూవీ అవుతుంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే చక్కటి  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ఎస్.అరుణ్‌కుమార్, మాటలు: భవానీ ప్రసాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement