
హీరో రవితేజ–దర్శకుడు కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ రానుందన్న టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘అనార్కలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు... ఈ చిత్రంలో కయాదు లోహర్, మమతా బైజు హీరోయిన్లుగా నటించనున్నారని, వచ్చే సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ అయ్యేలా టీమ్ ప్లాన్ చేస్తోందనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ‘అనార్కలి’ సినిమా చిత్రీకరణలో రవితేజ పాల్గొంటారని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment