anarkali
-
అనార్కలీ డ్రస్‌లో అదిరిపోతున్న అదితి రావ్..ధర తెలిస్తే షాకవ్వుతారు!
సింప్లిసిటే తన స్టయిల్ సిగ్నేచరేమో అన్నట్టు ఉంటుంది అదితి రావ్ హైదరీ. ట్రెడిషనల్.. వెస్టర్న్ ఏ వేర్ అయినా ఆమె అందాన్ని పెంచడం కాదు.. ఆమే ఆ కాస్ట్యూమ్స్‌కు కాన్ఫిడెన్స్‌ను ఇస్తుంది! అదీ అదితి ఫ్యాషన్‌ను క్యారీ చేసే పద్ధతి. ఆ అదృష్టాన్ని వరించిన బ్రాండ్స్‌లో ఒకట్రెండు ఇక్కడ.. ఢిల్లీ వింటేజ్ కో మనీష్ ఛాబ్డాను ప్రముఖ డిజైనర్ అనేకంటే సంప్రదాయ చేనేత పరిరక్షకుడు అనొచ్చేమో! ‘ఢిల్లీ వింటేజ్ కో’ బ్రాండ్‌ను ప్రారంభించి.. గత 23 ఏళ్లుగా దేశీ నేత కార్మికులతో పనిచేస్తూ అద్భుతమైన డిజైన్స్‌ను సృష్టిస్తున్నాడు. ధర కాస్త ఎక్కువే. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. అదితి ధరించే ఢిల్లీ వింటేజ్ కో బ్రాండ్ డ్రస్ ధర రూ.1,22,000/- సిల్వర్ స్టీక్ స్టోర్ గోల్డ్ కోటెడ్ సిల్వర్ జ్యూలరీ.. ఈ బ్రాండ్ బాణి. ఇండియన్ సెలబ్రిటీలకు హాట్ ఫేవరేట్ ఇది. ఆన్లైన్లోనే కొనుగోలు చేయాలి. ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్స్ ఓపెన్ కాలేదు. ఆభరణాల నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధర. నా దృష్టిలో డ్రెస్‌కి ఫిట్టింగ్ అనేది చాలా ముఖ్యం. ఆ తర్వాతే ఫ్యాబ్రిక్.. డిజైన్.. స్టయిల్ ఎట్సెట్రా! డ్రెస్ కంఫర్ట్‌గా ఉంటే అందం ఆటోమేటిగ్గా ఫిక్స్ అవుతుంది! అపరాజితా తూర్ టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ ఫుట్‌వేర్ బ్రాండ్స్‌లో అపరాజితా తూర్ ఫుట్‌వేర్ ఒకటి. ముంబైలో మెయిన్ ఆఫీస్ ఉంది. సంప్రదాయ అల్లికలు, కుందన్ వర్క్స్‌తో లభించే ఈ జూతీస్కి ఇండియాలో మంచి గిరాకీ ఉంది. క్యాజువల్ ఫుట్‌వేర్ క్కూడా అందాన్ని అద్దడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. అందుకే, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్ అంటే తీరని మోజు. ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ లభిస్తాయి. అదితి రావ్ ధరించిన ఫుట్ వేర్ బ్రాండ్ ధర రూ. 6,399/-. (చదవండి: 'నా సామిరంగ’ మూవీ హీరోయిన్ చుడిదార్‌లో లుక్ మాములుగా లేదుగా!) -
గుండె బద్దలవుతోంది.. ఏడుపొస్తోంది.. పిడికెడు మట్టి కూడా...
న్యూఢిల్లీ/కాబూల్: అనార్కలీ కౌర్ హోనర్యార్.. అఫ్గనిస్తాన్ ముస్లిమేతర, తొలి మహిళా ఎంపీ.. పురుషాధిక్య సమాజ కట్టుబాట్లను అధిగమించి బలహీనవర్గాల హక్కులు, అభ్యున్నతికి పాటుపడిన ధీశాలి. ఎంతో మంది మహిళలకు అండగా నిలిచిన ధైర్యవంతురాలు. అలాంటి వ్యక్తి ఇప్పుడు.. తాలిబన్ల అరాచకాలకు భయపడి ఎంతగానో ప్రేమించే మాతృదేశాన్ని విడిచారు. తనను, తన కుటుంబాన్ని కాపాడుకోవడం గుండెను దిటవు చేసుకుని శరణార్థిగా భారత్‌కు వచ్చారు. వస్తూ వస్తూ.. మాతృగడ్డ మీద నుంచి పిడికెడు మట్టి కూడా తెచ్చుకోలేకపోయానని కన్నీటి పర్యంతమవుతున్నారు. డెంటిస్ట్ నుంచి ఎంపీగా.. వృత్తిరీత్యా దంతవైద్యురాలైన 36 ఏళ్ల అనార్కలీకి సమాజ సేవ చేయడం ఇష్టం. అందుకే రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీగా ఎన్నికై ప్రజలకు మరింత చేరువయ్యారు. కానీ.. ఎప్పుడైతే తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నారో అప్పటి నుంచి అనార్కలీ, ఆమె బంధువులకు కష్టాలు మొదలయ్యాయి. దేశం విడిచి వెళ్తేనే తప్ప మనుగడ సాగించలేని పరిస్థితి. దీంతో కొంతమంది కెనడా, యూరోప్‌నకు వెళ్లగా.. అనార్కలి తన కుటుంబంతో కలిసి ఆదివారం భారత్‌కు వచ్చారు. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ప్రస్తుతం ఓ హోటల్లో బస చేస్తున్న ఆమె.. జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘అఫ్గనిస్తాన్‌లో ప్రజాస్వామిక, అభ్యుదయ జీవితం గడిపే రోజులు వస్తాయని ఎంతగానో ఆశపడ్డాను. కానీ నా కలలు కల్లలైపోయాయి. దేశం విడిచే దుస్థితి వస్తుందని అస్సలు ఊహించలేకపోయాను. మాతృగడ్డను వదిలే సమయంలో కనీసం పిడికెడు మట్టి కూడా వెంట తెచ్చుకోలేకపోయాను’’ అని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: పాకిస్తాన్ వల్లే తాలిబన్లు ఇలా.. భారత్ మా ఫ్రెండ్: పాప్ స్టార్ నన్ను నమ్మేవారు ‘‘మతాలకు అతీతంగా ముస్లిం మహిళలు నన్ను ఎంతగానో ఆదరించేవారు. నా మాటలను విశ్వసించేవారు. మానవ హక్కుల కమిషన్‌లో పనిచేశాను. ఎంతోమందికి అండగా ఉన్నాను. కానీ.. ఇప్పుడు దేశం విడిచి వచ్చేశాను. నా సహచరులు, స్నేహితులు కాల్స్ చేస్తున్నారు. మెసేజ్‌లు పంపుతున్నారు. వారికి ఏమని సమాధానం చెప్పను. ఒక్కో మెసేజ్ చూస్తుంటే నా గుండె పగిలిపోతోంది. ఏడుపొస్తోంది. ఢిల్లీలో నేను సురక్షితంగా ఉన్నానని వారు సంతోషిస్తున్నా.. వాళ్లను విడిచి వచ్చినందుకు ఎంతగానో బాధపడుతున్నాను’’ అని అనార్కలీ తన బాధను పంచుకున్నారు. అఫ్గన్‌ను వీడినా.. అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, వారితో గడిపిన మధుర క్షణాలు ఎల్లప్పుడూ తన మదిలో పదిలంగా ఉంటాయని ఉద్వేగానికి గురయ్యారు. చదవండి: ‘కాదంటే కాల్చి చంపి, శవాలతో శృంగారం చేస్తారు’ -
సలీం.. అనార్కలీ
మొఘల్ సామ్రాట్ అక్బర్ కుమారుడైన సలీం ఓ రోజు దానిమ్మ తోటలో ఉండగా ఓ అమ్మాయిని చూస్తాడు. ఆమెను చూడగానే ప్రేమలో పడతాడు. తాను యువరాజునని చెప్పకుండా ఆమెతో స్నేహం చేస్తాడు. ఆ యువతి పేరు నదిరా బేగం. ఆమె కూడా సలీంతో ప్రేమలో పడుతుంది. ఓ సారి నదిరా బేగం గాన నాట్యాలకు ముగ్దుడైన అక్బర్ ఆమెను ఆస్థాన నర్తకిగా ఆహ్వానిస్తాడు. దానిమ్మ తోటలో(అనార్ అంటే హిందీలో దానిమ్మ) కనిపించింది గనుక అనార్కలి అనే బిరుదునిస్తాడు. సలీం మేనమామ సైన్యాధిపతి మాన్‌సింగ్‌కు అల్లుడి ప్రేమ విషయం తెలుస్తుంది. అనార్కలిని మరచిపొమ్మని మాన్సింగ్ హెచ్చరిస్తాడు. సలీం వినకపోయే సరికి అతడిని తనతో పాటు యుద్ధానికి తీసుకుపోతాడు. అక్కడ శత్రువులు బానిసల స్థావరంపై దాడి చేసి అనార్కలిని తీసుకుపోయి వేలానికి పెడతారు. అప్పుడు సలీం ఆమెను తన వెంట తెచ్చుకుంటాడు. తర్వాత సలీం యుద్దంలో గాయపడితే అనార్కలి సపర్యలు చేసి అతన్ని కాపాడుకుంటుంది. అయితే సలీం మామూలు సైనికుడు కాదని అక్బర్ కొడుకని తెలుసుకుంటుంది. అనార్కలి తక్కువ కులంలో పుట్టిన యువతి. తక్కువ కులం వారితో ఏటువంటి సంబంధమైనా అప్పటి సమాజంలో నిషిద్ధం. సలీంతో ప్రేమ వ్యవహారం అక్బర్ మహారాజుకు నచ్చదన్న విషయం అనార్కలికి తెలుసు. అయినప్పటికి సలీంకు దూరంగా ఉండలేకపోతుంది. వీరి ప్రేమ విషయం అక్బర్‌కు తెలిసిపోతుంది. తన కొడుకు ఓ సాధారణ నాట్యకత్తెతో ప్రేమలో పడటం అక్బర్ జీర్ణించుకోలేకపోతాడు. అనార్కలిని సలీం దృష్టిలో పడకుండా చేయటానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉన్న అనార్కలి సమాధి విషయం తెలుసుకున్న సలీం కన్న తండ్రిపైనే యుద్ధం ప్రకటిస్తాడు. ఆ యుద్ధంలో సలీం ఓడిపోతాడు. అతడికి మరణశిక్ష పడుతుంది. తన ప్రియుడ్ని మరణం నుంచి తప్పించటానికి అనార్కలి తన ప్రేమను.. ప్రాణాలను పణంగా పెడుతుంది. అక్బర్.. సలీం కళ్లముందే ఆమెను సజీవంగా ఇటుకలతో సమాధి చేయిస్తాడు. అనంతరం తన కుమారుడిని ప్రాణాలతో వదలిపెడతాడు. -
అతికేస్తే.. కొత్తగా!
డ్రెస్ కుట్టడానికి ముందు క్లాత్‌ను కత్తెర్తో తగిన కొలతలలో కత్తిరించి, కుడతాం. అలా కుట్టిన డ్రెస్‌ను ఎప్పుడూ ఒకే విధంగా ధరించాలి. ఒకసారి వేసుకున్న డ్రెస్‌ను మరోసారి ధరించాలంటే నేటి రోజుల్లో అమ్మాయిలు అంతగా ఇష్టపడటం లేదు. ప్రతిసారీ కొత్త డ్రెస్ కావాలంటే కష్టం. అందుకే ఒకే డ్రెస్‌ను రెండు, మూడు విధాలుగా మార్చుకొని ‘కొత్త డ్రెస్’గా రూపొందించుకోవచ్చు. ఇందుకు కావాల్సింది కాస్త సృజన, ఇంకాస్త నేర్పు. ఇక్కడ మీ సౌలభ్యం కోసం ఒక డ్రెస్‌ను రెండు విధాలుగా ఎలా మార్చుకోవచ్చో చూపిస్తున్నాం. లంగా ఓణీ అనార్కలీగా... నిమ్మ పండు రంగు లెహంగా, గులాబీ రంగు బ్లౌజ్, గోధుమ రంగు నెటెడ్ ఓణీతో తీర్చిదిద్దిన డ్రెస్ ఇది. లంగా ఓణీని కొన్ని సార్లు ధరించాక మళ్లీ అదే డ్రెస్ వేసుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. వేడుకలో మరో కొత్త డ్రెస్ ఉంటే బాగుండు అనుకునేవారు లంగా ఓణీనే అనార్కలీగా మార్చేసుకోవచ్చు.బ్లౌజ్ భాగాన్ని, స్కర్ట్ భాగానికి జత చేసి కుట్టాలి. ఓణీని దుపట్టాలా వేసుకోవాలి. ఈ డ్రెస్‌కు బాటమ్‌గా లెగ్గింగ్ లేదా చుడీ వాడితే సరిపోతుంది.ఇప్పుడు అనార్కలీ డ్రెస్సులను మడమల వరకు ధరించడం ట్రెండ్‌గా ఉంది. కాబట్టి లెహంగాలను పొడవాటి అనార్కలీ గౌన్లుగా రూపొందించుకోవచ్చు. నోట్: అనార్కలీని లంగా ఓణీలా కూడా మార్చేసుకోవచ్చు. పొడవాటి అనార్కలీ టాప్‌ను బ్లౌజ్ భాగంలో విడదీసి, మళ్లీ జాగ్రత్తగా కుట్టేయాలి.ఈ తరహా డ్రెస్‌ల రూపకల్పనకు రెగ్యులర్‌గా వాడే మెటీరియల్స్ కాకుండా షిఫాన్, జార్జెట్, నెట్ ఫ్యాబ్రిక్ వాడితే డ్రెస్‌ల అందం చూడచక్కగా ఉంటుంది. స్వరోస్కి, కుందన్స్, లేసులతో అంచుభాగాలను తీర్చిదిద్ది ఎక్కువ లేయర్స్‌గా కూడా అనార్కలీ, లంగాఓణీలను నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. -
అనార్కలీ... ఆల్వేస్ బ్యూటిఫుల్లీ!
కొన్ని వేడుకలు ఆడంబరంగా.. కొన్ని వేడుకలు నిరాడంబరంగా... కొన్ని వేడుకలు ఉల్లాసంగా... కొన్ని వేడుకలు ఉద్వేగంగా... కితాబులు అందుకుంటాయి.సమయం ఏదైనా.. సందర్భం ఏదైనా.. ఆడంబరమైనా.. నిరాడంబరమైనా..వేడుక ఎలాంటిదైనా.. ‘ఆల్వేస్ బ్యూటిఫుల్’ కితాబును అందుకునేదిమాత్రం ఓన్లీ వన్ అనార్కలీనే!ఆకట్టుకునే అనార్కలీ వార్డ్‌రోబ్‌లో ఉంటేవేడుకలో ఖుషీ ఖుషీగా వెలిగిపోవచ్చు. గోటా వర్క్ చేసిన రెడ్ బ్లౌజ్‌కు కింద బ్లూ షిఫాన్ మెటీరియల్‌ను వాడి, గోల్డ్ బార్డర్‌ను జత చేయడంతో అందంగా తయారైంది. దీనికి యాంటిక్ లేస్ ఉన్న నెట్ దుపట్టాను ధరిస్తే చాలు...మీరు బ్రైట్‌గా కనిపిస్తారు. పండు రంగు బ్లౌజ్ ప్యాటర్న్‌కి జర్దోసీ వర్క్ చేసి, కింద చందేరీ కాటన్‌కు యాంటిక్ బెనారస్ బార్డర్‌ను వాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాంటిక్ బెనారస్ బార్డర్‌ను జత చేసిన వంగపండు రంగు దుపట్టా ధరిస్తే పార్టీలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆఫ్ వైట్ బ్లౌజ్ ప్యాటర్న్ చికెన్ శారీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసినది. కింది భాగానికి పసుపు రంగు మల్మల్ క్లాత్ వాడి, క్రోషా లేస్ వేసిన రా సిల్క్ బార్డర్‌ను జత చేయడం ఇలా అందమైన అనార్కలీగా రూపొందింది. దీనికి జూట్ ఫ్యాబ్రిక్ ఓణీ ధరించడంతో కళగా కనిపిస్తోంది. నీలిరంగు ఇక్కత్ ఫ్యాబ్రిక్‌ను బ్లౌజ్ ప్యాటర్న్ తీసుకొని, కింద కోటా లెహెరియాను వాడి, మల్టీకలర్ ఉన్న యాంటిక్ బార్డర్‌ను జత చేయాలి. దీనికి పసుపు రంగు బాందినీ ప్రింట్ గల దుపట్టాను ధరిస్తే మూడీగా ఉన్న వాతావరణం కూడా ఉల్లాసంగా మారిపోతుంది.ట ఎరుపు రంగు లైన్ ఫ్యాబ్రిక్ బార్డర్ గల ఫ్లోరల్ ప్రింట్ కాటన్ అనార్కలీ డ్రెస్ ఇది. బ్లౌజ్ భాగాన్ని ఎరుపు రంగు మెటీరియల్‌కి లేస్ వర్క్‌చేసి, బీడ్స్ వాడితే గ్రాండ్‌గా మారిపోయింది. నెట్ దుపట్టా జత చేస్తే ఇక పార్టీకి సిద్ధమైనట్టే! అనార్కలీ ధరించినప్పుడు అతి అలంకరణకు దూరంగా ఉండాలి. మెడలో సన్నని గొలులు, చెవులకు పెద్ద పెద్ద జూకాలు పెట్టుకుంటే చూడముచ్చటగా ఉంటారు.యాక్సెసరీస్ పూర్తి మ్యాచింగ్ ఎంచుకోకూడదు. డ్రెస్సులో హైలెట్ అయ్యే ఒక రంగును పోలిన యాక్సెసరీస్‌ను వాడాలి. కర్టెసీ: భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్