అనార్కలీ... ఆల్వేస్ బ్యూటిఫుల్లీ!
కొన్ని వేడుకలు ఆడంబరంగా.. కొన్ని వేడుకలు నిరాడంబరంగా... కొన్ని వేడుకలు ఉల్లాసంగా... కొన్ని వేడుకలు ఉద్వేగంగా...
కితాబులు అందుకుంటాయి.సమయం ఏదైనా.. సందర్భం ఏదైనా.. ఆడంబరమైనా.. నిరాడంబరమైనా..వేడుక ఎలాంటిదైనా.. ‘ఆల్వేస్ బ్యూటిఫుల్’ కితాబును అందుకునేదిమాత్రం ఓన్లీ వన్ అనార్కలీనే!ఆకట్టుకునే అనార్కలీ వార్డ్‌రోబ్‌లో ఉంటేవేడుకలో ఖుషీ ఖుషీగా వెలిగిపోవచ్చు.
గోటా వర్క్ చేసిన రెడ్ బ్లౌజ్‌కు కింద బ్లూ షిఫాన్ మెటీరియల్‌ను వాడి, గోల్డ్ బార్డర్‌ను జత చేయడంతో అందంగా తయారైంది. దీనికి యాంటిక్ లేస్ ఉన్న
నెట్ దుపట్టాను ధరిస్తే చాలు...మీరు బ్రైట్‌గా కనిపిస్తారు.
పండు రంగు బ్లౌజ్ ప్యాటర్న్‌కి జర్దోసీ వర్క్ చేసి, కింద చందేరీ కాటన్‌కు యాంటిక్ బెనారస్ బార్డర్‌ను వాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాంటిక్ బెనారస్ బార్డర్‌ను జత చేసిన వంగపండు రంగు దుపట్టా ధరిస్తే పార్టీలో ప్రత్యేకంగా కనిపిస్తారు.
ఆఫ్ వైట్ బ్లౌజ్ ప్యాటర్న్ చికెన్ శారీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసినది. కింది భాగానికి పసుపు రంగు మల్‌మల్ క్లాత్ వాడి, క్రోషా లేస్ వేసిన రా సిల్క్ బార్డర్‌ను జత చేయడం ఇలా అందమైన అనార్కలీగా రూపొందింది. దీనికి జూట్ ఫ్యాబ్రిక్ ఓణీ ధరించడంతో కళగా కనిపిస్తోంది.
నీలిరంగు ఇక్కత్ ఫ్యాబ్రిక్‌ను బ్లౌజ్ ప్యాటర్న్ తీసుకొని, కింద కోటా లెహెరియాను వాడి, మల్టీకలర్ ఉన్న యాంటిక్ బార్డర్‌ను జత చేయాలి. దీనికి పసుపు రంగు బాందినీ ప్రింట్ గల దుపట్టాను ధరిస్తే మూడీగా ఉన్న వాతావరణం కూడా ఉల్లాసంగా మారిపోతుంది.ట
ఎరుపు రంగు లైన్ ఫ్యాబ్రిక్ బార్డర్ గల ఫ్లోరల్ ప్రింట్ కాటన్ అనార్కలీ డ్రెస్ ఇది. బ్లౌజ్ భాగాన్ని ఎరుపు రంగు మెటీరియల్‌కి లేస్ వర్క్‌చేసి, బీడ్స్ వాడితే గ్రాండ్‌గా మారిపోయింది. నెట్ దుపట్టా జత చేస్తే ఇక పార్టీకి సిద్ధమైనట్టే!
అనార్కలీ ధరించినప్పుడు అతి అలంకరణకు దూరంగా ఉండాలి. మెడలో సన్నని గొలులు, చెవులకు పెద్ద పెద్ద జూకాలు పెట్టుకుంటే చూడముచ్చటగా ఉంటారు.యాక్సెసరీస్ పూర్తి మ్యాచింగ్ ఎంచుకోకూడదు. డ్రెస్సులో హైలెట్ అయ్యే ఒక రంగును పోలిన యాక్సెసరీస్‌ను వాడాలి.
కర్టెసీ: భార్గవి కూనమ్
ఫ్యాషన్ డిజైనర్,
హైదరాబాద్