Family entertainer
-
ఫ్యామిలీ ఎంటర్టైనర్
దివంగత నటి, దర్శక–నిర్మాత విజయనిర్మల మనవడు శరణ్ కుమార్ (నటుడు నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ తనయుడు) హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్ కింగ్’. శశిధర్ చావలి దర్శకత్వం వహించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ కథానాయికలు. హన్విక క్రియేషన్ బ్యానర్‌పై బీఎన్ రావు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 24న విడుదలకానుంది. శరణ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మిస్టర్ కింగ్’ నా మొదటి సినిమా. ప్రేక్షకుల ప్రేమ, సపోర్ట్ కావాలి. మా సినిమాని చూసి ఆశీర్వదించాలి’’ అన్నారు. ‘‘యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. అమ్మాయి ఉన్న ప్రతి కుటుంబం, ఆత్మగౌరవం ఉన్న ప్రతి అబ్బాయి చూడాల్సిన మూవీ’’ అన్నారు శశిధర్ చావలి. ‘‘మా చిత్రాన్ని అందరూ థియేటర్లో చూడాలి’’ అన్నారు బీఎన్ రావు. ఈ కార్యక్రమంలో యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్, కెమెరామేన్ తన్వీర్, నటుడు రాజ్ కుమార్ మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: రవి కిరణ్ చావలి, సంగీతం: మణిశర్మ. -
అప్పుడు చైన్‌తో వచ్చా... ఇప్పుడు కత్తితో వస్తున్నా
‘‘ముప్పైమూడు సంవత్సరాల క్రితం అక్టోబరు 5న ‘శివ’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాతో సైకిల్ చైన్ పట్టుకుని వచ్చాను. ఇప్పుడు ఈ అక్టోబరు 5న ఓ కత్తితో ‘ది ఘోస్ట్’ అనే సినిమాతో వస్తున్నాను. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్. విజయదశమి మా ‘ది ఘోస్ట్’ చిత్రానికి కూడా విజయాన్ని ఇస్తుందనుకుంటున్నాను’’ అని నాగార్జున అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న విడుదల కానుంది. కాగా ఆదివారం కర్నూలులో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఈరోజు ఈ వేదికపై నేను, నాగచైతన్య, అఖిల్ ఇంత ప్రేమను పొందడానికి కారణమైన తెలుగు సినీ పరిశ్రమకి, మా నాన్నగారికి (దివంగత అక్కినేని నాగేశ్వరరావు) థ్యాంక్స్ చెప్పాలి. ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో ‘ది ఘోస్ట్’ లో అలానే కనపడతాను. నేను, చైతన్య చేసిన ‘బంగార్రాజు’ సినిమా థియేటర్స్‌లోనే కాదు.. టెలివిజన్ టీఆర్పీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసింది. నెక్ట్స్ అఖిల్‌తో నేను చేయబోయే సినిమా త్వరలో స్టార్ట్ అవుతుంది. మహేశ్‌బాబు ఎప్పుడంటే అప్పుడు అతనితో కలిసి నటిస్తాను. నాకు ఎంతో ఆప్తులైన చిరంజీవిగారి సినిమా ‘గాడ్‌ఫాదర్’ కూడా అక్టోబరు 5న రిలీజ్ కాబోతుంది.. ‘ది ఘోస్ట్, గాడ్‌ఫాదర్’ సినిమాలకు విజయాలు చేకూరాలి’’ అన్నారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ–‘‘గత నాలుగైదు నెలలుగా నాన్నగారిని(నాగార్జున) కలిసిన ప్రతిసారి ‘ది ఘోస్ట్’ గురించే మాట్లాడుకుంటున్నాం.. ఇలాంటి ఎగై్జట్‌మెంట్‌ను నాన్నలో చూసి చాలా రోజులైంది. ‘బంగార్రాజు’ చిత్రం నుంచి ‘ది ఘోస్ట్’కి ఆయన ట్రాన్స్‌ఫార్మ్ అయిన తీరు అద్భుతం. ఈ విధంగా నాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నారు. స్క్రీన్‌పై నాన్నని ఎలా చూడాలనుకున్నానో అలా ప్రవీణ్‌గారు ఈ సినిమాలో చూపించారు’’అన్నారు. హీరో అఖిల్ మాట్లాడుతూ– ‘‘నేను, అన్నయ్య.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నాం. ముప్పై ఏళ్ల తర్వాత కూడా అదే క్రమశిక్షణతో నాన్నగారు సినిమాలు చేస్తున్నారు.. దాన్నిబట్టి మేం ఎంత పరిగెత్తాలనేది అర్థం అవుతోంది. ‘ది ఘోస్ట్’ లో ఏదో ఒక ఫైర్ ఉంది.. సినిమా సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘నాగార్జునగారితో సినిమా చేయడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఆయన అభిమానుల అంచనాలను అందుకునేలా ‘ది ఘోస్ట్’ ఉంటుంది’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. ‘‘నాగార్జున ఎంత స్టైలిష్‌గా ఉంటారో అంతే స్టైలిష్‌గా ఈ సినిమా తీశాం’’ అన్నారు నిర్మాత రామ్మోహన్రావు. ‘‘ది ఘోస్ట్’ తీసినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, సోనాల్ చౌహాన్, నటుడు విక్రమాదిత్య, కెమెరామేన్ ముఖేష్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్, మ్యూజిక్ డియో భరత్, సౌరభ్ తదితరులు పాల్గొన్నారు. -
రావణ లంక ఆడియో విడుదల..
హైదరాబాద్: కే సిరీస్ బ్యానర్‌పై ఓ చిత్రం రూపొందుతుంది. క్రిష్ బండిపల్లి నిర్మాతగా, బీఎన్ఎస్ రాజు దర్శకత్వంలో యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావణ లంక తెరకెక్కుతుంది. ఈ మూవీలో క్రిష్, అశ్విత, త్రిష జంటగా నటిస్తున్నారు.కాగా ప్రధానపాత్రలలో మురళీశర్మ, దేవ్‌గిల్ పోషిస్తున్నారు. ఇటీవలే రావణలంక చిత్ర బృందం విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ క్రమంలో రావణ లంక టీమ్ తాజా మూవీ ఆల్బమ్‌లో ఉన్న మొదటి పాటను విడుదల చేశారు. ఈ పాట ఇటీవల సోషల్ మీడియాలో, యూత్‌లో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. సుజనా తిన్నావారా అనే వాయిస్ మెసేజ్ కీలకంగా సాగుతోంది. -
ప్రతి రోజూ పండగే!
‘చిత్రలహరి’ సినిమాతో ఓ డీసెంట్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నారు సాయిధరమ్ తేజ్. ఇప్పుడు ఓ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథనంపై దృష్టిపెట్టారాయన. మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రాశీఖన్నా కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాకు ‘ప్రతి రోజూ పండగే’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరుగుతుందని తెలిసింది. రెగ్యులర్ షూటింగ్‌ని 27న మొదలుపెట్టనున్నారట. ఇంకో విశేషం ఏంటంటే.. తమిళ నటుడు సత్యరాజ్ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించనున్నారని తెలిసింది. -
అదే నా లక్ష్యం
తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ గుర్తుండే ఉంటుంది. అందులో ఓ చిన్నారి ‘కుక్క కావాలి.. కుక్క కావాలి’ అని మారం చేస్తుంది. ఆ చిన్నారి నటనకు అప్పుడు మంచి మార్కులు పడ్డాయి. తనెవరో కాదు.. ఉత్తేజ్ కూతురు అనే విషయం తెలిసిందే. నేడు విడుదలవుతోన్న ‘పిచ్చిగా నచ్చావ్’ ద్వారా చేతన కథానాయికగా పరిచయమవుతున్నారు. శ్రీవత్స క్రియేషన్స్ పతాకంపై వి.శశిభూషణ్ దర్శకత్వంలో నిర్మాత పెండెం కమల్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చేతనా ఉత్తేజ్ మాట్లాడుతూ– ‘‘ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. రొటీన్‌కు భిన్నంగా ఉండే హాఫ్ బీట్ సినిమాలు చేయడానికి నేనెప్పుడూ రెడీ. దక్షిణాదిలో నటిగా మంచి పేరు తెచ్చుకోవడమే నా ప్రస్తుత లక్ష్యం’’ అని అన్నారు. -
చందమామ నవ్వులు!
రామ్‌కార్తీక్, సనా మక్బూల్ జంటగా తెరకెక్కుతోన్న కామెడీ ఎంటర్టైనర్ ‘మామ.. ఓ చందమామ’. ‘విశాఖ థ్రిల్లర్స్’ వెంకట్ దర్శకత్వంలో శ్రీమతి బొడ్డు లక్ష్మి సమర్పణలో వరప్రసాద్ బొడ్డు నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కుటుంబ విలువలు, హాస్యానికి ప్రాధాన్యం ఇచ్చిన చిత్రమిది. పసలపూడిలో నవంబర్ 11న ప్రారంభించిన తొలి షెడ్యూల్ పూర్తి చేశాం. ఈ నెలాఖరున రెండో షెడ్యూల్ మొదలు పెడతాం’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కెమెరామ్యాన్ బాబు కోనసీమ అందాలను బాగా చూపిస్తున్నారు. ఫిబ్రవరిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని రామ్ కార్తీక్ చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: మురళి సాధనాల. -
తండ్రి ఆశయం నెరవేరిందా?
‘‘గ్రామీణ నేపథ్యం ఉన్న ఓ కుర్రాడు తెలుగు మీడియంలో డిగ్రీ చేస్తాడు. కొడుకు కలెక్టర్ కావాలన్నది తండ్రి ఆశయం. మధ్య తరగతికి చెందిన ఆ కుర్రాడు తన తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేర్చాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఆమె... అతడైతే’. క్లాసికల్ డ్యాన్సర్ హనీష్, కన్నడ భామ చిరాశ్రీ జంటగా కె. సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం. మారుతీ ప్రసాద్, ఎన్. రాధాకృష్ణ నిర్మించారు. యశోకృష్ణన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. నాపై నమ్మకంతో నిర్మాతలు సెట్‌కి కూడా రాలేదు. సినిమా చూసి వారు హ్యాపీగా ఫీలవడంతో వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఓ మంచి పాత్రలో నటించాననే సంతృప్తి ఈ చిత్రం ద్వారా కలిగింది. కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అని హనీష్ చెప్పారు. నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో హీరో తండ్రిగా మంచి పాత్ర చేశా. ఎంటర్టైన్మెంట్తో పాటు చక్కని సందేశం ఉంటుంది’’ అన్నారు. చిరాశ్రీ, యశోకృష్ణన్ పాల్గొన్నారు. -
సరైనోడు.. స్పీడున్నోడు.. స్టార్ట్ చేశారు
మాస్.. ఊర మాస్.. హీరోలను మాంచి మాసీగా చూపడమే కాదు, అవసరమైతే కథ ప్రకారం స్టైలిష్‌గానూ చూపడంలో సరైనోడు అన్పించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. చేసినవి రెండు సినిమాలే అయినా డ్యాన్సుల్లో, ఫైటుల్లో మంచి స్పీడున్నోడు అని పేరు తెచ్చుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ ఇద్దరి కలయికలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించనున్న సినిమా శుక్రవారం మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను కుమారుడు హర్షిత్ కెమేరా స్విచ్చాన్ చేయగా, చిత్ర దర్శక-నిర్మాతల కుమార్తెలు బోయపాటి జోషిత, మిర్యాల ద్వారకలు క్లాప్ ఇచ్చారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘బోయపాటి మార్క్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సాయి శ్రీనివాస్ స్టైలిష్‌గా సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ నెల 16న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కళ: సాహి సురేశ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు, కెమేరా: రిషి పంజాబి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
వైభవాల రాముడొచ్చేశాడే...
రియల్ లైఫ్‌లో తండ్రీ కొడుకులైన సాయి కుమార్, ఆది రీల్ లైఫ్‌లో తొలిసారి తండ్రీ కొడుకులుగా నటించిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్, ఎస్.ఆర్.టి మూవీ హౌస్ పతాకంపై వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మించారు. నమితా ప్రమోద్ కథానాయిక. ఎస్ఎస్ తమన్ స్వరపరచిన పాటలు ఇటీవల విడుదలయ్యాయి. సాయికుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ‘రంగరంగ వైభవాల రాముడొచ్చేశాడే... రంగు రంగు సంబరాల కానుకిచ్చేశాడే...’’ అంటూ సాగే టీజర్లో సాయికుమార్, ఆది అలరించారు. ‘‘పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కింది. అన్నివర్గాల వారికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. బ్యాంకాక్‌లో తీసిన ఆది ఇంట్రడక్షన్ సాంగ్ సినిమాకే హైలెట్. తమన్ మంచి పాటలిచ్చాడు. సినిమాను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. -
బ్రహ్మోత్సవం గురించి ఏమంటున్నారు?
ఫ్యాన్స్‌లో బ్రహ్మోత్సవం మానియా తెల్లవారుజాము నుంచే మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు కేంద్రాల నుంచి మహేష్ అభిమానులు బ్రహ్మోత్సవం సంబరాలకు సంబంధించిన ఫొటోలు, పోస్టర్లను ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. ట్విట్టర్లో బ్రహ్మోత్సవం ఫెస్టివల్ అనే హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అమెరికాలోని 87 సెంటర్లలో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8 గంటల సమయానికి కోటి రూపాయల వసూళ్లు దాటినట్లు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. మొత్తమ్మీద సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోందని అభిమానులు చెబుతున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని మరికొందరు చెబుతున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న టాక్ ముందునుంచే రావడంతో.. అదే అంచనాతో ఆడియన్స్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి కూడా మంచి టాక్ వినిపిస్తున్నట్లు మరో అభిమాని చెప్పారు. ఉదయం 8 గంటలకే కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శన మొదలుకావడంతో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ అంతా సందడిగా కనిపించింది. సుదర్శన్, సంధ్య థియేటర్ల వద్ద అభిమానుల హడావుడి ఎక్కువగా కనిపించింది. Wishing @urstrulyMahesh, @PVPCinema and the entire team of #Brahmotsavam a grand success. — koratala siva (@sivakoratala) 19 May 2016 #Brahmotsavam $157K from 87locs at 10:30am EST — Anil Sunkara (@AnilSunkara1) 19 May 2016 ATB to Srikanth anna & Pvp sir for #Brahmotsavam tomorrow..looking forward to watching @urstrulyMahesh garu spin his magic onscreen :) — Sundeep Kishan (@sundeepkishan) 19 May 2016 Super & Positive Response From All Over States !#BrahmotsavamFestivalDays #Brahmotsavam — Ganesh Khaleja (@GaneshKhaleja) 20 May 2016 Hearing alot of postive reports from US MY verdict is that a movie which u can watch along with ur family happily #brahmotsavamfestivaldays — Pallak Lalwani (@pallaklalwani) 20 May 2016 Go watch as pure Family Film with no own creations.. sure u will love the film a lot -
సమ్మర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్
కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మంచి గిరాకీ ఉంటుంది. పైగా సమ్మర్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూలు కడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే దర్శకుడు విజయ్ శ్రీనివాస్ ‘జీలకర్ర-బెల్లం’ చిత్రాన్ని తెరకెక్కించి నట్లున్నారు. అభిజిత్, రేష్మ,జంటగా ఎ.శోభారాణి, ఆళ్ల నౌరోజీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే... కథ ఏంటంటే... రాహుల్ (అభిజిత్), మైథిలి (రేష్మ) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. జీవితంలో బాగా స్థిరపడేంత వరకూ పిల్లలు వద్దనుకుంటారు. కొంత కాలం వీరి జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఒకసారి ఇద్దరూ చిలుకూరి బాలాజీ టెంపుల్‌కు వెళదామను కుంటారు. చివరి నిమిషంలో రాహుల్‌కు ముఖ్యమైన మీటింగ్ ఉండటంతో అతను ఆఫీసుకు వెళిపోతాడు. దాంతో టెంపుల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పటినుంచి మైథిలి మనసులో భర్త మీద వ్యతిరేకమైన ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. భర్త తనని నిర్లక్ష్యం చేస్తున్నాడన్న భావన మైథిలి మనసులో నాటుకుపోతుంది. కట్ చేస్తే... వీళ్లిద్దరి జీవితంలోకి అమృత అనే పాప ఎంటరవుతుంది. వ్యాపారంలో బిజీగా ఉండే అమృత తల్లిదండ్రులు ఆమెని నిర్లక్ష్యం చేస్తారు. దాంతో రాహుల్, మైథిలీలకు క్రమంగా అమృత దగ్గరవుతుంది. సడన్‌గా అమృత క్యాన్సర్‌తో చనిపోతుంది. పిల్లలు వద్దనుకున్న మైథిలికి మరో షాక్. ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. మళ్లీ రాహుల్-మైథిలీల మధ్య అగాథం ఏర్పడుతుంది. ఈ దూరం తొలగిపోయి ఇద్దరూ ఎలా దగ్గరయ్యారు? అన్నది మిగతా కథ. ‘‘మీ పెళ్లిపుస్తకం మీరే రాస్కోవాలి, చదువుకోవాలి, మీరే దిద్దుకోవాలి’’ అని హీరోయిన్ తండ్రి పాత్రలో సూర్య పలికే సంభాషణలు ఆకట్టుకుంటా యి. తాగుబోతు రమేష్, ఉత్తేజ్ మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు నవ్విస్తాయి. చిన్నచిన్న గొడవలతో దాంపత్యాన్ని విచ్ఛిన్నం చేసుకోకూడదనే కథాంశంతో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. -
గిలిగింతలు పెట్టే హారర్
హారర్ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘వీరి వీరి గుమ్మడి పండు’. దుగ్గిన్ సమర్పణలో కెల్లం కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఎం.వి. సాగర్ దర్శకత్వం వహించారు. పి.ఆర్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల సీడీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీ రాయపాటి సాంబశివరావు విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో 63 మంది కొత్తవాళ్లు నటించారు. డిఫరెంట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ‘‘కథను అనుకున్న విధంగా తెరకెక్కించడానికి టీమ్ మంచి సపోర్ట్ ఇచ్చింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ వేడుకలో ఛాయా గ్రహకుడు కె.యం. కృష్ణ, లైన్ ప్రొడ్యూసర్ కవిత, నాయకానాయికలు రుద్ర, వెన్నెల తదితరులు పాల్గొన్నారు. -
లవ్లీ ఎంటర్టైనర్
ప్రేమకథ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ‘రా..రమ్మని’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. దీపక్, లోవే సాసన్, మధుర ముఖ్య తారలుగా దాసరి బ్రహ్మానందం దర్శకత్వంలో మిద్దె సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత మిద్దె పద్మశ్రీ కెమెరా స్విచాన్ చేయగా, నటుడు సీనియర్ నరేశ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ కీలక పాత్రలో ప్రముఖ నటుడు నటించనున్నారు. నవంబర్ 5న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: రాము పినిశెట్టి. -
చుట్టాలబ్బాయి కథ
‘ప్రేమ కావాలి’, ‘లవ్లీ’ చిత్రాలతో లవర్ బోయ్ ఇమేజ్ను సంపాదించుకున్న ఆది నటిస్తున్న తాజా చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ‘పూలరంగడు’, ‘అహ నా పెళ్లంట’ చిత్రాల ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వంలో రాము తాళ్లూరి, వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నమితా ప్రమోద్ కథానాయిక. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఆది కెరీర్లో ఇది ఓ డిఫరెంట్ మూవీ అవుతుంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ఎస్.అరుణ్‌కుమార్, మాటలు: భవానీ ప్రసాద్. -
నా బ్లడ్‌కే ఓ హిస్టరీ ఉంది!
‘మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం... కానీ అతన్ని రెచ్చగొడితే జీవితానికే ప్రమాదకరం’. ‘నీకు హిస్టరీలోనే బ్లడ్ ఉందేమో... నా బ్లడ్‌కే ఓ హిస్టరీ ఉంది’. బాలకృష్ణ 99వ సినిమా ‘డిక్టేటర్’ టీజర్‌లోని డైలాగ్స్ ఇవి. శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం బాలకృష్ణ హైదరాబాద్‌లో విడుదల చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ -‘‘కథ విషయంలో కొత్తదనాన్ని ఫీలవుతున్నాను. కోన వెంకట్, గోపీ మోహన్ లు అన్ని వాణిజ్య అంశాలు ఉన్న కథను అందించారు. యాక్షన్, ఫ్యామిలీఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అని అన్నారు. -
పండు లాంటి ప్రేమ
అందమైన ప్రేమకథ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ - ‘వీరి వీరి గుమ్మడిపండు’. రుద్ర, వెన్నెల, సంజయ్ ముఖ్యపాత్రల్లో ఎం.వి. సాగర్ దర్శకత్వంలో కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో దర్శక-నిర్మాత ‘మధుర’శ్రీధర్ ఆవిష్కరించారు. ‘‘ఈ చిత్ర దర్శక, నిర్మాతలు ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా’’ అని ‘మధుర’ శ్రీధర్ ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథ చెప్పిన ఐదు నెలల్లోనే ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేశాం. యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని చెప్పారు. చక్కటి ప్లానింగ్‌తో ఈ చిత్రాన్ని అనుకున్న టైమ్‌లో పూర్తి చేశామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: పి.ఆర్, ఛాయాగ్రహణం: కె.ఎమ్. కృష్ణ. -
కల్యాణ్ మావయ్య ఫోన్ చేసి, హెల్మెట్ కొన్నావా అన్నారు!
- సాయిధరమ్ తేజ్ * హరీశ్ శంకర్‌గారు నాకు ‘మిరపకాయ్’ సినిమా టైం నుంచి తెలుసు. ‘రామయ్య వస్తావయ్యా’ సినిమా తర్వాత ఆయన నాకీ కథ చెప్పడానికి వచ్చారు. అప్పుడాయన నాతో ఓ మాట అన్నారు. ‘‘నన్ను ‘గబ్బర్‌సింగ్’ డైరక్టర్‌గా చూడకు. ఇప్పుడు నేను ఫ్లాప్ డైరక్టర్‌గా కథ చెబుతున్నా. నీకు నచ్చితేనే చేద్దాం’’ అన్నారు. కథ నచ్చడంతో, వెంటనే ఓకే చెప్పేశాను. ఈ కథపై నాకు కలిగిన నమ్మకం అలాంటిది. ‘దిల్’ రాజుగారి సినిమాల్లో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్, హరీశ్ శంకర్ మార్క్ కమర్షియల్ హంగులతో ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలుస్తుంది. * చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించాలని తపించే పాత్రను ఈ సినిమాలో చేశాను. అందుకే అమెరికా వెళ్లి రెస్టారెంట్లో వెయిటర్‌లా, టాక్సీ డ్రైవర్‌గా.. డబ్బు కోసం ఇలా చాలా ఉద్యోగాలు చేస్తుంటాను. ఆ టైంలోనే హీరోయిన్‌కు సంబంధించిన ఓ సమస్యను సాల్వ్ చేస్తాను. ఈ క్రమంలోనే తనతో ప్రేమలో పడి, దాన్ని పెళ్లి దాకా ఎలా తీసుకెళ్లాననే ది మిగతా కథ. ఈ సినిమాలో మరో సాయిధరమ్ తేజ్‌ను చూస్తారు. నా గత చిత్రాలకు, ఈ సినిమాలోని పాత్రకు ఎటువంటి పోలిక ఉండదు. ఇందులోని సుబ్రమణ్యం పాత్రను ఆకళింపు చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. * ఈ సినిమాలో చిరంజీవి మావయ్య హిట్ సాంగ్ ‘గువ్వా గోరింకతో...’ పాటను రీమిక్స్ చేయాలన్నది హరీశ్, ‘దిల్’ రాజుగార్ల చాయిస్. ఆ సాంగ్ వేల్యూ చెడగొట్టకుండా చిత్రీకరించాం. ఏదో ఎట్రాక్ట్ చేయాలి అన్నట్టుగా ఈ పాట తీయలేదు. ఆయన సినిమాలను ఎలాగో రీమేక్ చేయలేం. అందుకే కనీసం పాటనైనా రీమేక్ చేయాలన్న ఉద్దేశంతో రీమేక్ చేశాం. ఈ పాటను అమెరికాలోని గ్రాండ్ కేనియన్లో చిత్రీకరించాం. అక్కడ తొలిసారిగా షూటింగ్ జరుపుకున్న సినిమా ఇదే. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు మాత్రమే షూటింగ్‌కు పర్మిషన్ ఇచ్చారు. రాత్రి 12 గంటల వరకు రిహార్సల్స్ చేసి, తెల్లవారుజామున మూడు గంటలకు అక్కడికి బయలుదేరి కేవలం రెండు గంటల్లో పల్లవి, చరణం షూట్ చేశాం. * నేను చిరంజీవి, పవన్‌కల్యాణ్ మావయ్యలను ఇమిటేట్ చేస్తున్నానని చాలా మంది అంటుంటారు. కావాలని వాళ్ల బాడీ లాంగ్వేజ్‌ను ఫాలో కావడం లాంటివి చేయను. చిన్నతనం నుంచి మావయ్యలను దగ్గరగా చూస్తూ పెరిగాను. అందువల్ల ఆ మేనరిజమ్స్ వచ్చాయేమో గానీ కావాలని అలా నటించను. * రెజీనాతో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాలో నటించాను. మంచి సపోర్టింగ్ కో యాక్టర్. రెజీనాతో వర్క్ చేయడం చాలా కంఫర్ట్‌బుల్‌గా అనిపించింది. రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాను. కానీ ఆమె నా ఫ్రెండ్ కాబట్టి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఇద్దరం డిస్కస్ చేసుకుని హరీశ్ శంకర్‌కు చెప్పేవాళ్లం. * ఈ సినిమాలో మొదటిసారిగా నాగబాబు మావయ్యతో నటించాను. ఆయన రాకముందు చాలా ఈజీగా టేక్ ఓకే అయిపోయేది. కానీ ఆయన సెట్లోకి అడుగుపెట్టాక మాత్రం డైలాగ్ చెప్పడానికి టేక్స్ మీద టేక్స్ తీసుకునేవాణ్ణి. నా టెన్షన్ చూసి మావయ్య, హరీశ్‌గారు నాకు సర్ది చెప్పి డైలాగ్ చెప్పించారు. ఈ సినిమా షూటింగ్ టైంలో నాకిది మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమా విజయంపై నాకు చాలా నమ్మకం ఉంది. ప్రేక్షకులకు నచ్చితే చిన్న హీరో, పెద్ద హీరో అన్న తేడా ఉండదు. నచ్చితే సినిమా హిట్ చేస్తారు. * కథల విషయంలో ఎవరూ నాకు సలహాలివ్వరు. నాకేదైనా కథ నచ్చితే మావయ్యలకు ఇన్ఫార్మ్ చేస్తానంతే. నా విషయంలో మావయ్యలు చాలా కేరింగ్‌గా ఉంటారు. కల్యాణ్ మావయ్య తీసుకునే కేర్ గురించి ఓ ఎగ్జాంపుల్ చెప్పాలంటే.. నాకు బాగా డబ్బులు సంపాదించి బైక్ కొనాలని ఎప్పట్నుంచో ఆశ. ఈ మధ్యే హార్లీ డేవిడ్సన్ బైక్ కొన్నాను. ఆ విషయం తెలుసుకుని కల్యాణ్ మావయ్య ఫోన్ చేసి ‘హెల్మెట్ కొనుకున్నావా, గ్లౌజులు కొనుక్కున్నావా’ అని అడిగారు. అంత కేరింగ్‌గా ఉంటారు. * భవిష్యత్తులో నాకు వచ్చిన కథలు మా కుటుంబంలో ఎవరికైనా సెట్ అవుతాయంటే కచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇప్పటివరకూ అలాంటి పరిస్థితి రాలేదు. * మంచి ప్రాజెక్ట్స్‌తో ‘దిల్’ రాజుగారు అప్రోచ్ అయ్యారు. అందుకే నా తదుపరి చిత్రాలు కూడా ఆయనతో కమిట్ అయ్యాను. ఎవరైనా మంచి కథతో వస్తే, కచ్చితంగా వేరే బ్యానర్లో నటించడానికి రెడీ. ప్రస్తుతం ‘తిక్క’ షూటింగ్ జరుగుతోంది. ‘దిల్’ రాజుగారి బేనర్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సుప్రీం ఏసి డీటీఎస్’, అలాగే వేగేశ్న సతీశ్ దర్శకత్వంలో ‘శతమానం భవతి’ సినిమాలు త్వరలో సెట్స్ పైకి వెళతాయి. -
చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్
ప్రముఖ రచయిత దివాకర్‌బాబు తనయుడు శ్రీకర్‌బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంకా ఏమీ అనుకోలేదు’. నిమ్మల శ్రీనివాస్, నిమ్మల రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది. రెహాన్, అమోఘ్ దేశపతి, శ్వేతా జాదవ్ ఇందులో ముఖ్యతారలు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించాం’’ అని చెప్పారు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా తమకు మంచి బ్రేక్ ఇస్తుందని రెహన్, శ్వేతా జాదవ్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి, మాటలు: రమేశ్‌రెడ్డి పూనూరు, సుకుమారన్. -
పైసా ఎక్కువ రోజులు నిలబడే సినిమా అవుతుంది - కృష్ణవంశీ
‘‘చాలాకాలం తర్వాత థియేటర్‌కెళ్లి సినిమా చూశాను. ప్రతి సన్నివేశానికీ జనాల్లో మంచి స్పందన కనిపిస్తోంది. చూసిన చాలామంది ‘మీకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందంటున్నారు’’ అని కృష్ణవంశీ అన్నారు. నాని హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మించిన చిత్రం ‘పైసా’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. కృష్ణవంశీ ఇంకా మాట్లాడుతూ-‘‘ఈ సినిమా విషయంలో దర్శకునిగా పూర్తి సంతృప్తితో ఉన్నాను. రెగ్యులర్ ఫార్మెట్లో వెళ్లకుండా కొత్తగా ట్రై చేసి తీసిన సినిమా ఇది. మెల్లమెల్లగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనుకున్నాను. కానీ, స్పీడ్‌గా ఆదరిస్తున్నారు. డెఫినెట్‌గా ఎక్కువ రోజులు నిలబడే సినిమా అవుతుంది’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘ఇంటర్వెల్ ముందు చార్మినార్ నేపథ్యంలో నానిపై తీసిన సన్నివేశానికి మంచి స్పందన వస్తోంది. మూడే టేకుల్లో ఆ సీన్ తీశాను. అలాగే డబ్బు దొరికిన సన్నివేశంలో నాని నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. రాజారవీంద్ర కేరక్టర్, సాయికార్తీక్ నేపథ్య సంగీతం, హైదరాబాదీ ఆర్టిస్టులు ఆర్కే, తబర్, లోబోల నటన ఈ చిత్రానికి హైలైట్స్’’ అని కృష్ణవంశీ చెప్పారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘మురారి’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని, ఆ సినిమా తర్వాత తాను, నాని కలిసి ఓ సమకాలీన చిత్రం తీస్తామని, దాంట్లో నానినే హీరో అని కృష్ణవంశీ తెలిపారు. విడుదలలో జాప్యం జరిగినా ‘పైసా’కు మంచి టాక్ రావడం ఆనందంగా ఉందని, ఇందులోని తన పాత్రకు మంచి స్పందన వస్తోందని నాని ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో విజయయాత్ర కూడా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి సినిమాను విడుదల చేశాం. ఇప్పుడు స్పందన చూస్తుంటే... చెప్పలేనంత ఆనందం కలుగుతోంది. కృష్ణవంశీ టేకింగ్, నాని యాక్టింగ్, సాయికార్తీక్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచాయి’’ అని తెలిపారు. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో తాను నిర్మిస్తున్న ‘సరదా’ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుందని, అలాగే మంచు మనోజ్ హీరోగా తాను నిర్మించనున్న ‘సన్నాఫ్ పెదరాయుడు’ చిత్రం వచ్చే నెలలో సెట్స్‌కెళుతుందని, ఓ అగ్రహీరోతో హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం ఉంటుందని రమేష్ పుప్పాల చెప్పారు. ఇంకా రాజారవీంద్ర, ఆర్కే, తబర్, సాయికార్తీక్ కూడా మాట్లాడారు.