
బ్రహ్మోత్సవం గురించి ఏమంటున్నారు?
ఫ్యాన్స్‌లో బ్రహ్మోత్సవం మానియా తెల్లవారుజాము నుంచే మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు కేంద్రాల నుంచి మహేష్ అభిమానులు బ్రహ్మోత్సవం సంబరాలకు సంబంధించిన ఫొటోలు, పోస్టర్లను ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. ట్విట్టర్‌లో బ్రహ్మోత్సవం ఫెస్టివల్ అనే హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అమెరికాలోని 87 సెంటర్లలో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8 గంటల సమయానికి కోటి రూపాయల వసూళ్లు దాటినట్లు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. మొత్తమ్మీద సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోందని అభిమానులు చెబుతున్నారు.
కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని మరికొందరు చెబుతున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్న టాక్ ముందునుంచే రావడంతో.. అదే అంచనాతో ఆడియన్స్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి కూడా మంచి టాక్ వినిపిస్తున్నట్లు మరో అభిమాని చెప్పారు. ఉదయం 8 గంటలకే కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శన మొదలుకావడంతో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ అంతా సందడిగా కనిపించింది. సుదర్శన్, సంధ్య థియేటర్ల వద్ద అభిమానుల హడావుడి ఎక్కువగా కనిపించింది.
Wishing @urstrulyMahesh, @PVPCinema and the entire team of #Brahmotsavam a grand success.
— koratala siva (@sivakoratala) 19 May 2016