Brahmotsavam movie
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేశ్ సినిమా చైల్డ్ ఆర్టిస్.. ఎవరో కనిపెట్టారా?
తెలుగు మూలలున్న అమ్మాయి. పుట్టిపెరిగింది అంతా అమెరికాలోనే అయినప్పటికీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మహేశ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. పర్లేదు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడేమో సడన్‌గా హాలీవుడ్లో వరస మూవీస్ చేస్తూ బిజీ అవుతోంది. ఇంకా టీనేజీలోనే ఉన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అవంతిక వందనాపు. ఈమె తల్లిదండ్రులది హైదరాబాద్. కాకపోతే కాలిఫోర్నియాలో సెటిలైపోయారు. ఆ తర్వాత 2005లో ఈమె పుట్టింది. పదేళ్ల వయసులోనే ఈమెకి తెలుగు సినిమాల్లో ఛాన్సులొచ్చాయి. నాని 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాల్లో ఓ చైల్డ్ ఆర్టిస్టుగా అవంతికనే చేయాల్సింది గానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయింది. అలా మహేశ్ 'బ్రహ్మోత్సవం' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. (ఇదీ చదవండి: రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్) మహేశ్ సినిమాలో నటించిన తర్వాత ఈమెకు వరస ఛాన్సులొచ్చాయి. మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్, అజ్ఞాతవాసి తదితర చిత్రాల్లో పలు క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యలో కొన్ని యాడ్స్‌లోనూ నటించింది. వీటి తర్వాత తెలుగు చిత్రాలకు టాటా చెప్పేసిన అవంతిక.. పూర్తిగా కాలిఫోర్నియా షిఫ్ట్ అయిపోయింది. 2020 నుంచి హాలీవుడ్‌లోనే పలు సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్ లాంటివి చేస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం ఈమె వయసు 18 ఏళ్లు. కాకపోతే లేటెస్ట్ ఫొటోలు చూస్తుంటే మాత్రం అలా కనిపించట్లేదు. అలానే చైల్డ్ ఆర్టిస్టు ఫొటోలతో పోల్చి చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. అందుకే ఈమెని తెలుగు ఆడియెన్స్ తొలుత గుర్తుపట్టలేకపోయారు. ఈమె ఎవరో తెలిసేసరికి అవాక్కవుతున్నారు. (ఇదీ చదవండి: సంక్రాంతి మూవీస్.. ఆమె నటిస్తే హిట్ కొట్టడం గ్యారంటీనా?) View this post on Instagram A post shared by avantika (@avantika) -
బ్రహ్మోత్సవం గురించి ఏమంటున్నారు?
ఫ్యాన్స్‌లో బ్రహ్మోత్సవం మానియా తెల్లవారుజాము నుంచే మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు కేంద్రాల నుంచి మహేష్ అభిమానులు బ్రహ్మోత్సవం సంబరాలకు సంబంధించిన ఫొటోలు, పోస్టర్లను ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. ట్విట్టర్లో బ్రహ్మోత్సవం ఫెస్టివల్ అనే హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అమెరికాలోని 87 సెంటర్లలో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8 గంటల సమయానికి కోటి రూపాయల వసూళ్లు దాటినట్లు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. మొత్తమ్మీద సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోందని అభిమానులు చెబుతున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని మరికొందరు చెబుతున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న టాక్ ముందునుంచే రావడంతో.. అదే అంచనాతో ఆడియన్స్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి కూడా మంచి టాక్ వినిపిస్తున్నట్లు మరో అభిమాని చెప్పారు. ఉదయం 8 గంటలకే కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శన మొదలుకావడంతో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ అంతా సందడిగా కనిపించింది. సుదర్శన్, సంధ్య థియేటర్ల వద్ద అభిమానుల హడావుడి ఎక్కువగా కనిపించింది. Wishing @urstrulyMahesh, @PVPCinema and the entire team of #Brahmotsavam a grand success. — koratala siva (@sivakoratala) 19 May 2016 #Brahmotsavam $157K from 87locs at 10:30am EST — Anil Sunkara (@AnilSunkara1) 19 May 2016 ATB to Srikanth anna & Pvp sir for #Brahmotsavam tomorrow..looking forward to watching @urstrulyMahesh garu spin his magic onscreen :) — Sundeep Kishan (@sundeepkishan) 19 May 2016 Super & Positive Response From All Over States !#BrahmotsavamFestivalDays #Brahmotsavam — Ganesh Khaleja (@GaneshKhaleja) 20 May 2016 Hearing alot of postive reports from US MY verdict is that a movie which u can watch along with ur family happily #brahmotsavamfestivaldays — Pallak Lalwani (@pallaklalwani) 20 May 2016 Go watch as pure Family Film with no own creations.. sure u will love the film a lot -
అభిమానులకు మహేశ్ మరో కానుక
ఇక రెండు చక్రాల వాహనాలకు క్రేజ్ తగ్గుతుందా? యూత్ అంతా.. ముఖ్యంగా మహేశ్‌బాబు అభిమానులు మూడు చక్రాల బైక్ మార్కెట్లోకి వస్తే బాగుండు అని కోరుకుంటారా? ఆ ఛాన్సెస్ ఉన్నాయి. మరి.. తమ అభిమాన నాయకుడు తొడుక్కునే చొక్కా నుంచి నడిపే వాహనం వరకూ అన్నింటినీ ఫాలో అవ్వాలనుకుంటారు కదా. అయినా మూడు చక్రాల బైక్ ఏంటి.. వెరైటీగా. ఆ వెరైటీ ఏంటో ‘బ్రహ్మోత్సవం’లో చూసి తెలుసుకోవాల్సిందే. మహేశ్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ సినిమా, ఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె ఈ చిత్రాన్ని నిర్మించారు. కాజల్, సమంత, ప్రణీత కథానాయికలు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. అందులో మూడు చక్రాల బుల్లెట్‌పై మహేశ్ దూసుకెళుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ- ‘‘యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. మంచి కథ, అత్యున్నత సాంకేతిక విలువలు, భారీ తారాగణంతో నిర్మించాం. మహేశ్‌కి కెరీర్‌కు, మా బ్యానర్‌కి ఒక మైలురాయిగా నిలుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా శ్రీకాంత్ అడ్డాల తీర్చిదిద్దారు. మిక్కీ జె.మేయర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను మే 7న హైదరాబాద్‌లో విడుదల చేస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: ఆర్.రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ గుణ్ణం. -
ఒక్క మహేష్... ముగ్గురు భామలు
చెన్నై: హిట్ పెయిర్ మూడోసారి జతకట్టనుంది. ప్రిన్స్ మహేష్ బాబు, సమంత జంటగా మరో సినిమా చేయనున్నారని ఫిలింనగర్ సమాచారం. వీరిద్దరూ కలిసి నటించిన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు విజయవంతం అయ్యాయి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించనున్న చిత్రంలో సమంతను ప్రధాన హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. తాప్సి, ప్రణీతలను సెకండ్ హీరోయిన్లుగా తీసుకునే ఛాన్స్ ఉందని చిత్రవర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకు 'బ్రహ్మోత్సవం' టైటిల్ అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా యూనిట్ ఇంకా దీన్ని ధ్రువీకరించలేదు. ఈ సినిమా షూటింగ్ జూన్ లో ప్రారంభమయ్యే అవకాశముంది.