ఒక్క మహేష్... ముగ్గురు భామలు | Mahesh Babu, Samantha team up for third time | Sakshi
Sakshi News home page

ఒక్క మహేష్... ముగ్గురు భామలు

Published Wed, Apr 15 2015 2:14 PM | Last Updated on Sun, Sep 3 2017 12:20 AM

ఒక్క మహేష్... ముగ్గురు భామలు

ఒక్క మహేష్... ముగ్గురు భామలు

చెన్నై: హిట్ పెయిర్ మూడోసారి జతకట్టనుంది. ప్రిన్స్ మహేష్ బాబు, సమంత జంటగా మరో సినిమా చేయనున్నారని ఫిలింనగర్ సమాచారం. వీరిద్దరూ కలిసి నటించిన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు విజయవంతం అయ్యాయి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించనున్న చిత్రంలో సమంతను ప్రధాన హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నట్టు తెలిసింది.

ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. తాప్సి, ప్రణీతలను సెకండ్ హీరోయిన్లుగా తీసుకునే ఛాన్స్ ఉందని చిత్రవర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకు 'బ్రహ్మోత్సవం' టైటిల్ అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా యూనిట్ ఇంకా దీన్ని ధ్రువీకరించలేదు. ఈ సినిమా షూటింగ్ జూన్ లో ప్రారంభమయ్యే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement