అభిమానులకు మహేశ్ మరో కానుక | Brahmotsavam first-look motion poster released | Sakshi
Sakshi News home page

అభిమానులకు మహేశ్ మరో కానుక

Published Thu, Apr 28 2016 10:15 AM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

అభిమానులకు మహేశ్ మరో కానుక

అభిమానులకు మహేశ్ మరో కానుక

 ఇక రెండు చక్రాల వాహనాలకు క్రేజ్ తగ్గుతుందా? యూత్ అంతా.. ముఖ్యంగా మహేశ్‌బాబు అభిమానులు మూడు చక్రాల బైక్ మార్కెట్లోకి వస్తే బాగుండు అని కోరుకుంటారా? ఆ ఛాన్సెస్ ఉన్నాయి. మరి.. తమ అభిమాన నాయకుడు తొడుక్కునే చొక్కా నుంచి నడిపే వాహనం వరకూ అన్నింటినీ ఫాలో అవ్వాలనుకుంటారు కదా. అయినా మూడు చక్రాల బైక్ ఏంటి.. వెరైటీగా.
 
 ఆ వెరైటీ ఏంటో ‘బ్రహ్మోత్సవం’లో చూసి తెలుసుకోవాల్సిందే. మహేశ్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ సినిమా, ఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె ఈ చిత్రాన్ని నిర్మించారు. కాజల్, సమంత, ప్రణీత కథానాయికలు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. అందులో మూడు చక్రాల బుల్లెట్‌పై మహేశ్ దూసుకెళుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ- ‘‘యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది.
 
 మంచి కథ, అత్యున్నత సాంకేతిక విలువలు, భారీ తారాగణంతో నిర్మించాం. మహేశ్‌కి కెరీర్‌కు, మా బ్యానర్‌కి ఒక మైలురాయిగా నిలుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా శ్రీకాంత్ అడ్డాల తీర్చిదిద్దారు. మిక్కీ జె.మేయర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను మే 7న హైదరాబాద్‌లో విడుదల చేస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: ఆర్.రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ గుణ్ణం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement