చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ | Good Family Entertainer | Sakshi
Sakshi News home page

చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

Published Sat, Jun 14 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

ప్రముఖ రచయిత దివాకర్‌బాబు తనయుడు శ్రీకర్‌బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంకా ఏమీ అనుకోలేదు’. నిమ్మల శ్రీనివాస్, నిమ్మల రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది. రెహాన్, అమోఘ్ దేశపతి, శ్వేతా జాదవ్ ఇందులో ముఖ్యతారలు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించాం’’ అని చెప్పారు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా తమకు మంచి బ్రేక్ ఇస్తుందని రెహన్, శ్వేతా జాదవ్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి, మాటలు: రమేశ్‌రెడ్డి పూనూరు, సుకుమారన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement