
చావా శివకోటి (ఫైల్)
ఖమ్మం గాంధీచౌక్: ప్రముఖ సాహితీవేత్త, సుప్రసిద్ధ కథ, నవలా రచయిత చావా శివకోటి (82) ఖమ్మం మామిళ్లగూడెంలోని స్వగృహంలో మంగళవారం కన్నుమూశారు. ముదిగొండ మండలం గోకినపల్లికి చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రజాసమస్యలపై తన కలాన్ని కొరడాగా మార్చి అనేక రచనలు చేశారు. దాశరథి రంగాచార్య సమకాలికుడిగా తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న వివక్షను తన రచనల ద్వారా ఎలుగెత్తి చాటారు.
శివకోటి అంత్యక్రియలను బుధవారం ఖమ్మంలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. 1940 డిసెంబర్ 14న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శివకోటి ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తిచేసి.. రచనలు ప్రారంభించారు. సాహిత్యంపై ఉన్న అభిరుచితో కథలు, కవితలు, కవితా సంపుటిలు, నవలలు రాసిన ఆయన ‘అసురగణం’నవలతో తెలుగు సాహిత్యంలో సంచలనాన్ని సృష్టించారు. ఆ తర్వాత 27 నవలలు రాయగా, ఆనాటి ప్రముఖ వార, మాస ప
Comments
Please login to add a commentAdd a comment