రావణ లంక ఆడియో విడుదల.. | Tollywood Movie Ravana Lanka Audio Released | Sakshi
Sakshi News home page

రావణ లంక ఆడియో విడుదల..

Published Sat, Aug 22 2020 10:15 PM | Last Updated on Sat, Aug 22 2020 10:20 PM

Tollywood Movie Ravana Lanka Audio Released - Sakshi

హైదరాబాద్‌: కే సిరీస్ బ్యానర్‌పై ఓ చిత్రం రూపొందుతుంది. క్రిష్‌ బండిపల్లి నిర్మాతగా, బీఎన్‌ఎస్‌ రాజు దర్శకత్వంలో యాక్షన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రావణ లంక తెరకెక్కుతుంది.  ఈ మూవీలో క్రిష్‌, అశ్విత, త్రిష జంటగా నటిస్తున్నారు.కాగా ప్రధానపాత్రలలో మురళీశర్మ, దేవ్‌గిల్‌  పోషిస్తున్నారు. ఇటీవ‌లే రావ‌ణ‌లంక చిత్ర బృందం విడుద‌ల చేసిన మోష‌న్ పోస్టర్‌కి  ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని చిత్ర యూనిట్‌ తెలిపింది.

ఈ క్రమంలో రావణ లంక టీమ్‌ తాజా మూవీ ఆల్బమ్‌లో ఉన్న మొదటి పాటను విడుదల  చేశారు. ఈ పాట ఇటీవల సోషల్‌ మీడియాలో, యూత్‌లో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. సుజనా తిన్నావారా అనే వాయిస్‌ మెసేజ్‌ కీలకంగా సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement