లవ్లీ ఎంటర్‌టైనర్
ప్రేమకథ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘రా..రమ్మని’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. దీపక్, లోవే సాసన్, మధుర ముఖ్య తారలుగా దాసరి బ్రహ్మానందం దర్శకత్వంలో మిద్దె సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత మిద్దె పద్మశ్రీ కెమెరా స్విచాన్ చేయగా, నటుడు సీనియర్ నరేశ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ కీలక పాత్రలో ప్రముఖ నటుడు నటించనున్నారు. నవంబర్ 5న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: రాము పినిశెట్టి.