సమ్మర్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ | Family entertainer in Summer | Sakshi
Sakshi News home page

సమ్మర్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

Published Sat, Apr 30 2016 10:47 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

సమ్మర్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

సమ్మర్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మంచి గిరాకీ ఉంటుంది. పైగా సమ్మర్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూలు కడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే దర్శకుడు విజయ్ శ్రీనివాస్ ‘జీలకర్ర-బెల్లం’ చిత్రాన్ని తెరకెక్కించి నట్లున్నారు. అభిజిత్,  రేష్మ,జంటగా ఎ.శోభారాణి, ఆళ్ల నౌరోజీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే...  కథ ఏంటంటే... రాహుల్ (అభిజిత్), మైథిలి (రేష్మ) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.  జీవితంలో బాగా స్థిరపడేంత వరకూ పిల్లలు వద్దనుకుంటారు.
 
  కొంత కాలం వీరి జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఒకసారి ఇద్దరూ చిలుకూరి బాలాజీ టెంపుల్‌కు వెళదామను కుంటారు. చివరి నిమిషంలో రాహుల్‌కు ముఖ్యమైన మీటింగ్ ఉండటంతో అతను ఆఫీసుకు వెళిపోతాడు. దాంతో టెంపుల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పటినుంచి మైథిలి మనసులో భర్త మీద వ్యతిరేకమైన ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. భర్త తనని నిర్లక్ష్యం చేస్తున్నాడన్న భావన మైథిలి మనసులో నాటుకుపోతుంది. కట్ చేస్తే... వీళ్లిద్దరి జీవితంలోకి అమృత అనే పాప ఎంటరవుతుంది. వ్యాపారంలో బిజీగా ఉండే అమృత తల్లిదండ్రులు ఆమెని నిర్లక్ష్యం చేస్తారు.
 
  దాంతో రాహుల్, మైథిలీలకు క్రమంగా అమృత దగ్గరవుతుంది. సడన్‌గా అమృత క్యాన్సర్‌తో చనిపోతుంది. పిల్లలు వద్దనుకున్న మైథిలికి మరో షాక్. ఆమెకు ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అవుతుంది. మళ్లీ రాహుల్-మైథిలీల మధ్య అగాథం ఏర్పడుతుంది. ఈ దూరం తొలగిపోయి ఇద్దరూ ఎలా దగ్గరయ్యారు? అన్నది మిగతా కథ. ‘‘మీ పెళ్లిపుస్తకం మీరే రాస్కోవాలి, చదువుకోవాలి, మీరే దిద్దుకోవాలి’’ అని హీరోయిన్ తండ్రి పాత్రలో సూర్య పలికే సంభాషణలు ఆకట్టుకుంటా యి. తాగుబోతు రమేష్, ఉత్తేజ్ మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు నవ్విస్తాయి.  చిన్నచిన్న గొడవలతో దాంపత్యాన్ని విచ్ఛిన్నం చేసుకోకూడదనే కథాంశంతో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement