తండ్రి ఆశయం నెరవేరిందా? | Classical dancer hanis,cirasri as a pair the movie Aami Thadithe | Sakshi
Sakshi News home page

తండ్రి ఆశయం నెరవేరిందా?

Published Thu, Nov 10 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

తండ్రి ఆశయం నెరవేరిందా?

తండ్రి ఆశయం నెరవేరిందా?

‘‘గ్రామీణ నేపథ్యం ఉన్న ఓ కుర్రాడు తెలుగు మీడియంలో డిగ్రీ చేస్తాడు. కొడుకు కలెక్టర్ కావాలన్నది తండ్రి ఆశయం. మధ్య తరగతికి చెందిన ఆ కుర్రాడు తన తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేర్చాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఆమె... అతడైతే’. క్లాసికల్ డ్యాన్సర్ హనీష్, కన్నడ భామ చిరాశ్రీ జంటగా కె. సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం. మారుతీ ప్రసాద్, ఎన్. రాధాకృష్ణ నిర్మించారు. యశోకృష్ణన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.  నాపై నమ్మకంతో నిర్మాతలు సెట్‌కి కూడా రాలేదు.

సినిమా చూసి వారు హ్యాపీగా ఫీలవడంతో వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఓ మంచి పాత్రలో నటించాననే సంతృప్తి ఈ చిత్రం ద్వారా కలిగింది. కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అని హనీష్ చెప్పారు. నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో హీరో తండ్రిగా మంచి పాత్ర చేశా.  ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చక్కని సందేశం ఉంటుంది’’ అన్నారు. చిరాశ్రీ, యశోకృష్ణన్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement