అదే నా లక్ష్యం | chetana uttej: Pichiga Nachav | Sakshi
Sakshi News home page

అదే నా లక్ష్యం

Published Thu, Mar 16 2017 11:09 PM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

అదే నా లక్ష్యం

అదే నా లక్ష్యం

తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ గుర్తుండే ఉంటుంది. అందులో ఓ చిన్నారి  ‘కుక్క కావాలి.. కుక్క కావాలి’ అని మారం చేస్తుంది. ఆ చిన్నారి నటనకు అప్పుడు మంచి మార్కులు పడ్డాయి. తనెవరో కాదు.. ఉత్తేజ్‌ కూతురు అనే విషయం తెలిసిందే. నేడు విడుదలవుతోన్న ‘పిచ్చిగా నచ్చావ్‌’ ద్వారా చేతన కథానాయికగా పరిచయమవుతున్నారు. శ్రీవత్స క్రియేషన్స్‌ పతాకంపై వి.శశిభూషణ్‌ దర్శకత్వంలో నిర్మాత పెండెం కమల్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. చేతనా ఉత్తేజ్‌ మాట్లాడుతూ– ‘‘ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. రొటీన్‌కు భిన్నంగా ఉండే హాఫ్‌ బీట్‌ సినిమాలు చేయడానికి నేనెప్పుడూ రెడీ. దక్షిణాదిలో నటిగా మంచి పేరు తెచ్చుకోవడమే నా ప్రస్తుత లక్ష్యం’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement