స్వచ్ఛమైన తెలుగు ప్రేమకథ | Chetana Uttej to debut in 'Pichiga Nachav' | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన తెలుగు ప్రేమకథ

Published Thu, Mar 16 2017 12:39 AM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM

స్వచ్ఛమైన తెలుగు ప్రేమకథ

స్వచ్ఛమైన తెలుగు ప్రేమకథ

సంజీవ్, చేతనా ఉత్తేజ్, నందు, కారుణ్య ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్‌’. శశిభూషణ్‌ దర్శకత్వంలో కమల్‌కుమార్‌ పెండెం నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. కమల్‌కుమార్‌ పెండెం మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం యూనిట్‌ అంతా ఓ కుటుంబంలా ఏడాది ప్రయాణం చేశాం.

ఈ చిత్రానికి పాటలు, నేపథ్య సంగీతం హైలెట్‌ అవుతాయి’’  అన్నారు. ‘‘ఫ్యామిలీ అండ్‌ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. అచ్చ తెలుగు స్వచ్ఛమైన ప్రేమకథ. యువతకు సందేశం ఉంటుంది. కథ మొత్తం హీరోయిన్‌ చుట్టూ తిరుగుతుంది. కృష్ణాజిల్లాలో 46 రోజులు ఏకధాటిగా షూటింగ్‌ జరిపాం. సుమారు వంద థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement