జ్ఞాపకాలు మిగిల్చి పోయావా అమ్మ.. కుమార్తెలు ఎమోషనల్ పోస్ట్!
ఉత్తేజ్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చాలా సినిమాల్లో తనదైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. నటుడిగా, రచయితగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తొలి సారిగా శివ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ప్రతి సినిమాలో మెప్పించారు. గాయం, అనగనగా ఒకరోజు చిత్రాల్లో నటించారు. అయితే 2021లో ఆయన కుటుంబం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 13న మరణించారు. ఆమె మృతి చెంది నేటికి రెండేళ్లు పూర్తయింది.
(ఇది చదవండి: ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన దబాంగ్ బ్యూటీ.. ఎన్ని కోట్లంటే? )
ఈ సందర్భంగా అమ్మను తలుచుకుంటూ ఆమె కుమార్తెలు చేతన, పాట ఎమోషనలయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమ్మను తలుచుకుంటూ మాకు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయావంటూ గుర్తు చేసుకున్నారు. పెద్దకూతురు చేతన సైతం అమ్మతో ఉన్న ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ ఎమోషలైంది.
కాగా.. ఉత్తేజ్ పెద్ద కూతురు చేతన 2017లో పిచ్చిగా నచ్చావ్ అనే చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ సినిమా ప్లాప్ కావడంతో కొరియోగ్రాఫర్‌గా సత్తా చాటుతోంది. చిన్న కూతురు పాటకి కూడా మంచి టాలెంట్ ఉంది. ఇటీవలే అకీరా నందన్ పియానో వాయిస్తూ ఉండగా, పాట అద్భుతంగా పాడి అలరించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
(ఇది చదవండి: సమాధిపై పడుకుంటూ కూతురితో ఆడుకున్న హీరో, వీడియో వైరల్ )
View this post on Instagram
A post shared by paata...music ... (@paatauttej1424)
View this post on Instagram
A post shared by paata...music ... (@paatauttej1424)