ప్రతి రోజూ పండగే! | Sai Dharam Tej next film titled Prati Roju Pandage | Sakshi
Sakshi News home page

ప్రతి రోజూ పండగే!

Published Sun, Jun 23 2019 5:40 AM | Last Updated on Sun, Jun 23 2019 5:40 AM

Sai Dharam Tej next film titled Prati Roju Pandage - Sakshi

సాయిధరమ్‌ తేజ్‌

‘చిత్రలహరి’ సినిమాతో ఓ డీసెంట్‌ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నారు సాయిధరమ్‌ తేజ్‌. ఇప్పుడు ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్‌ కథనంపై దృష్టిపెట్టారాయన. మారుతి దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రాశీఖన్నా కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాకు ‘ప్రతి రోజూ పండగే’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరుగుతుందని తెలిసింది. రెగ్యులర్‌ షూటింగ్‌ని 27న మొదలుపెట్టనున్నారట. ఇంకో విశేషం ఏంటంటే.. తమిళ నటుడు సత్యరాజ్‌ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించనున్నారని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement