గిలిగింతలు పెట్టే హారర్ | viri viri gummadi pandu horror movie | Sakshi
Sakshi News home page

గిలిగింతలు పెట్టే హారర్

Published Sun, Nov 8 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

గిలిగింతలు పెట్టే హారర్

గిలిగింతలు పెట్టే హారర్

హారర్ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘వీరి వీరి గుమ్మడి పండు’. దుగ్గిన్ సమర్పణలో కెల్లం కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఎం.వి. సాగర్ దర్శకత్వం వహించారు. పి.ఆర్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల సీడీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీ రాయపాటి సాంబశివరావు విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో 63 మంది కొత్తవాళ్లు నటించారు. డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ‘‘కథను అనుకున్న విధంగా తెరకెక్కించడానికి టీమ్ మంచి సపోర్ట్ ఇచ్చింది. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ వేడుకలో ఛాయా గ్రహకుడు కె.యం. కృష్ణ, లైన్ ప్రొడ్యూసర్ కవిత, నాయకానాయికలు రుద్ర, వెన్నెల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement