Veeri Veeri Gummadi Pandu
-
63 మంది కొత్తవాళ్లతో...
‘‘ఎవరో కొంతమంది మినహా మొత్తం 63 మంది కొత్తవారు మా చిత్రంలో నటించారు. హారర్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం నిర్మించాం’’ అని దర్శకుడు ఎం.వి. సాగర్ అన్నారు. రుద్ర, వెన్నెల, సంజయ్ ప్రధాన పాత్రల్లో దుగ్గిన్ సమర్పణలో శివకృతి క్రియేషన్స్ పతాకంపై కెల్లం కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘వీరి వీరి గుమ్మడిపండు’. హైదరాబాద్‌లో ఈ చిత్ర గీతాల ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథి ‘మధుర’ శ్రీధర్ రెడ్డి చిత్ర బృందానికి డిస్క్‌లు అందించారు. ‘‘సినిమా బాగా వచ్చింది. ఈ 18న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత అన్నారు. రుషిక, రఘు బాబు, శివన్నారాయణ తదిత రులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: పీ.ఆర్, కెమెరా: కె.యం. కృష్ణ. -
గిలిగింతలు పెట్టే హారర్
హారర్ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘వీరి వీరి గుమ్మడి పండు’. దుగ్గిన్ సమర్పణలో కెల్లం కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఎం.వి. సాగర్ దర్శకత్వం వహించారు. పి.ఆర్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల సీడీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీ రాయపాటి సాంబశివరావు విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో 63 మంది కొత్తవాళ్లు నటించారు. డిఫరెంట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ‘‘కథను అనుకున్న విధంగా తెరకెక్కించడానికి టీమ్ మంచి సపోర్ట్ ఇచ్చింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ వేడుకలో ఛాయా గ్రహకుడు కె.యం. కృష్ణ, లైన్ ప్రొడ్యూసర్ కవిత, నాయకానాయికలు రుద్ర, వెన్నెల తదితరులు పాల్గొన్నారు. -
పండు లాంటి ప్రేమ
అందమైన ప్రేమకథ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ - ‘వీరి వీరి గుమ్మడిపండు’. రుద్ర, వెన్నెల, సంజయ్ ముఖ్యపాత్రల్లో ఎం.వి. సాగర్ దర్శకత్వంలో కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో దర్శక-నిర్మాత ‘మధుర’శ్రీధర్ ఆవిష్కరించారు. ‘‘ఈ చిత్ర దర్శక, నిర్మాతలు ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా’’ అని ‘మధుర’ శ్రీధర్ ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథ చెప్పిన ఐదు నెలల్లోనే ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేశాం. యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని చెప్పారు. చక్కటి ప్లానింగ్‌తో ఈ చిత్రాన్ని అనుకున్న టైమ్‌లో పూర్తి చేశామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: పి.ఆర్, ఛాయాగ్రహణం: కె.ఎమ్. కృష్ణ.