అందమైన ప్రేమకథ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ - ‘వీరి వీరి గుమ్మడిపండు’. రుద్ర, వెన్నెల, సంజయ్ ముఖ్యపాత్రల్లో ఎం.వి. సాగర్ దర్శకత్వంలో కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో దర్శక-నిర్మాత ‘మధుర’శ్రీధర్ ఆవిష్కరించారు. ‘‘ఈ చిత్ర దర్శక, నిర్మాతలు ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా’’ అని ‘మధుర’ శ్రీధర్ ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథ చెప్పిన ఐదు నెలల్లోనే ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేశాం.
యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని చెప్పారు. చక్కటి ప్లానింగ్‌తో ఈ చిత్రాన్ని అనుకున్న టైమ్‌లో పూర్తి చేశామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: పి.ఆర్, ఛాయాగ్రహణం: కె.ఎమ్. కృష్ణ.
పండు లాంటి ప్రేమ
Published Tue, Oct 20 2015 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM
Advertisement
Advertisement