చందమామ నవ్వులు! | mama o chandamama movie is a family entertainer | Sakshi
Sakshi News home page

చందమామ నవ్వులు!

Published Fri, Dec 9 2016 1:09 AM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM

చందమామ నవ్వులు!

చందమామ నవ్వులు!

రామ్‌కార్తీక్, సనా మక్బూల్ జంటగా తెరకెక్కుతోన్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘మామ.. ఓ చందమామ’. ‘విశాఖ థ్రిల్లర్స్’ వెంకట్ దర్శకత్వంలో శ్రీమతి బొడ్డు లక్ష్మి సమర్పణలో వరప్రసాద్ బొడ్డు నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కుటుంబ విలువలు, హాస్యానికి ప్రాధాన్యం ఇచ్చిన చిత్రమిది. పసలపూడిలో నవంబర్ 11న ప్రారంభించిన తొలి షెడ్యూల్ పూర్తి చేశాం. ఈ నెలాఖరున రెండో షెడ్యూల్ మొదలు పెడతాం’’ అన్నారు.

‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కెమెరామ్యాన్ బాబు  కోనసీమ అందాలను బాగా చూపిస్తున్నారు. ఫిబ్రవరిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని రామ్ కార్తీక్ చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: మురళి సాధనాల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement