వైభవాల రాముడొచ్చేశాడే... | Dialogue King Birthday Bash | Sakshi
Sakshi News home page

వైభవాల రాముడొచ్చేశాడే...

Published Fri, Jul 29 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

వైభవాల రాముడొచ్చేశాడే...

వైభవాల రాముడొచ్చేశాడే...

రియల్ లైఫ్‌లో తండ్రీ కొడుకులైన సాయి కుమార్, ఆది రీల్ లైఫ్‌లో తొలిసారి తండ్రీ కొడుకులుగా నటించిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్, ఎస్.ఆర్.టి మూవీ హౌస్ పతాకంపై వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మించారు. నమితా ప్రమోద్ కథానాయిక. ఎస్‌ఎస్ తమన్ స్వరపరచిన  పాటలు ఇటీవల విడుదలయ్యాయి. సాయికుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు.

‘రంగరంగ వైభవాల రాముడొచ్చేశాడే... రంగు రంగు సంబరాల కానుకిచ్చేశాడే...’’ అంటూ సాగే టీజర్‌లో సాయికుమార్, ఆది అలరించారు. ‘‘పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అన్నివర్గాల వారికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. బ్యాంకాక్‌లో తీసిన ఆది ఇంట్రడక్షన్ సాంగ్ సినిమాకే హైలెట్. తమన్ మంచి పాటలిచ్చాడు. సినిమాను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement