Chuttalabbayi
-
మా అబ్బాయితో పక్కింటబ్బాయి తీస్తా
- సాయికుమార్ ‘‘చాలా రోజులుగా నేను, ఆది కలిసి నటించాలనుకున్నాం. మా కోరికను వీరభద్రమ్ తీర్చాడు. ‘గరం’ చిత్రం సమయంలో ఆదితో ‘పక్కింటబ్బాయి’ పేరుతో సినిమా తీద్దామనుకున్నా. దర్శకుడు ‘చుట్టాలబ్బాయి’ చేస్తానని చెప్పడంతో సెలైంట్ అయిపోయా. కానీ తప్పకుండా ‘పక్కింటబ్బాయి’ చిత్రం తీస్తా. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని సాయికుమార్ అన్నారు. ఆది, నమితాప్రమోద్ జంటగా వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మించిన ‘చుట్టాలబ్బాయి’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ను హైదరాబాద్ లో నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ ‘అహ నా పెళ్లంట’, ‘పూలరంగడు’ చిత్రాలప్పుడు చాలా ఆనందం పొందాను. ‘చుట్టాలబ్బాయి’తో ఆ సంతోషం రెట్టింపు అయింది. ప్రేక్షకులు మా చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. విజయయాత్రలో భాగంగా తిరుపతిలో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసినప్పుడు నాలోని కొద్దిపాటి టెన్షన్ కూడా పోయింది’’ అన్నారు. ‘‘విజయ యాత్రలో ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ మరచిపోలేనిది. సినిమాను చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఈ విజయం నాలో మరింత ఉత్సాహం నింపింది’’ అని ఆది చెప్పారు. నిర్మాతలు రామ్ తాళ్లూరి, వెంకట్ తలారి, ప్రతాని రామకృష్ణ గౌడ్, బీఏ రాజు, నటులు భద్రం, చమ్మక్ చంద్ర, కెమేరామన్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
చెన్నై ఎక్స్‌ప్రెస్ తరహాలో...
లవ్లీ రాక్‌స్టార్ ఆది, నమితా ప్రమోద్ జంటగా రూపొందిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నె ల 19న విడుదల కానుంది. వెంకట్ తలారి మాట్లాడుతూ- ‘‘అమెరికాలో ఐటీ కన్సల్టెంట్ నడుపుతున్న నేను సినిమాలపై ఉన్న ఆసక్తితో వీరభద్రమ్గారిని కలిశా. ఆయన ‘చుట్టాలబ్బాయి’ కథ చెప్పారు. ఆది, శర్వానంద్, నానిలను అనుకోగా అది ఫైనల్ అయ్యారు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. విలేజ్, సిటీ నేపథ్యంలో ఉంటుంది’’ అని తెలిపారు. మరో నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ- ‘‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ తరహాలో ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సెకండాఫ్‌లో వచ్చే సాయికుమార్ పాత్ర హెలెట్. ఆమెరికా, ఆస్ట్రేలియా, కెనడాల్లోనూ విడుదల చేస్తున్నాం. త్వరలో మూడు కొత్త చిత్రాలు ప్లాన్ చేస్తున్నాం. ఆ సినిమాలు కలిసి చేస్తామా? విడివిడిగా చేస్తామా? అన్నది వారంలో చెబుతాం’’ అన్నారు. -
వైభవాల రాముడొచ్చేశాడే...
రియల్ లైఫ్‌లో తండ్రీ కొడుకులైన సాయి కుమార్, ఆది రీల్ లైఫ్‌లో తొలిసారి తండ్రీ కొడుకులుగా నటించిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్, ఎస్.ఆర్.టి మూవీ హౌస్ పతాకంపై వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మించారు. నమితా ప్రమోద్ కథానాయిక. ఎస్ఎస్ తమన్ స్వరపరచిన పాటలు ఇటీవల విడుదలయ్యాయి. సాయికుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ‘రంగరంగ వైభవాల రాముడొచ్చేశాడే... రంగు రంగు సంబరాల కానుకిచ్చేశాడే...’’ అంటూ సాగే టీజర్లో సాయికుమార్, ఆది అలరించారు. ‘‘పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కింది. అన్నివర్గాల వారికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. బ్యాంకాక్‌లో తీసిన ఆది ఇంట్రడక్షన్ సాంగ్ సినిమాకే హైలెట్. తమన్ మంచి పాటలిచ్చాడు. సినిమాను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. -
'చుట్టాలబ్బాయి' మూవీ వర్కింగ్ స్టిల్స్
-
'చూట్టాలబ్బాయి' వర్కింగ్ స్టిల్స్
-
రికవరీ బాబ్జీ కహానీ!
‘‘కుటుంబ భావోద్వేగాలతో వినోదభరితంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. మన చుట్టూ ఉండే వారందరినీ కలుపుకొని పోయే రికవరీ బాబ్జీ పాత్రలో నటిస్తున్నా. జూన్ మొదటి వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని హీరో ఆది పేర్కొన్నారు. ఆది, నమిత, యామిని జంటగా రామ్ తాళ్లూరి సమర్పణలో వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి నిర్మిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ సినిమా షూటింగ్ ఎనభై శాతం పూర్తయింది. ఈ సందర్భంగా వీరభద్రమ్ మాట్లాడుతూ- ‘‘ ‘పూల రంగడు’ చిత్రకథ మొదట ఆదికే వినిపించా. కానీ, డేట్ల ప్రాబ్లమ్స్ వల్ల ఆదితో చేయలేకపోయా. ‘చుట్టాలబ్బాయి’ కథ సాయికుమార్ గారికి, ఆదికి నచ్చి వెంటనే ఓకే చెప్పేశారు. ఇది పూర్తిగా యాక్షన్ నిండిన ఎంటర్ టైనర్’’ అని దర్శకుడు తెలిపారు. ‘‘సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు ప్రేక్షకులు నవ్వుకుంటూనే ఉంటారు’’ అని నిర్మాత అన్నారు. -
‘చుట్టాలబ్బాయి’లో సాయికుమార్
పేరవరం గౌతమీ గోదావరి చెంతన సోమవారం ‘చుట్టాలబ్బాయి’ సినీ సందడి నెలకొంది. సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన నటులతో గ్రామం కోలాహలంగా మారింది. హీరో ఆది, హీరోయిన్లు నమితా ప్రమోద్, యామిని, పృథ్వి, పోసాని కృష్ణమురళి, జీవా తదితరులపై వివిధ సన్నివేశాలను దర్శకుడు వీరభద్రం తెరకెక్కించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఆర్టీ మూవీస్ అండ్ ఐశ్వర్యలక్ష్మి బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. ధవళేశ్వరం, కడియపులంక, ఆత్రేయపురం తదితర ప్రాంతాల్లో ఈ నెల 20 వరకూ షూటింగ్ జరుగుతుందని తెలిపారు. ఈ సినిమాలో ఒక విలక్షణ పాత్రలో సాయికుమార్ నటిస్తున్నారని చెప్పారు. గతంలో అహ నా పెళ్లంట, పూలరంగడు, బాయ్ తదితర చిత్రాలు నిర్మించామన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా సన్నివేశాలను అందంగా చిత్రీకరించేందుకు ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వీరభద్రం. సంగీతం ఎస్ఎస్ థమన్, నిర్మాత రామ్ తలారి. - పేరవరం (ఆత్రేయపురం) -
చాగల్లులో ‘చుట్టాలబ్బాయి’
చాగల్లు: చాగల్లు రైల్వేస్టేషన్ సమీపంలోని పంట పొలాల్లో బుధవారం సినీ షూటింగ్ సందడి చేసింది. ఎస్ఆర్టీ మూవీస్, ఐశ్వర్య లక్ష్మి మూవీస్ సంయుక్తంగా నిర్మాతలు రామ్, వెంకట్లు నిర్మిస్తున్న ‘చుట్టాలబ్బాయి’ చిత్రంలోని పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. హీరో ఆది, హీరోయిన్ నమితా ప్రమోద్ (తొలిపరిచయం)ల మధ్య పలు ఆసక్తికర సన్నివేశాలను తెరకెక్కించారు. అహనా పెళ్లంట, పూలరంగడు చిత్రాలకు దర్శకుడిగా పనిచేసిన వీరభద్రం ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 20వ తేదీ వరకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని దర్శకుడు వీరభద్రం తెలిపారు. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమకథ చిత్రంగా తెరకెక్కిస్తున్నామన్నారు. రఘుబాబు, సాయికుమార్, ఫృధ్వి, జీవా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారని, సంగీతం ఎస్ఎస్ థమన్ సమకూరుస్తున్నారని చెప్పారు. -
ప్రణీత చుట్టాలబ్బాయిగా ఆది
చెన్నై: అత్తారింటికి దారేది చిత్రంలో బొంగరాలాంటి కళ్లు తిప్పిన ప్రణీత తాజాగా ఆదితో జోడి కట్టనుంది. దర్శకుడు వీరభద్ర చౌదరి దర్శకత్వంలో చుట్టాలబ్బాయి చిత్రం షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ఆ చిత్ర యూనిట్ ఆదివారం చెన్నైలో తెలిపారు. ఈ చిత్రాన్ని వెంకట్ తలారి నిర్మిస్తున్నారు. అలాగే ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో వీరభద్ర చౌదరి సునీల్ హీరోగా నటించిన పూలరంగడు చిత్రానికి దర్శకత్వం వహించాడు.