ప్రణీత చుట్టాలబ్బాయిగా ఆది
చెన్నై: అత్తారింటికి దారేది చిత్రంలో బొంగరాలాంటి కళ్లు తిప్పిన ప్రణీత తాజాగా ఆదితో జోడి కట్టనుంది. దర్శకుడు వీరభద్ర చౌదరి దర్శకత్వంలో చుట్టాలబ్బాయి చిత్రం షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ఆ చిత్ర యూనిట్ ఆదివారం చెన్నైలో తెలిపారు. ఈ చిత్రాన్ని వెంకట్ తలారి నిర్మిస్తున్నారు.
అలాగే ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో వీరభద్ర చౌదరి సునీల్ హీరోగా నటించిన పూలరంగడు చిత్రానికి దర్శకత్వం వహించాడు.