మా అబ్బాయితో పక్కింటబ్బాయి తీస్తా | chuttalabbayi movie Platinum Disc Function | Sakshi
Sakshi News home page

మా అబ్బాయితో పక్కింటబ్బాయి తీస్తా

Published Tue, Aug 30 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

మా అబ్బాయితో పక్కింటబ్బాయి తీస్తా

మా అబ్బాయితో పక్కింటబ్బాయి తీస్తా

 - సాయికుమార్
 ‘‘చాలా రోజులుగా నేను, ఆది కలిసి నటించాలనుకున్నాం. మా కోరికను వీరభద్రమ్ తీర్చాడు. ‘గరం’ చిత్రం సమయంలో ఆదితో ‘పక్కింటబ్బాయి’ పేరుతో సినిమా తీద్దామనుకున్నా. దర్శకుడు ‘చుట్టాలబ్బాయి’ చేస్తానని చెప్పడంతో సెలైంట్ అయిపోయా. కానీ తప్పకుండా ‘పక్కింటబ్బాయి’ చిత్రం తీస్తా. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని సాయికుమార్ అన్నారు.
 
 ఆది, నమితాప్రమోద్ జంటగా వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మించిన ‘చుట్టాలబ్బాయి’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ను హైదరాబాద్ లో నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ ‘అహ నా పెళ్లంట’, ‘పూలరంగడు’ చిత్రాలప్పుడు చాలా ఆనందం పొందాను. ‘చుట్టాలబ్బాయి’తో ఆ సంతోషం రెట్టింపు అయింది. ప్రేక్షకులు మా చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు.
 
 విజయయాత్రలో భాగంగా తిరుపతిలో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసినప్పుడు నాలోని కొద్దిపాటి టెన్షన్ కూడా పోయింది’’ అన్నారు. ‘‘విజయ యాత్రలో ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ మరచిపోలేనిది. సినిమాను చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఈ విజయం నాలో మరింత ఉత్సాహం నింపింది’’ అని ఆది చెప్పారు. నిర్మాతలు రామ్ తాళ్లూరి, వెంకట్ తలారి, ప్రతాని రామకృష్ణ గౌడ్, బీఏ రాజు, నటులు భద్రం, చమ్మక్ చంద్ర, కెమేరామన్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement