Namita pramod
-
మా అబ్బాయితో పక్కింటబ్బాయి తీస్తా
- సాయికుమార్ ‘‘చాలా రోజులుగా నేను, ఆది కలిసి నటించాలనుకున్నాం. మా కోరికను వీరభద్రమ్ తీర్చాడు. ‘గరం’ చిత్రం సమయంలో ఆదితో ‘పక్కింటబ్బాయి’ పేరుతో సినిమా తీద్దామనుకున్నా. దర్శకుడు ‘చుట్టాలబ్బాయి’ చేస్తానని చెప్పడంతో సెలైంట్ అయిపోయా. కానీ తప్పకుండా ‘పక్కింటబ్బాయి’ చిత్రం తీస్తా. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని సాయికుమార్ అన్నారు. ఆది, నమితాప్రమోద్ జంటగా వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మించిన ‘చుట్టాలబ్బాయి’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ను హైదరాబాద్ లో నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ ‘అహ నా పెళ్లంట’, ‘పూలరంగడు’ చిత్రాలప్పుడు చాలా ఆనందం పొందాను. ‘చుట్టాలబ్బాయి’తో ఆ సంతోషం రెట్టింపు అయింది. ప్రేక్షకులు మా చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. విజయయాత్రలో భాగంగా తిరుపతిలో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసినప్పుడు నాలోని కొద్దిపాటి టెన్షన్ కూడా పోయింది’’ అన్నారు. ‘‘విజయ యాత్రలో ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ మరచిపోలేనిది. సినిమాను చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఈ విజయం నాలో మరింత ఉత్సాహం నింపింది’’ అని ఆది చెప్పారు. నిర్మాతలు రామ్ తాళ్లూరి, వెంకట్ తలారి, ప్రతాని రామకృష్ణ గౌడ్, బీఏ రాజు, నటులు భద్రం, చమ్మక్ చంద్ర, కెమేరామన్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
నవ్వించే అబ్బాయ్...
ఆది, నమితా ప్రమోద్ జంటగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తుళ్ళూరి నిర్మిసున్న చిత్రం ‘చుట్టాలబ్బాయ్’. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. జూలై 6న పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘అందర్నీ ఆకట్టుకునే కుటుంబ కథా చిత్రమిది. ప్రారంభం నుంచి ఈరోజు వరకూ చాలా పాజిటివ్ వైబ్స్‌తో షూటింగ్ ముందుకు సాగుతోంది. తమన్ అద్భుతమైన బాణీలు అందించారు’’ అన్నారు. ఆది మాట్లాడుతూ - ‘‘కన్ఫ్యూజ్ కామెడీతో పూర్తి వినోదాత్మకంగా దర్శకుడు చిత్రాన్ని రూపొందించారు. బ్రహ్మానందంగారు, నాకు మధ్య సన్నివేశాలు అందర్నీ నవ్విస్తాయి’’ అని చెప్పారు. ‘‘రాజమండ్రి, హైదరాబాద్, బ్యాంకాక్ తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ వేడుకలో ఛాయాగ్రాహకుడు ఎస్.అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తొమ్మిదేళ్లకే నటినయ్యా..
హీరోయిన్ నమితా ప్రమోద్ తొమ్మిదేళ్లకే తాను చిత్రపరిశ్రమలోకి ప్రవేశించానని అంటోంది మలయాళ భామ నమితా ప్రమోద్. ‘చుట్టాలబ్బాయి’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రశ్న : మీ సినీ రంగ ప్రవేశం ఎప్పుడు జవాబు : తొమ్మిదో ఏట ట్రాఫిక్ అనే మలయాళ చిత్రంలో నటించా. ఇది తెలుగులో కూడా విడుదలయ్యింది. ప్రశ్న : ఎన్ని సినిమాల్లో నటించారు జవాబు : ఇప్పటి వరకు 15 సినిమాల్లో హీరోయిన్గా చేశాను. తెలుగులో ‘చుట్టాలబ్బాయి’తో పరిచయమవుతున్నా. మలయాళంలో దిలీప్, ఉలిధర్, విపిన్పాళి, పృద్వీరాజ్, దుల్కర్ సల్మాన్ వంటి హీరోల సరసన నటించాను. ప్రశ్న :: ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు జవాబు : గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు, గుర్తింపునకు ఆస్కారం ఉండే పాత్రలు చేయాలని ఉంది. ప్రశ్న : భాష ఇబ్బందులు ఉన్నాయా జవాబు : నటించడానికి భాషతో పనిలేదు. నటులకు భాష అడ్డుకాదు. గుర్తింపు వచ్చే పాత్రలు వస్తే ఏ భాషలోనైనా నటిస్తా. ఎన్ని చిత్రాల్లో నటించామన్నది ముఖ్యం కాదు. ఎన్ని మంచి సినిమాలు చేశామన్నదే ప్రధానం. ప్రశ్న : మీ విద్యాభ్యాసం జవాబు : బీఏ లిటరేచర్ చదువుతున్నా.