తొమ్మిదేళ్లకే నటినయ్యా.. | Namita pramod interview with sakshi | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్లకే నటినయ్యా..

Published Sun, Mar 6 2016 12:47 PM | Last Updated on Tue, Aug 28 2018 5:11 PM

తొమ్మిదేళ్లకే నటినయ్యా.. - Sakshi

తొమ్మిదేళ్లకే నటినయ్యా..

హీరోయిన్ నమితా ప్రమోద్
 
తొమ్మిదేళ్లకే తాను చిత్రపరిశ్రమలోకి ప్రవేశించానని అంటోంది మలయాళ భామ నమితా ప్రమోద్. ‘చుట్టాలబ్బాయి’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఆమె విలేకరులతో మాట్లాడారు.
 

ప్రశ్న :  మీ సినీ రంగ ప్రవేశం ఎప్పుడు
జవాబు : తొమ్మిదో ఏట ట్రాఫిక్ అనే మలయాళ చిత్రంలో నటించా. ఇది తెలుగులో కూడా విడుదలయ్యింది.


ప్రశ్న : ఎన్ని సినిమాల్లో నటించారు
జవాబు : ఇప్పటి వరకు 15 సినిమాల్లో హీరోయిన్‌గా చేశాను. తెలుగులో ‘చుట్టాలబ్బాయి’తో పరిచయమవుతున్నా. మలయాళంలో దిలీప్, ఉలిధర్, విపిన్‌పాళి, పృద్వీరాజ్, దుల్కర్ సల్మాన్ వంటి హీరోల సరసన నటించాను.


ప్రశ్న :: ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు  
జవాబు : గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు, గుర్తింపునకు ఆస్కారం ఉండే పాత్రలు చేయాలని ఉంది.  


 ప్రశ్న : భాష ఇబ్బందులు ఉన్నాయా
జవాబు : నటించడానికి భాషతో పనిలేదు. నటులకు భాష అడ్డుకాదు. గుర్తింపు వచ్చే పాత్రలు వస్తే ఏ భాషలోనైనా నటిస్తా. ఎన్ని చిత్రాల్లో నటించామన్నది ముఖ్యం కాదు. ఎన్ని మంచి సినిమాలు చేశామన్నదే ప్రధానం.


ప్రశ్న : మీ విద్యాభ్యాసం
జవాబు : బీఏ లిటరేచర్ చదువుతున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement