నవ్వించే అబ్బాయ్... | chuttalabbai movie shooting completed | Sakshi
Sakshi News home page

నవ్వించే అబ్బాయ్...

Published Sat, Jun 25 2016 10:27 PM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

నవ్వించే అబ్బాయ్...

నవ్వించే అబ్బాయ్...

ఆది, నమితా ప్రమోద్ జంటగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తుళ్ళూరి నిర్మిసున్న చిత్రం ‘చుట్టాలబ్బాయ్’. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. జూలై 6న పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
 శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘అందర్నీ ఆకట్టుకునే కుటుంబ కథా చిత్రమిది. ప్రారంభం నుంచి ఈరోజు వరకూ చాలా పాజిటివ్ వైబ్స్‌తో షూటింగ్ ముందుకు సాగుతోంది. తమన్ అద్భుతమైన బాణీలు అందించారు’’ అన్నారు.
 
 ఆది మాట్లాడుతూ - ‘‘కన్ఫ్యూజ్ కామెడీతో పూర్తి వినోదాత్మకంగా దర్శకుడు చిత్రాన్ని రూపొందించారు. బ్రహ్మానందంగారు, నాకు మధ్య సన్నివేశాలు అందర్నీ నవ్విస్తాయి’’ అని చెప్పారు. ‘‘రాజమండ్రి, హైదరాబాద్, బ్యాంకాక్ తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ వేడుకలో ఛాయాగ్రాహకుడు ఎస్.అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement