తీవ్రవాదం నేపథ్యంలో... | Adi New Movie Operation Goldfish The Direction Of Sai kiran | Sakshi
Sakshi News home page

తీవ్రవాదం నేపథ్యంలో...

Published Fri, Sep 27 2019 12:56 AM | Last Updated on Fri, Sep 27 2019 12:56 AM

Adi New Movie Operation Goldfish The Direction Of Sai kiran - Sakshi

‘వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత’ వంటి సెన్సిబుల్‌ హిట్‌ సినిమాలు తీసిన సాయికిరణ్‌ అడివి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ (ఒ.జి.యఫ్‌). ఆది సాయికుమార్‌ హీరోగా నటించారు. ప్రముఖ రచయిత అబ్బూరి రవి ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. ప్రతిభా అడివి, కట్టా ఆశిష్‌ రెడ్డి, కేశవ్‌ ఉమాస్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీష్‌ డేగల, పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 18న విడుదల కానుంది. సాయికిరణ్‌ అడివి మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా కల్పిత కథాంశంతో రూపొందిన చిత్రమిది. తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్‌ పూర్తయింది.

శ్రీచరణ్‌ పాకాల చక్కటి స్వరాలు, నేపథ్య సంగీతం అందించాడు. మా సినిమాలో దేశభక్తి గీతాన్ని పాడిన కీరవాణిగారికి థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘తొలిసారి ఎన్‌.ఎస్‌.జి కమాండోగా నటించాను. నా లుక్‌కు మంచి స్పందన వచ్చింది. సాయికిరణ్‌ అడివిగారు కథపై ఎంతో పరిశోధన చేసి ఈ సినిమా తీశారు. కశ్మీర్‌ పండిట్ల జీవితాలను, అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు’’ అన్నారు ఆది సాయికుమార్‌.  ‘ఎయిర్‌ టెల్‌’ మోడల్‌ శషా చెట్రి, కార్తీక్‌ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, కృష్ణుడు, అనీశ్‌ కురువిల్లా, రావు రమేశ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:  జైపాల్‌ రెడ్డి నిమ్మల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిరణ్‌ రెడ్డి తుమ్మ, సహ నిర్మాత: దామోదర్‌ యాదవ్‌ (వైజాగ్‌).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement