సిటీలో చుట్టాలబ్బాయ్
సిటీలో చుట్టాలబ్బాయ్
Published Fri, Aug 26 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
డాబాగార్డెన్స్: చుట్టాలబ్బాయ్ సినిమా విజయోత్సవం శుక్రవారం వీ–మాక్స్ «థియేటర్లో సందడిగా సాగింది. విజయయాత్రలో భాగంగా ఆ చిత్ర యూనిట్, హీరో ఆది, నటుడు సాయికుమార్ వీ–మాక్స్ «థియేటర్‌కు విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ తన కుమారుడు ఆదితో తొలిసారిగా నటించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. విజయయాత్ర తిరుపతిలో ప్రారంభమైందని, శ్రీకాకుళంలో శనివారం ముగుస్తోందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు సాయికుమార్ సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారన్నారు. హీరో ఆది మాట్లాడుతూ ఈ చిత్రం తొలి షో నుంచి హిట్ టాక్ వచ్చిందన్నారు. ఎనిమిది సినిమాల తర్వాత తండ్రితో నటించానని చెప్పారు. చిత్ర దర్శకుడు వీరభద్ర మాట్లాడుతూ తాము ఊహించినదానికంటే ఎక్కువ విజయం సాధించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో శ్రీలక్ష్మీనారాయణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ప్రతినిధులు చంద్రశేఖర్, కిరణ్, శ్రీరామ్, వీ–మాక్స్ «థియేటర్ నిర్వాహకులు విజయ్, సురేంద్ర, వాసు పాల్గొన్నారు.
Advertisement
Advertisement